ఓడిన గెలుపు

డా. అరుణజ్యోతి కోలా

ఆత్మవిశ్వాసంతో ముందడుగేస్తె అన్నీ విజయాలే అన్నారు…

అందిన విజయానికి నిత్యం సంకుల సమరమే…!!

నువ్వులేనిచోట శూన్యమే అనుకున్నా…

నువ్వువుండి బ్రతుకు చీకటేనా…!!

నా పంచప్రాణాలు నీకైపంచేశాను…

నాశ్వాసే నీకు పరిచయంలేదటున్నావు…!!

నువ్వు నాదన్న మనసు మూగదైతే

అనురాగం అత్మీయతఅందనంతదూరమైనా

నీ నీతీపి గుర్తులే చాలనుకున్నా…!!

ఆవి చేదునిజాలై కాటేస్తున్నాయి

నువ్వు నాప్రేమనీదనుకుంటే

తీరాలు దాటినా నన్ను కనిపెట్టేది కదా…!!

బ్రతుకు పోరుసాగిస్తూ గాలిలో దీపంలా నేను…

దోసిట్లో జారిపోయే జ్ఞాపకాల జల్లెడ కష్టాలలా నువ్వు…!!

కాల గుహల్లో కన్నీటి చారికల్లా

మెదడు పుటల్లో దాగిన మూగ రోదనలా

ఓడిననా గెలుపు కాలం ఒడిలో ఒదిగిపోయింది…!!

సీతాకోక చిలుకలా కొత్త రూపంతో మేలుకుంది…

గెలుపును గెలుపులా చూసే సరికొత్త ప్రపంచానికి ఎగిరిపోయింది…!!

 

 

 

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ఏమండి కథలు

మనసు ఒక మందారం