మహిళా మణులు

 పజిల్స్ గళ్ళనుడికట్టులో అందెవేసిన చేయి శ్రీమతి ఆచంట హైమవతి గారు!

ప.గో.జిల్లా ఉంగుటూరు లో పుట్టిన హైమవతి గారు 800పైగా రచనలు వివిధ ప్రక్రియల్లో చేశారు.వివిధ దినవార పక్ష మాసపత్రికల్లో వచ్చాయి.సాహితీయువరత్న సాహితీ శిరోమణి రచననుండి కళాపీఠం అవార్డులు పొందారు.సాహితీకిరణం కార్తీక డెవలపర్స్ వారి కథలపోటీల్లో ప్రథమబహుమతి పొందారు.సహస్రకవిమిత్ర అవార్డు లభించింది.1965నుంచి బెంగళూరు లో నివాసం.4పత్రికలకు పజిల్స్ రాయడం ఆమె ప్రత్యేకత!
ఆమె ఇలా చెప్పారు”నా7వ ఏటనే రచనలపై మక్కువ ఏర్పడింది.విశ్వసాహితీపత్రికలోనాతొలిరచనతో కెరీర్ ఆరంభం!నాకథ ముత్యాలు కి మంచిపేరు ఆదరణ రావడం తో సంసారం సంగీతం సాహిత్యం తో నాజీవితం సాఫీగా సాగిపోతోంది.నాభర్తశ్రీధరరావుగారు హెచ్.ఎ.ఎల్.లో ఇంజనీర్.అలా బెంగళూరు లో స్థిరపడిన నేను కన్నడం నుంచి తెలుగు తెలుగు నించి కన్నడంలోకి చాలా అనువాదాలు చేశాను.ఆనందమ్మ గారివద్ద కర్ణాటక సంగీతం నేర్చుకున్నాను.18ఏళ్ళబట్టి తంబూర శృతితో సంగీతం నేర్పుతున్నాను.సంగీతం మాఅమ్మ పెద్దలు పాడటంతో ఆసక్తి కలిగింది.ఇక1962 నుంచి నారచనలు పుంఖానుపుంఖాలుగా వెలువడ్డాయి.ఓఅరడజను పత్రికలకు పజిల్స్ 9గళ్ళవి వివిధ పత్రికల్లో వచ్చాయి.నాహాస్యకథ తనదాకావస్తే 2వబహుమతి పొంది కన్నడ భాషలోకి అనువాదం ఐంది.బెంగుళూర్ ఆకాశవాణి లో నాకథలు కవిత లు ప్రసారం ఐనాయి.90కీర్తనలు నేర్చుకున్నాను.కానీ సంగీతం పరీక్షలకి హాజర్ కాలేదు.ఇప్పుడు పిల్లల కి చదువు కెరీర్ తో టైం సరిపోదు.
నా చిన్ననాడు మా అమ్మగారు ఆన్సర్ చేస్తుండేవారు శ్రధ్ధగా! “ఆరుద్రగళ్ళనుడికట్టు”ఆనేపేరుతో
“ఆంధ్రప్రభ”వారపత్రికలో
వచ్ఛేది వారం వారం. ఆనాటినుంచీ…1960
దరిదాపులనుంచీ
పజిల్స్ పూర్తిచేసేదాన్ని.
2,3 సార్లు బహుమతులుకూడా అందుకున్నాను. ఇప్పుడు కొన్నిగుర్తులేవు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

తపన

ఆపాత మధురాలు part 5