సీతమ్మ

కథ

రాపోలు శ్రీదేవి

సీతమ్మ !సీతమ్మ!
అని పిలిచి బోను లో
నిలబెట్టారు.
‘ ఏమిటి ఈమె చేసిన పాపం ?” అని యమధర్మరాజుఅనగా
చిత్రగుప్తుడు యమధర్మ రాజా ! సీతమ్మ అని ఇంకో ఆవిడ ను తీసుకు రమ్మంటే భటులు పొరపాటున ఈ సీతమ్మని తీసుకొచ్చారు .

ఈమెకి ఇంకా ఆయుషు ఉన్నది.
ఈ సీతమ్మ మహాసాద్వి విసుగు ఏరగకుండా పని చేసే పని వంతురాలు.
తన కడుపు చూసుకోకుండా అందరికీ వండి పెట్టే డొక్కా సీతమ్మ ఈ అమ్మ.
ఈమెను మళ్లీ భూలోకానికి పంపించండి .
అనగానే …
“వద్దు యమధర్మ రాజా వద్దు
నాకు చావే విశ్రాంతి” అనగానే …
ఏమిటమ్మా? నీ బాధ
చెప్పు తల్లి అనగానే..

పొద్దున్నే సూర్యోదయం కాక ముందే లేచి పెద్ద వాకిలి కల్లాపు చల్లి ముగ్గులు పెట్టాలి .
పాలు పితికి వాటిని కాచాలి.
గొట్టం ఊదుతూ ఊదుతూ పొయ్యి రాజేసి కండ్లు మంట పుడుతున్నా వంట చెయ్యాలి.
బావిలో నీళ్లు తోడలి బట్టలుతకాలి . పాలేరులకు కూడా వండి వార్చాలి .
ఇక పండగలు వస్తే పిండి వంటలు వచ్చే చుట్టాలకి వంటలు పండగ రోజుల్లో
ఊపిరిమెసలనంత పనులు ఎన్నో చేయాలి .
ఒడ్లు దంచాలి పప్పులు ఇసరాలి ఇల్లు అలకాలి ముగ్గులు పెట్టాలి.

పెళ్లిళ్లు పేరంటాలు అయితే నెలల తరబడి చుట్టాలు ఉంటారు. వారికి చాకిరి చేయాలి.
అత్తగారు పోరు భరించలేకుండా ఉన్నాను .
వీటన్నిటి నుంచి నాకు విముక్తి కావాలి అని కోరింది .
అమ్మ! సీతమ్మ! ఈ జన్మలో అయితే నీ తలరాత మార్చలేను కానీ వచ్చే జన్మలో నీకు ఇలాంటి కష్టాలు ఉండవు అని అంటూనే…
ఒక విషయం గుర్తుపెట్టుకో అప్పుడు నీవు ఇలాంటి జీవితమే కావాలని కోరుకుంటావు …
అని చెప్పి ఆమెను తిరిగి భూలోకానికి పంపాడు యమధర్మరాజు.
కొన్నాళ్ల కు సీతమ్మ
కాలం చేసింది .

కొంత కాలానికి అదే వంశంలో ఒక అందమైన అమ్మాయి జన్మించింది.
ఆమెకు తెలివితేటలతో పాటు ఎన్నో కళలు వచ్చు..
కవితలు అల్లుతుంది. కథలు రాస్తుంది.
గజ్జె కట్టి నాట్యం చేస్తుంది .
మధురంగా పాడుతుంది .
అందంగా బొమ్మలు గీస్తుంది. ఆటలాడుతుంది. చదువు సంధ్యలో కూడా ఆరితేరిన అమ్మాయి …
బాగా చదివి ఐఐటి కొట్టి చక్కని సాఫ్ట్ వేర్ ఉద్యోగంలో చేరింది. ఉద్యోగం చేస్తూ…. ఎప్పుడూ కంప్యూటర్ తోటే జీవితం యాంత్రికంగా అయిపోయింది. మనుషులతో సంబంధం లేకుండా కూర్చొని కూర్చొని వర్క్ చేసి చేసి నడుము నొప్పులు వచ్చాయి .
ఆమెను రెస్ట్ తీసుకోమన్నారు. అయితే కాలక్షేపం కోసం రాయాలని అనుకున్నది .
పని చేయడానికి పనిమనిషి ఉంది రొట్టెలు చేయడానికి రోటీ మేకర్ మైక్రోఓవెన్ ఎలక్ట్రిక్ కుక్కర్ వాషింగ్ మిషన్ ఇలా అన్ని పనులకు మిషన్స్ ఉన్నాయి. ఇంకా రిమోట్ తో పని చేసే ఫ్యాన్స్, లైట్స్ అన్ని కూర్చున్న చోటు నుంచే ఆపరేట్ చేయడానికి ఉన్నాయి కాలక్షేపం కోసం టీవీ చూస్తుంటే పాలలోకల్తీ, పండ్లలో కల్తీ, కూరగాయలుకల్తీ ..
అని రోజు అవే వార్తలు చూసి చూసి ఏమి తినాల న్నా భయంగానే ఉంది.
ఇక బోర్ కొడుతుంటే వల్ల తాత గారి ఊరికి వెళ్దామని వెళ్ళింది. అక్కడికి వాళ్ళ అమ్మానాన్న ..అక్క కూడా వచ్చారు.
ఊరు చూద్దామని వెళ్తుంటే ఓ దగ్గర మేకను చూసి ఆగి పాలు పితికింది స్మిత. నీకు పాలు పితకడం కూడా వచ్చానే ?!అంది వాళ్ళ అక్క.
ఏమో తనకే తెలియలేదు.. పచ్చిపాలే తాగింది అమృతంలా అనిపించాయి.
పొలం గట్టుమీద కూరగాయలు కోసుకొని వచ్చి వండుకొని తింటే ఎంతో రుచిగా అనిపించాయి.
చల్లగాలికి హాయిగా నిద్ర పట్టింది కానీ ఎందుకో మెలకువ వచ్చి ఎవరో ” సీతమ్మ” అని పిలిచినట్టు ఆలాపన …లేచి కూర్చుంది.
చూస్తే ఎవరు లేరు అటు ఇటు తిరుగుతూ ఉంది సరిగ్గా నిద్రపోలేదు .
తెల్లారి వాళ్ళ తాత గారి తమ్ముడు రామయ్య
వాళ్ళ బాబాయ్ ఇంటికి వచ్చాడు.
సీతమ్మ !ఏంటమ్మా నీ కనులు అంత ఎర్ర పడ్డాయి?
అంటే…
రాత్రి మీలాగే ఎవరో “సీతమ్మ” అని పిలిచినట్టు అనిపించి మెలకువ వచ్చింది. నిద్రపోలేదు అని చెప్పింది స్మిత.
రామయ్య తాత సీతమ్మ గురించి చెప్పవా ! నేను రాసుకుంటాను అంది స్మిత .
ఆమె చేతివంక తదేకంగా చూస్తుంటే… ఏమైంది తాత? అంటే మా అమ్మ దగ్గర కూడా ఇలాంటి కలం ఉండేదమ్మా .
అవునా ఇది మొన్న ఎగ్జిబిషన్లో కొన్నాను తాత .
ఈ పక్కన ఇల్లే మా అమ్మానాన్నలు నరసింహ, సీతమ్మ ఉన్న ఇల్లు ..
అయితే చూద్దాం పదండి తాత అంది స్మిత .
వాళ్ళ అక్క అందరు కలిసి ఆ ఇంటికి వెళ్తుంటే దారిలో… రామయ్య తాత ..
మా నాన్న తోడ ఆరుగురు అన్నదమ్ములు ఇద్దరు అక్క చెల్లెలు ఎంతో పెద్ద సంసారం ఉమ్మడి కుటుంబం .
అందరికీ వండి వార్చేది మా అమ్మ సీతమ్మ. అవునా తాత! అంతమందికి వండాలంటే ఎంత పెద్ద గిన్నె కావాలో కదా! అంటే …
అవునమ్మా మా ఇంట్లో పెద్ద అండ ఉండేది దానడు వండి వార్చేది మా అమ్మ .
తాత ఆమెకు ఏడు వారాల నగలు ఉండేవా ?
అవునమ్మా ఉండేవి కానీ అప్పుటి కాలంలో రజాకార్లు ఊరి మీద దాడి చేస్తుంటే…
మా అమ్మ అవి ఎక్కడో పూడ్చి దాచి పెట్టింది.
అవి ఎక్కడ ఉన్నాయో ఇంతవరకు ఎవరికీ తెలియదు .
ఆమె చావు బతుకుల్లో కూడా ఎవరికీ చెప్పలేదు.
ఆమెకు ఒక భోషణం పెట్టే ఉండేది అందులో నగలే కాదు తనకు నచ్చినవి చాలా దాచుకుంది .
అవి ఎక్కడ ఉన్నాయో ఎవరికీ తెలియదు. అని అనగానే ..
అవునా !అన్నది స్మిత. ఆ ఇంట్లోకి అడుగు పెట్టగానే ఆమెకు ఏదో లోకంలోకి అడుగు పెడుతున్నట్టు అనిపించింది .
అది కొత్తగా అనిపించడం లేదు.. తనకు తెలిసినా తను తిరిగిన ఇల్లు లాగానే అనిపిస్తుంది.
ఇల్లంతా చూస్తూ ఇంటి వెనకకు వెళ్ళారు ..
అక్కడ ఓ బావి పక్కనే ఒక రేకుల షెడ్డు వంటశాలలా ఉంది .
అక్కడ పాతకాలం పోయి పెట్టిన ఆనవాలు కనిపిస్తున్నాయి.
అవి చూసి ఈ రెండు పోయిల మధ్యన ఒక కుండ ఉండాలి కదా! తాత అని అడిగింది స్మిత .
నీకెలా తెలుసు అని ఆశ్చర్యంగా అడిగాడు తాత .
అవునమ్మా దాన్ని ఒత్తి అంటారు పొయిల మీద వంట చేస్తుంటే ఆ కుండలో నీళ్లు కాగేవి అవి స్నానానికి ఉపయోగించే వాళ్ళం మేము అని చెప్పాడు.
బావి పక్కన చూస్తూ ఇక్కడ ఒక జామ చెట్టు ఉండాలి కదా! తాత అంది స్మిత. అవునమ్మా అవును ఆ చెట్టు చాలా పెద్దది ఊర్లోనే పెద్దది.. ఇప్పుడు అది లేదు దాని స్థలం లోనే ఈ గుంట ఉన్నది అన్నాడు .
అటు పక్కగా వెళ్లి ఇక్కడ మల్లెపొద ఉండేది కదా! అంది స్మిత .
అవునమ్మా అవును ఆ మల్లెలు వాసన పరిమళం ఇక్కడ అంతా వ్యాపించేది అన్నాడు తాత. మొన్న కడుపునొప్పి అని హాస్పిటల్ కి వెళ్తే డాక్టరు గైనిక్ ప్రాబ్లం అన్నారు అప్పట్లో ఆడవాళ్లు ఇసురాయితో పప్పు పట్టె వాళ్ళు అట వాళ్ళకి గైనిక్ ప్రాబ్లమ్స్ వచ్చేవి కావు అంది స్మిత వాళ్ళ అక్క శ్వేత.
అయితే తాత ఓసారి ఇసురాయి చూపించవా అని అడిగింది స్మిత ఇదిగోనమ్మా ఇదే ఇసురాయి మా అమ్మ అప్పట్లో బస్తాలు బస్తాలు శనగలు మా నాన్న పండిస్తే ఆమె ఓ అర్ధగంటలో అలా పప్పు చేసేది దీనికి ఓ కట్టె పిడిలాంటిది ఉంటుంది.
అది ఎక్కడో పడింది అంటుండగానే …
స్మిత అక్కడ ఉన్న గూట్లో కట్టె తీసి దానికి పెట్టి విసరడం ప్రారంభించింది.
నిన్ను చూస్తుంటే మా అమ్మ సీతమ్మే గుర్తొస్తుంది అన్నాడు తాత .
మీ అమ్మ సీతమ్మ ఫోటో ఏదన్న ఉంటే చూపించవా తాత అని గోముగా అడిగింది స్మిత.
అప్పుడు రామయ్య తాత ఓ అర్రలోకి వెళ్లి అటు ఇటు చూసి ఒక ఫోటో తీసుకువచ్చాడు .
అది దుమ్ము పట్టి ఉంది. దాన్ని తన ఉత్తరేయం తో తుడిచి చూడగానే వాళ్ళ అమ్మ ఫోటో ముఖం మీద కొంచెం చెదలు పట్టి ఉంది. దాన్ని తీసి అయ్యో ముఖం సరిగ్గా కనిపించడం లేదు.. అంటే అవునా! అంటూ స్మిత దాని చేతిలోకి తీసుకొని ఇంటికి వెళ్లింది.
ఆ రోజంతా ఆ బొమ్మని చూస్తూ చూస్తూ ఒక కాగితంపై మళ్ళీ అందంగా చిత్రించింది అదేం చిత్రమే
ఆ ముఖచిత్రం చూస్తే అచ్చు తనలాగే అనిపించింది.
అది చూసి నవ్వుకుంది .
తెల్లారి రామయ్య తాత కు చూపిస్తే అవునమ్మా అవును మా అమ్మ ఇలాగే ఉండేది అని ఆ బొమ్మ చూసి చాలా మురిసిపోయాడు. తాతా తాత మళ్లీ మనం ఆ ఇంటికి వెళ్దామా ?అంది
స్మిత ఎందుకమ్మా ..
ఆ పాడు పడ్డ ఇంటికి మేమే వదిలేసి చాలా కాలమైంది మీ నాన్న వాళ్ళు ఉద్యోగం రీత్యా పట్టణానికి వెళ్లి అక్కడే స్థిరపడిపోయారు .
మా పాలుకొచ్చిన ఇల్లు మేము చూసుకుంటూ ఉన్నాము.
మీ బాబాయి ఆ ఇంటిని బాగు చేయించలేక ఇక్కడ వచ్చి ఉంటున్నాడు అని చెప్పాడు.
లే తాత ఒక్కటే ఒక్కసారి వెళ్దాం అని అంటే మళ్లీ వెళ్లారు అక్కడ ఏవేవో జ్ఞాపకాలు సుడులు తిరుగుతున్నట్టుగా… అనిపించాయి. ఇంతలో ఒక చోట ఆగి ఆ నేల లో ఏమో ఉంది తాత అని అంది స్మిత.
అనుమానంతో వాళ్ళ బాబాయ్ అక్కడ తోమిచ్చి చూస్తే సీతమ్మ భోషాణం పెట్టె కనపడింది .
అందరూ ఆశ్చర్యంగా చూస్తూ ఉండిపోయారు. అవును అప్పట్లో పొయ్యి కింద తోమి పెట్టినట్టున్నారు. మేము మేము అంతగా గమనించలేదు తల్లి అన్నాడు తాత .
ఇదిగో తల్లి …
నువ్వు చూస్తుంటే అచ్చు మా అమ్మ సీతమ్మ లాగే ఉన్నావు మా అమ్మ వెండి జారి పట్టుచీర ఒకసారి కట్టుకొని ఈ నగలన్నీ పెట్టుకొని నా కంటికి కనిపించమ్మా అని అడిగాడు .
ఆ చీర కట్టుకొని ఆ నగలన్నీ పెట్టుకుంటుంటే నగల కింద ఒక పెన్ను కనిపించింది .అచ్చు తను కొన్న పెన్ను లాగానే ఉన్నది అది. అవును అందుకే తాత ఆశ్చర్యంగా చూశాడు.
అన్నీ అలంకరించుకొని తాత దగ్గరికి వెళ్లి కాళ్లకు నమస్కారం చేయబోతుంటే …
తాతనే ఆమె కాళ్ళకు దండం పెట్టబోయాడు. ఏంటి తాత ఇది అంటే నీవు స్మితవు కాదమ్మా మా అమ్మ సీతమ్మ వే అని కన్నీళ్లు పెట్టుకున్నాడు .
స్మిత ఆ నగలన్ని వారికే ఇచ్చి ఒక పెన్ను మాత్రం తీసుకుంది. అదే తనకు నచ్చిన దని చెప్పింది .
అప్పట్లో ఎన్ని పనులు చేసిందో సీతమ్మ మరీ మేము అన్నిటికీ మిషన్స్…
కల్తీ లేకుండా ఏ ఆహారం దొరకడం లేదు అప్పటి రోజులే బాగున్నాయి .
వాళ్లు చాలా ఆరోగ్యంగా ఉన్నారు చూడు ఎన్ని నగలు ఇప్పుడు బంగారం రేటు ఎంత పెరిగిపోయిందో… ఇంట్లోనే పండ్లు తాజా పండ్లు పండించుకుని తినేవారు.
అని అనుకొన్నది.
ఆ ఇల్లు చూసెటప్పుడు ఓ గోడ మీద క్రిష్ణుడి బొమ్మ కనిపించినది..
అప్పట్లో ఆడవారు వారి కళాత్మకత ను ఇలా ప్రదర్శించే వారేమో ?
అని మనసు లోనే అనుకుంది..
గత జన్మ అంటూ ఉంటుందో లేదో తెలియదు కానీ..
ఆనాడు సీతమ్మ కళలను ఎవరు గుర్తించలేదు..
ఈనాడు స్మిత
కళ ను మాత్రం అంతా మెచ్చు కొంటున్నారు..

స్మితమాత్రం..
స్వచ్చమైన పచ్చ దనం ఉన్న పల్లెల్లో ఉంటే బాగుంటుంది ..అని ఆశ పడుతుంది..
మనం అందని దాని కోసం ఆశ పడతాం..ఆరాట పడతాం..అది మానవ నైజం..అన్నది నిజం.

Written by Rapolu Sridevi

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ఆపాత మధురాలు part 6

దేముడిచ్చిన అమ్మ