ఉదయాన్నే లేచి ఇంటి పనంతా చేసి పిల్లలను స్కూల్ కి పంపించి పని అంతా అయ్యాక అలా నడుము వలచిన స్నేహను వాళ్ళ ఆయన లంచ్ కు వస్తూనే “పడుకోవడమే పని” అని తిడుతూనే తిని వెళ్లారు..
మరుసటి రోజు స్నేహం తను ఏదో నవల చదువుతూ ఉంటే “నవలలే చదువుకో” అని రుసరుస లాడుతూ భోంచేసి వెళ్లారు
మరో రోజు టీవీ చూస్తూ ఉంటే …
“సుమని చూడు ఎంత బాగా తెలుగు మాట్లాడుతుందో మాతృభాష కాకుండా” అంటూ దెప్పిపొడుస్తూ లంచ్ చేసి వెళ్లారు… రోజు ఇదే తంతు ఇల్లాలు అన్నాక ఇంటి పని చేసి కాసేపు నవల చదవకుండా.. టీవీ చూడకుండా ఎలా ఉంటారు?
ఏం చేసినా తప్పుపడుతుంటే ఏం చేయాలో అర్థం కాక ముభావంగా ఉంటూ ఉండేది .
ఓ రోజు ఒక ఫామ్ తెచ్చిస్తే నింపి పెట్టింది అదేంటో కూడా తనకు తెలియదు…
కొన్ని రోజులకు నీవు ఐసెట్ ఎగ్జామ్ రాయాలి అని చెప్పారు .ఎలాగో ప్రిపేర్ అయ్యి ఎగ్జామ్ రాస్తుంటే తనకు తలనొప్పి లేసింది .
ఏం చేయాలో తోచక కోషన్స్ చదవకుండానే టకటక ఆన్సర్ షీట్ లో బబుల్స్ నింపి వచ్చేసింది .
ఆరోజు ఓ విషయం గుర్తొచ్చింది తనకొక రోజు ఎగ్జామ్ రాస్తున్నట్టు ఎగ్జామ్లో మ్యాథ్స్ ప్రాబ్లం రాకా తలనొప్పి లేస్తున్నట్టు కల వచ్చింది టెన్షన్తో లేచి కూర్చొని అయినా నేను ఎగ్జామ్ రాయడం ఏంటి బైపీసీ కదా నేను మ్యాథ్స్ ఎగ్జామ్ ఎందుకు రాస్తాను అనుకుంది కానీ ఆ కల ఇలా నిజమవుతుంది అనుకోలేదు .
ఎట్లాగో క్వాలిఫై అయింది వాళ్ళ ఇంటి పక్కనే కాలేజీలో చేరింది .
తన బ్యాడ్ లక్ కాల్ లెటర్ వచ్చేసరికి ఆమె వయసు రియంబర్మెంట్స్ ఇచ్చే వయసు దాటిపోయింది అంటే మూడు పదులు దాటాయి కాలేజీకి వెళ్లాలంటే తనకంటే తక్కువ వయసు వాళ్లతో ఎలా మసులుకోవాలో ఏమనుకుంటారు అని ఒకటే బాధ పడేది.కానీ కాలేజీలో చేరాక తన వయసు మర్చిపోయి అందరితో కలిసి ఆనందంగా మళ్ళీ కాలేజీ వయసులో ఉన్నట్టుగానే సరదాగా ఉండేది . ఒకరోజు తమ సీనియర్స్ రాగింగ్ చేస్తుంటే ఎవరిని ఎవరు రాగింగ్ చేస్తున్నారు తెలియకుండా ఆ రాగింగ్ జరిగింది.
ఆ విశేషాలు అందరికీ చెప్తూ బాగా నవ్వుకుంది.
కాలేజీలో సెమినార్ జరుగుతుంటే వాళ్ళ ప్రొఫెసర్ “స్నేహ స్నేహా” అని పిలుస్తుంటే స్నేహితులు సార్ నిన్నే పిలుస్తున్నారంటూ కుళ్ళుకోవడం ..
స్నేహ డిబేట్స్..స్పీచ్ ల్లో చురుకుగా పాల్గొనడం వల్ల ప్రోఫెసర్స్ ఆమె కే అవకాశాలు ఇచ్చే వారు..
కాలేజీ పక్కనే ఇల్లు కావడంతో ఏ దైనా బంద్ అయితే కాలేజీ ఉందా ?లేదా? కనుక్కోవడానికి స్నేహా కాలేజీకి వెళ్లి వచ్చేది.
ఉన్నది లేనిది ఫోన్ చేసి స్నేహా సు కనుక్కునేవారు వారి స్నేహితులు వాళ్ళ సార్లు కూడా ఆమెను పెద్దామె అని కొంచెం గౌరవంగానే పిలిచేవారు. అయినా అందరి కంటే ఎక్కువ అల్లరి చేసేది అన్నిట్లో చురుకుగా పాల్గొనేది .
వాళ్ళ కంప్యూటర్ సార్ చాలా అందంగా ఉంటే …
స్నేహ స్నేహితులంతా సార్ గురించి మాట్లాడుకునే వాళ్ళు తను మాత్రం ఆ సార్ ని చూస్తే చిన్న తన కంటే వయసులో చిన్నవాడు కనుక తమ్ముడు లా అనుకునేది.. తమ్ముడు లానే ఉండేవారు ..ఆ సార్ కూడా…
ఒక్కోసారి తమ్ముని పిలిచినట్టే “అరే ” అని పిలవబోయి నోరు కరుచుకునేది.
మిగతా పిల్లలు సార్ ని కొరకు తినేటట్టు చూసేవాళ్ళు ఎంతైనా వయసులో ఉన్న పిల్లలు కదా తను తను ఆ వయసులో ఉన్నప్పుడు కూడా తన పేరుకు తగ్గట్టే అందరిని స్నేహభావంతోటే చేసేది .
ఆకర్షణ ప్రేమ అలాంటి వాటికి చాలా దూరంగా ఉండేది. ఒకరోజు వాళ్ళ సార్ ఒక టాస్క్ ఇచ్చారు అందరూ ఏదో ఒక టాపిక్ తీసుకొని టీచ్ చేయాలని అందరూ దాన్ని అంతగా పట్టించుకోలేదు.
కానీ స్నేహ బాగా ప్రిపేర్ అయ్యి క్లాసులో చక్కగా చెప్పింది అందరూ మెచ్చుకున్నారు.
ఓక్కొసారీ తన స్నేహితులు స్వప్న సారిక క్లాసులు ఎగ్గొట్టి సినిమాలకు కూడా వెళ్లే వాళ్ళు .
అందరు సార్లు స్నేహను ఏమీ అనేవారు కాదు కానీ నరేందర్ సార్ అని ఒకతను స్నేహను ఏదైనా సందేహం అడగపోయినా “చాల్లే మ్మ కూర్చో నువ్వు నాకంటే పెద్దదానివి” అంటూ ఎగతాలి చేసేవాడు.
పాపం స్నేహ ఆ రోజంతా ఏడుస్తూ కూర్చుండేది.
తను ఇద్దరి పిల్లల తల్లి అయినా …వాళ్ళ ఆయన పోరు పడలేక ఇంట్లో ఉండలేక తనకు చదువు రాదని తెలివితక్కువదని ఎగతాళి చేసే భర్తకు తనెంటో నిరూపించాలని కాలేజీలో చేరింది కానీ తను కూడా అమ్మని అన్న విషయం మర్చిపోయి అమ్మాయి లాగానే కొత్త కొత్త డ్రెస్సులు వేసుకొని కాలేజీ అమ్మాయి లాగానే తయారై ప్రతిరోజు క్రమం తప్పకుండా కాలేజీకి వెళ్ళేది .
అప్పుడప్పుడు ఇలాంటి మాటలతూటాలు మనసుని బాధ పెడుతున్నా..తను కూడా కాలేజీ లైఫ్ ఎంజాయ్ చేసేది. ఎంజాయ్మెంట్ బానే చేసింది కానీ..తీరా ఎగ్జామ్స్ టైం లో చదవాలంటే కంగారు పడేది .
ఆమె డిగ్రీ అయిపోయి 15 ఏళ్ల తర్వాత మళ్లీ పీజీలో చేరింది డిగ్రీ వరకు తెలుగు మీడియం ఇప్పుడు ఇంగ్లీష్ ఎలా రాయాలని లో లోన ఏడుస్తూ ఉండేది. ఆమెకు ఇంగ్లీష్ అంటేనే చాలా భయం డిగ్రీలో కూడా ఇంగ్లీష్ ఎగ్జామ్ అప్పుడు భయంతో ఏడ్చి గ్లూకోజ్ లు ఎక్కించుకొని ఎగ్జామీ రాయలేదు తర్వాత ఎలాగో గట్టే ఎక్కింది.
కేవలం ఆంగ్లం లో మాట్లాడలన్న ఆశ తోనే పిజి లో చేరింది…కానీ ఇప్పుడు భయంతో పాటు కడుపులో పో
టు లాంటి నొప్పి ఆ బాధను భరిస్తూ ఎగ్జామ్స్ ఎలా రాయాలా అని …ఏడ్పు మొదటి ఎగ్జామ్ రోజే కడుపునొప్పికి
మెడిసిన్ వేసుకొని వెళ్తే ఆ మందు మత్తులో మస్కబారిన ట్టు కనిపించే క్యూస్షన్ పేపర్ చూసి కంగారు వేసింది .
కానీ ఆరోజు తను చెప్పిన క్లాసులో చెప్పిన టాపిక్ ఎగ్జామ్ లో రావడంతో పెన్ను పట్టి రాయడం మొదలు పెట్టింది అలా కంగారు తగ్గింది.
చివరి ఎగ్జామ్ రోజు కూడా ఓ వైపు కడుపు నొప్పితో బాధపడుతునే మూడు గంటల ఎగ్జామ్ గంటలో రాసి వచ్చింది రిజల్ట్స్ వచ్చిన రోజు సార్ అబ్బాయిలు ఎలా వచ్చాయి మార్కులు అని అడిగితే వాళ్ల సారు వాళ్ళ విషయం ఎంత కమ్మ వాళ్ళు మూర్ఖులు వెధవలు ఫెయిల్ అయ్యారు అమ్మాయిలే నయం అని అన్నారు జులై గా తిరుగుతూ కాలేజీ కి వస్తున్నారు స్నేహ ఎగ్జామ్స్ అప్పుడు షార్ట్ నోట్స్ ప్రిపేర్ చేసుకునేది అందరూ ఆమె నోట్స్ తీసుకొని చదివేవారు క్లాస్ లో సార్ లెసన్స్ చెప్తున్నా ఆసక్తిగా వినేది దాంతో ఆమె పక్కనే ఉన్న స్వప్న మాట వినిపించుకోకుంటే. గొప్పగా వింటున్నావ్ లే అని వ్యగ్యంగా మాట్లాడేది కానీ.. ఎగ్జామ్స్ అప్పుడు కడుపునొప్పితో చదవకపోయినా చెప్పిన పాఠాలు గుర్తుంచుకొని రాయడం వల్లే తనకు మంచి మార్కులు వచ్చాయి .
మరొకసారి వైవో ఉంటే బాగా ఫీవర్ వచ్చింది. ఫీవర్ తోటే కాలేజీకి వెళ్ళింది కంగారులో ఒక హాల్ టికెట్ బదులు ఇంకొకటి తీసుకొని వెళ్ళింది అక్కడ సార్ నీవు ఎగ్జామ్స్ రాశావని ఏంటి నమ్మకం..
మీ సబ్జెక్ట్స్ పేర్లు చెప్పమ్మా అంటే టకటక చెప్పింది ఇంతలో అక్కడికి వాళ్ళ సార్ వచ్చి
ఈ అమ్మాయా! రోజు క్రమం తప్పకుండా కాలేజీకి వస్తుంది.
అని గొప్పగా చెప్పడంతో ఆ సారు క్వశ్చన్స్ ఏమి అడగకుండా పంపించేశారు.
ఎలాగో మూడు సంవత్సరాలు చదివి గ్రాడ్యుయేషన్ పట్టా పుచ్చుకుంది.
వారి వంశంలో ఆడపిల్లలకు చిన్న వయసులోనే పెళ్లిళ్లు చేసేవాళ్ళు అప్పటికి తను డిగ్రీ దాకా చదివినది.
తర్వాత మూడు పదుల వయసులో మూడు అక్షరాల పిజి డిగ్రీ పుచ్చుకొని మంచి ఉద్యోగంలో స్థిరపడింది .
చదువుకి వయస్సు తో పని ఏమీ లేదు.. చదవాలన్నా ఆసక్తి ఉంటే చాలు ..
కాలేజీలో ఇలాంటి అమ్మలేందరు ఎదురవుతారు.. వారిని ఎగతాళి చేయకండి ..వీలైతే ప్రోత్సహించండి