కావలసిన పదార్థాలు:
పండు మిరప కాయలు
టమాటాలు రెండు సమానంగా
వెల్లుల్లి( ఇష్టముంటే నే)
నూనె
ఉప్పు సరిపడినంత
పోపు దినుసులు
**********
తయారీ విధానం
పండు మిరప కాయలు కడిగి తొడిమ లు తీసి ముక్కలు చేసిబోట్టు కోవాలి…వెల్లులి రేకులు వలిచి పెట్టుకొని .టమాటాలు ముక్కలుగా చేసి పెట్టు కోవాలి.
ఇప్పుడు కడాయిలో నూనె వేసి ముందు మిరప కాయలు వెల్లుల్లి వేయించుకోవాలి..అవి తీసి వేసి టమాటాలు వేసి ఉడికించాలి. అందులో కొంచెం చింత పండు వెయ్యాలి…ఇప్పుడు ఇవి బాగా మగ్గిన తర్వాత చల్లార్చి మిక్సి లో వేసి..మళ్లీ కడాయ్ పెట్టీ పోపు వేసి అందులో ఈ paste వేసి బాగా వేయించాలి..పక్కలకి నూనె వ దిలేంత వరకు వేయించాలి…చల్లారాక bottle లో పెట్టు కోవాలి.