పువ్వులము……సుకుమారమైన పువ్వులం
కలకలనవ్వులం
మీపూ తోటకు మహారాణులం
జీవితకాలం ఒక్కరోజు…… కొన్ని గంటలైనా
అందరినీ ఆకర్షిస్తాము హాయిని మధురాతి అనుభవాన్ని స్తాము
అమ్మఒడిలో నాన్నచేతులమధ్య
అల్లారుముద్దుగా ముగ్ధ గా ఒదిగిపోతాము
చిరుగాలులతోసయ్యాటలాడుతాము
మంచు భిందువులను హృదయానికి హత్తుకుంటాము
వేకువజామునమాకంటేముందుగాలేచి
అరుణకిరణాలనుఅశ్వాదిస్తూవుంటే
తల్లిఒ డినుండి వేరుచేసి ఇంటియజమానులరాకతో
కోసుకున్నవాటిలో కొన్నింటిని
నేలపై రాల్చి
తొక్కుకుంటూ పరుగులు తీస్తారు అవునా
మమ్ములను పులగు చ్ఛాలలో అమర్చి
ఏయిర్ పోర్టులకు, సభలకు, వేడుకలకు, వేదికలకు పుట్టినరోజు పెళ్లి రోజు పార్టీల కు
ఆస్పిటల్సు కు తీసుకుపోతారు
రాజకీయనాయకులు మేము అప్పుడేకలుసుకున్న మిత్రులతో
హాయిగా వుంటే
మమ్ములనుఅందుకొనిమూలపడేస్తారు
గుడిలో దేవతావిగ్రహల పాదాలచెంత చేరుతాము చేతులెత్తిమొక్క నివ్వరు కొత్త పువ్వులు రాగానే మమ్ములను తోసేసికొత్తవారికి చోటిస్తారు అవునా
అందంగా పక్కలమీద పరచుకుంటూ నవ్వుకుంటున్న
మమ్ములను నలిపివేస్తారు
మేము అందమైన పువ్వులం
మీసవతి పిల్లలంకాదు
మమ్ములను చక్కగా చూచుట
నేర్చుకోండి
మాకుప్రాణాలున్నాయిఅవిభాధపడతాయనితెలుసుకోండి
సోదరీ సోదరమణులరా!