అల్లంత దూరాన
అందాల కోనలోన
ప్రకృతి రామణీయకత లో
వెల్లి విరిసింది ఆనందం
నీల లోహిత కిరణాలు
మెరుపుల జిలుగులు అద్దింది
కుసుమ కోమల కోమలి
ఆస్వాదించింది ఆ అద్భుతం
పురి విప్పింది ఉదయం
సయ్యాటలాడింది హృదయం
ఎండ వెలుగు వెలిగింది
వర్ణ చిత్ర సోయగమయ్యింది
అందులో….
ఎలుగెత్తి చాటిన నిశ్శబ్దం
నది ఒడ్డున శిఖరం
స్వేచ్ఛ విలువ తెలిసిన
మనస్సే ఓ విహంగం!!
నిన్నను మరువక
నేటి బ్రతుకు కు మురవక
రేపటి భావ విపంచి
కోటి రాగాలు పలుక
కొత్త తాళం వేసి
కనుదోయి ఆనందం
ఇక కలకాలం అన్నది!!
– చిత్ర కవిత
డాక్టర్ కొండపల్లి నీహారిణి ,తరుణి
సంపాదకులు