గృహస్థ ధర్మాలు అని ఒక మాట అన్నారు పూర్వీకులు .ఇందులో సంస్కృత శబ్దాలు ఉన్నాయి, ఇది మనది కాదేమో అని అనుకునే పొరపాటు చేయవద్దు మనం.
గృహస్థ ధర్మాలు అనేవి ఆడవాళ్ళకి మగవాళ్ళకి ఇద్దరికీ సరి సమానంగా ఉన్నాయి. గృహస్థ ధర్మాలు అంటే మరేంటో కాదు,నిద్ర లేచింది మొదలు పడుకునే వరకు బాధ్యతతో మనం చేయవలసిన పనులు. తల్లిగా తండ్రిగా నానమ్మగా అమ్మమ్మగా తాతయ్యగా మేనమామగా మేనత్తగా చిన్నాన్నగా చిన్నమ్మగా అన్నగా తమ్ముడిగా చెల్లిగా అక్కగా కొడుకుగా కూతురుగా ఇలా ఏ వావి వరసలు ఉన్నా ఎవరైనా ఒక ఇంట్లో జీవిస్తున్నారు అంటే ఒక కుటుంబం జీవనంతో బ్రతుకుతున్నారు అంటే వాళ్లకంటూ కొన్ని బాధ్యతలు ఉంటాయి అని చెప్పినవే ఈ ధర్మాలు .ధర్మం అంటే ఏంటి సభ్యతతో ఆచరించదగినది.
ఇప్పుడు చాలా వరకు కనిపిస్తున్న సమస్య ఏమిటి అంటే పెద్దవాళ్ళను సరిగా చూడడం లేదు అని! గౌరవం లేదు ఒక మర్యాద లేదు ఇర్రె స్పాన్సిబుల్ కిడ్స్ అయ్యారు అంటున్నారు. దీనికి కారణం ఎవరు? మనం కూడా ఒకసారి మనల్ని మనం ప్రశ్నించుకోవాలి కదా! అమ్మానాన్నలుగా ఉన్న వీళ్లతో వీళ్ళు కన్నవాళ్ళూ వెంటే ఉంటారు కదా.పిల్లల చిన్నప్పుటి నుంచే నన్ను అనుకరిస్తారు నన్ను అనుసరిస్తారు నా మాటలు వింటారు నా ప్రవర్తనను గమనిస్తారు అని అనుకోకుండా ఇష్టం ఉన్నట్టుగా మాట్లాడినటువంటి తల్లిదండ్రులకే ఇలాంటి బాధలు కలుగుతున్నాయి. నేను నా తండ్రిని నా తల్లిని , నా అత్తగారిని మామగారిని ఎట్లా చూస్తున్నాను వాళ్ల గురించి ఎలాంటి మాటలు మాట్లాడుతున్నాను అని ఒకసారి తండ్రిగా ఉన్న ఆ వ్యక్తి తనను తాను ప్రశ్నించుకోవాలి. తన తల్లిదండ్రులను ఒకలాగా భార్య తల్లిదండ్రులను ఒకలాగా చూసినటువంటి తండ్రిని తర్వాత తన పిల్లలు ఎందుకు గౌరవిస్తారు ?తన కొడుకు పెరిగి పెద్దయ్యాక పెళ్లి చేస్తున్నప్పుడు ఆ వచ్చిన కోడలు మాత్రమే ఆ అబ్బాయికి అంటే తన కొడుకుకి చాలా ముఖ్యమైపోతుంది అని ఒక చిన్న సున్నితమైనటువంటి విషయాన్ని మరిచిపోతారు. మరచిపోయి ఇప్పుడు అత్తగారిగా ఉన్న తన భార్యను మామగారిగా ఉన్న తనను బాగా చూసుకోవడం లేదేంటి అనీ,మా కొడుకు కూడా ఏమీ ఆ కోడల్ని మందలించడం లేదు ఏంటి అని అనుకుంటారే అక్కడ వచ్చింది అసలు తంటా!! నువ్వు అల్లుడుగా ఉన్నప్పుడు నీ అత్తమామలను ఎలా చూసావు అనేది చిన్ననాటి నుంచి నీతో కలిసి పెరిగిన నీ కొడుకు అన్ని అబ్జర్వ్ చేస్తాడు కదా అన్ని చూసి నేర్చుకుంటాడు,గమనిస్తాడు కదా !ఈ చిన్న జ్ఞానాన్ని మర్చిపోయి అత్తమామల పట్ల సరిగా ఉండనటువంటి వాళ్లకు తర్వాతి జనరేషన్లో,తర్వాతి తరంలో తన కొడుకు కూడా ఇదే అనుభవించాల్సి వస్తోంది .ఇంతే! థిస్ ఈజ్ వెరీ సింపుల్! ఇదే విషయం ఆడవాళ్ళ విషయంలోనూ ప్రస్ఫుటిస్తుంది !ఇదే విషయం అన్నదమ్ముల అక్కచెల్లెళ్ల మధ్య కూడా జరుగుతుంది.ఇంతే!
పిల్లలు చూసి నేర్చుకుంటారు విని నేర్చుకుంటారు అనే సోయి, అనే ధ్యాస మనలో ఉన్నప్పుడు ఇలాంటి ఉపద్రవాలు వచ్చి ఉండవు. అయిపోతుంది… చేతిలోంచి కాలం జారిపోతుంది…. గతంలోని ప్రవర్తన ఇప్పుడు నీ పిల్లలు నీపై చూపిస్తున్నారు. ఇంతే… ఇది ఒక్కటి గుర్తు పెట్టుకున్నప్పుడు కనీసం మన బాధ్యతగా మన తరం అయిపోతుంది మేము వెళ్ళిపోతాం తర్వాత తరం వాళ్ళైనా బాగుండాలి అని ఒక జ్ఞానం కనుక మనలో ఉంటే ఇప్పటికైనా మారిపోవాలి. మారిపోయి మానవ ప్రయత్నం చేయాలి. అంటే,చెడు మాట్లాడకుండా ఉండడము, చెడుగా కామెంట్స్ చేయకపోవడం అనేది చేస్తే కనీసం భావితరాల వాళ్ళన్నా బాగుపడతారు.
ఇల్లు ఒక గూడు, ఒక నివాసం! ఒక ఇంట్లో ఉన్నాము అంటే నలుగురితో, నాలుగు కష్టసుఖాలతో, నాలుగు మంచి చెడులతో, నాలుగు ఆనంద వికారాలతో కలిసి ఉంటున్నాము అని ప్రతి ఒక్కరు అనుకోవాలి. ఎ హౌస్ ఈజ్ మేడప్ ఆఫ్ విత్ బ్రిక్స్ ,ద హోమ్ ఈజ్ మేడ్ అప్ విత్ లవ్ అండ్ ఎఫెక్షన్ . ఇల్లు, కుటుంబము నీ బ్రతుకు ఆవరణ !ఎలా ఉంటున్నాము అనేది నీదైనా ఒక ఆలోచన ఇంతే!!
_**__
“ఇల్లు/ కుటుంబ ఆవరణ నీ బతుకు ఆవరణ”??
మీ సంపాదకీయం బాగుంది కొండపల్లి నీహారిక గారు
పిల్లల పెంపకంలో కుటుంబ ఆవరణ పరిరక్షణ ఎంత
ముఖ్యమో బాగా వివరించారు. P.Vijaylakshmi pandit
google
p.vijayalakshmipandit@gmail.com
ధన్యవాదాలు విజయలక్ష్మి గారు. కూలిపోతున్న కుటుంబ వ్యవస్థను నిలుపుకోవాల్సిన బాధ్యత మన అందరి మీద ఉంది అని నా అభిప్రాయం. మీ పరిచయం మేడం ?రాస్తూ ఉంటారా? తరుణి పత్రిక ఇటువంటి కొన్ని ఆదర్శాలతోనే తీసుకువచ్చాను. మీరు పాల్గొనవచ్చు.