ప్రాచీన కవుల వారసత్వాన్ని కొనసాగిస్తున్న పద్య చూడామణి

డాక్టర్ వెంకన్న గారి జ్యోతి – ఇంటర్వ్యూ

                డా|| వెంకన్నజ్యోతి

తెలుగు సాహిత్యంలో అనేక ప్రక్రియల్లో మన పూర్వ కవులు రచనలు చేశారు. భాష సరళీకరణ విధానాల వల్ల వాటి లో చాలా ప్రక్రియలు మరుగున పడి పోతున్నాయి. అలాంటి ఒక సాహిత్య ప్రక్రియ ”చిత్ర బంధనం”. ప్రాచీన కవులు నన్నయ్య, తిక్కన, పోతన , పింగళి సూరన తదితరులు రాసిన చిత్రం బంధన ప్రక్రియ లో పద్యాలు రాస్తున్నారు ప్రముఖ రచయిత, ఉపాధ్యాయురాలు డాక్టర్ వెంకన్నగారి జ్యోతి. పద్యచూడామణి బిరుదు అందుకున్న అరుదైన సాహిత్య ప్రక్రియ లో పద్య రచన చేస్తున్న ఆమెతో ఈవారం తరుణి ముఖాముఖి…
తరుణి: నమస్కారం జ్యోతి గారు. మీ పరిచయం ..
జ్యోతి: నేను పుట్టినది, పెరిగినది గర్గుల్ అనే చిన్నపల్లెటూరిలో..నా తల్లి వెంకన్న గారి లలిత, తండ్రి వెంకన్న గారి రాజేశ్వర్ రావు.
తరుణి: ఛందస్సు పై ఆసక్తి ఎలా కలిగింది?
జ్యోతి: రాగయుక్తంగా పద్యాలు పాడుతూ మా తెలుగు సార్ పాఠాలు చెప్పే తీరు నన్ను ఆకట్టుకుంది. దాంతో పద్యాలపై మక్కువ పెరిగింది. ఛందస్సు అంటే ఆసక్తి కలిగింది. శతకాలు రాయడం ప్రారంభించాను.
తరుణి: మీరు ఏ అంశం మీద పి హెచ్ డి చేశారు?
జ్యోతి:  ‘బహు ముఖప్రజ్ఞాశాలి భానుమతి రామకృష్ణ ” సాహిత్యం, పాటలు,దర్శకత్వం, నటనపై
పై పరిశోధన చేశాను. ఉస్మానియా విశ్వవిద్యాలయం నుంచి 2014 ఆగష్టు 16 వ తేదీన Ph.D. పట్టా
అందుకున్నాను.


తరుణి: ఇప్పటివరకు ప్రచురించిన పుస్తకాలు, రాసిన ప్రక్రియలు వివరించండి..
జ్యోతి: ఎక్కువగా శతకాలు రచించాను. ఆటవెలది, తేటగీతి, సీసము, కందము, ఉత్పలమాల, చంకమాల, మత్తేభము, శార్దులము, ఇంతకు ముందు ముద్రించిన పుస్తకాలలో రాసాను. – నా పల్లెటూరు శతకంమే

2013 లో ఆవిష్కరణ జరిగింది.
– అమ్మ శతకం ఫిబ్రవరి 2017 లో ఆవిష్కరణ జరిగింది.- బతుకమ్మ జ్యోతి పద్య కృతి సెప్టెంబర్ 2017 లో ఆవిష్కరింపబడింది. ఆ ముద్రితంగా ఉన్నవి ప్రాచీనకవులు నన్నయ, తిక్కన, పోతన వారు రాసిన చిత్ర బంధాలను నేను ప్రస్తుత సామాజిక అంశాలను జోడిస్తూ రాసాను. ఆ వృత్తాలు తోటకం, అచలం, మణిప్రావాలం, దండకము, పంచచామర ఇలా చాలా రాసాను. ప్రస్తుతం పోతన, పింగళి, సూరన తదితర ప్రాచీన కవులు రచించినచిత్ర బంధాలను రాస్తున్నాను.
అవి కోన్నిశ్రీ,లింగ, గజ, గోపుర, పుష్ప, నాగ,  రథ, మురళి చిత్రాలు వేస్తు అందులో ఆ నియమంతో బంధాలు వేస్తు పద్యాలు రాస్తున్నాను.

తరుణి: చిత్ర బంధం ప్రక్రియ గురించి చెప్పండి?
జ్యోతి: ఇది ప్రాచీన ప్రక్రియ. చిత్ర బంధంనకు వృత్తములు మేదర్ ,కందము,సీసము,ఆటవెలది,తేటగీతి,శార్దులము, మత్తేభము, తోటకము, పంచచామర, అచల, ఉత్పలమాల, చంపకమాల. ఒక్కో చిత్రానికి ఒక్కో నియమంతో
పద్యాన్ని రాయాలి. గజ బంధంకు ఏనుగు బొమ్మవేసి అందులో ఛందోబద్దంగా ఒక వాక్యం దాగి ఉంటుంది.
ఆ పద్య నియమం తెలిస్తేనే ఆ వాక్యం తెలుస్తుందీ. అలాగే రథబంధం, లింగబంధం ఉంటాయి.
తరుణి: మీరు పొందిన బిరుదులు?
జ్యోతి:గాయిత్రి ధార్మిక సంస్థ వారు రామకిష్ణ విద్యాలయంలో పద్య చూడామణి బిరుదుతో డిసెంబర్ 2017లో నన్ను సత్కరించారు. ఎంపి కల్వకుంట్ల కవితగారి చేతుల మీదుగా ఎన్నో సన్మానాలు పొందాను. ప్రపంచ తెలుగు మహా
సభలలో, ఉగాది కవి సమ్మేళనాల్లో, బతుకమ్మ వేడుకల్లో తెలంగాణ రాష్ట్ర గవర్నర్ గారి చేతుల మీదుగా సత్కారాలు పొందాను.  రవీంధ్రభారతిలో అనేక సార్లు అనేక కార్యక్రమాల్లో , హైద్రాబాద్ లో వివిధ ప్రాంతాలలో వివిధ సంధర్భలలో సన్మానాలు అందుకున్నాను.
తరుణి: మీరు అవధానం లో పాల్గొన్నారా?

జ్యోతి: అవును. అవధాన రాజధాని పేరుతో ఢిల్లి లో మాడుగుల నాగఫణిశర్మ గారి సహస్రఅవధానం లో 2013 లోయ్క
పృచ్చకురాలిగా పాల్గొనే అవకాశం లభించింది.
తరుణి: మీరు ఉపాధ్యాయురాలు గా మీ విద్యార్థుల్లో భా‌‌షపై మక్కువ ఏర్పడడానికి ఎలాంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు?
జ్యోతి: తెలుగు భాష పై విద్యార్థులకు ఆసక్తి అనిపించేలా బోధించాల్సిన బాధ్యత ఉపాధ్యాయులపైనే ఉంది. నేను మా ప్రభుత్వ పాఠశాలలోని విద్యార్థుల చేత పద్యాలు,నాటికలు రాయించి “అక్షర కదంబం” పుస్తకం  వేయించాను. ఆ పుస్తకానికి
సంపాదకురాలిగా ఉన్నాను. ఇకముందు చాలా పుస్తకాలు పిల్లల రచనలతో తీసుకువచ్చే ఆలోచన ఉంది.
తరుణి: మీ భవిష్యత్తు ప్రణాళిక?
జ్యోతి:  నేను రాయలనుకుంటుంన్నది వెంకన్నగారి వంశచరిత్ర అనగా వంశవృక్షం. ఎందుకనగా మన పెద్దలను స్మరించుకోవటం కంటే గొప్పవిషయం మరొకటి లేదు అని నా అభిప్రాయం.

ఇంటర్వ్యూ           వంగ యశోద

Written by vanga Yashoda

One Comment

Leave a Reply
  1. డా. ఓరుగంటి సరస్వతి
    osaraswathi
    osaraswathi.phd@gmail.com
    152.58.233.86
    యశోద గారు.. మహిళా ఔన్నత్యాన్ని తెలియజేసే మహిళా ఇంటర్వ్యూ లను చేస్తున్నారు.స్ఫూర్తిదాయకం .

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ఆపాత మధురాలు part 5

తరుణి బాలచిత్రం