ఎక్కడ దాక్కుందో?

కవిత

డా చీదెళ్ళ సీతాలక్ష్మి విశ్రాంత సహాయాచార్యులు హస్తినాపురం, హైదరాబాద్

నవ్వుతో పలకరింపు
మాటల్లో చిలకరింపు
ప్రేమలో చిగురింపు
పలకరిస్తే చిరుమందహాసం
ఏది? ఎక్కడ?
నేడు వలసపోయింది
వెతుకుతున్న జాడకై!!

ఎక్కడ
విరిసిన పూవులోనా
మెరిసే తారకలోనా
పున్నమి వెన్నెలలోనా

ఎక్కడ
పెరిగే పైరులోనా
పచ్చని ఆకులోనా
స్వేచ్ఛగా ఎగిరే పిచ్చుకలోనా
చిన్నిపాప నవ్వులోనా!!

విరిగిన మనసు
కరిగిన సొగసు
చెదిరిన అందం
తెలియని వయసు
పెదవిపై చిరుదరహాసం
వలసపోయిన మందహాసం
దొరికేనా ఇపుడు!
వావి వరుసలేక
రక్కేసే పాడు చూపు

మానవరూపంలో
తొంగిచూస్తున్న రాక్షసత్వం పడగ నీడలో
మాయమైన మందహాసం
దొరికేదెన్నడో!!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

కాలపు అంచులదాకా

పండు మిరప కాయలు మరియు టమాట తో పచ్చడి