తరుణి న్యాయసలహాలు

డా. వరిగొండ సత్యసురేఖ వృత్తిరీత్యా న్యాయవాది, ప్రవృత్తిరీత్యా రచయిత అయిన వీరు విశాఖపట్టణం నివాసి. వీరి కథలు ఆకశవాణి వరంగల్లు మరియు విశాఖ కేంద్రం ద్వారా ప్రసారం కాబడినవి. పలు ప త్రికల్లో వీరి రచనలు ప్రచురణయే కాక వివిధ సాహితీ సంస్థల ద్వారా బహుమతులు అందుకున్న వీరు తెలుగు సాహిత్యం పైగల మక్కువతో వాఙ్మయి అనే యూట్యూబ్ చానెల్ పెట్టి ;నా కావ్య విశిష్టత అనే కార్యక్రమం ద్వారా పలువురు సాహితీ ప్రముఖులని పరిచయం చేస్తున్నారు. సామాజిక స్పృహ ,చైతన్యం ప్రధానాంశాలుగా రచనలు సాగించే వీరు దేశ పౌరులందరికి చట్టముల గురించి చట్ట వ్యవస్థ గురించి అవగాహన ఉండాలి అని భావిస్తూ తమ పరిధిలో మహిళలలు, యువతీయువకులు మరియు విద్యార్థులకి వారు నేటి సమాజ ధోరణుల వల్ల యెదుర్కొనే సమస్యల గురించి వాటి కి చట్టపరమైన భద్రత గురించి అవగాహన కలిగిస్తున్నారు.                                                                                                                   – సంపా.

సమాచారసంచారంఎరుకతోచేయండి …

చుట్టూ  ఉన్న సమాజం గురించి, సమాజాన్ని పరిశీలించే సమాజ శాస్త్రం గురించి నేటితరంలో యెంతమందికి తెలుసో  తెలియదుకాని, అంతర్జాలంలో సామాజిక  వేదికల  అనుసంధానం , సోషల్ నెట్ వర్కింగ్ గురించి తెలియనివారు ఉన్నారు లేదా వాడని వారు ఉన్నారు అంటే అటువంటివారి గురించి ఖచ్చితంగా తెలుసుకోవల్సిందే.  వారిపై పరిశోధన నిర్వహించాల్సిందే.  ఊపిరితో  సమానంగా  నేటితరం  సామజిక  వేదికలని భావిస్తోంది.   తమ ఇంట్లో , లేదా  ఇంట్లోని వారికి సైతం తెలియని చాలా విషయాలు సామాజిక వేదికలలో ముక్కు మొహం తెలియనివారికి తెలిసిపోతున్నాయి.

డా|| వరిగొండ సురేఖ

నేను ఇడ్లి తిన్నాను, నాకు ఉద్యోగం వచ్చింది, నేను నిరాశ, నిస్పృహలో ఉన్నాను, ఆఖరికి నేను ఆత్మహత్య చేసుకోబోతున్నాను  అనే  విషయం  కూడా  ముందు  నెట్టింట్లో తెలిసాకే  నట్టింట్లో తెలుస్తోంది అంటే ఆశ్చర్య పడక్కర్లేదు.

తినే తిండి,  వేసుకునేబట్టలు, నచ్చిన అలవాట్లు, కొనబోయే వస్తువులు, కొన్నసామాను , చూసిన సినిమా, చూడబోయే స్థలం , ప్రాణ స్నేహితుడు, ప్రాణంపోయినబంధువు , చేసే ఉద్యోగం , చేసుకోబోయే సహచరి, సాయింత్రం ఐదింటికి వెళ్ళేచోటు, ఉదయం తొమ్మింది గంటలకి ఉన్నచోటు ఇలా జగ్రాత్తగా పరిశీలించాలేగాని ఒక వ్యక్తితాలుకు ఒక వ్యక్తి తాలుకు వయసు, లింగము , ఎత్తు, బరువు, ఛాయ ,  చదువు, విద్యార్హతలు, జీవనశైలి, జీవితంలోని ఘటనలు, సంఘటనలు, ఇష్టాఇష్టాలు,ఆహరపు అలవాట్లు , వాడే అవాహణం , కొలిచే దేవుడు లాంటి పూర్తి వైయక్తిక విషయాలు కూడా వేదికల మీద ఉంచుతున్నారు.  ఒక వ్యక్తి తాలుకు మానసిక స్థ్తితి నుండి ఆర్థిక సంబంధిత విషయాల వరకు దేనికి పరదా ఉండటంలేదు. ఈ సమచారం కేవలం ఆ వ్యక్తికి మాత్రమే సంబంధించి బయటపడుతోంది అని అనుకుంటే అది పొరపాటే.  మనిషి సంఘజీవి.  కాబట్టి ఒక వ్యక్తితాలుకు పోస్టింగ్స్లో వారేకాక వారి చుట్టు ఉన్న వారి విషయాలు, సమాచారం కూడా వారి అనుమతి లేకుండా పంచబడుతోంది అన్నది గ్రహించాలి.

కుటుంబసభ్యులు, స్నేహితులు, బంధుమిత్రులు, పరిచయస్థుల నుండి మొదలుకొని ఒక్కోసరి యే మాత్రం పరిచయంలేని వ్యక్తులు కూడా ఆ చిత్రాల్లో ఉండటం జరుగుతుంది. తెలియనివారైనా, తెలిసినవారైనా ఆఖరికి మనవారైనా సరే వారి అనుమతి లేకుండా మరొకరితో పంచుకోవడం ఎంతవరకు సబబు.  సంస్కారం?!

అది వాట్సప్  ,టెలెగ్రాం లాంటి కబుర్ల వేదిక కావొచ్చు, లేదా ఫేస్బుక్, ట్విట్టర్, ఫ్లికర్ , పింటరెస్ట్ , యూట్యూబ్ లాంటి

వేదికలు కావొచ్చు, మరొకరి సమాచారం, ఉనికిని, గోప్యతని పంచే అధికారం ఎవరికైనా ఎక్కడిది. ఇదేవిధంగా పంచుకుంటూపోతే , ఒకరిని ఒకరు తెలియకుండా ప్రమాదంలో పడవేసే అవకాశమూ ఉంది.  ఇతరుల గౌరవానికి , గోప్యతకి భంగం కలిగించే అటువంటి చర్యలు ఎంతవరకు సమర్థనీయం.

అందరికి గుర్తింపు కావాలనే ఆరాటం కొంత అయితే, అందరిలో వెనుక బడకుండా ఉండాలనే తాపత్రయం కొంత. ఉంది కదా అని వినియోగించుకోవడం కొంత అయితే ,అందరూ చేస్తున్నపనేకదా అనే ధోరణి కొంత.  ఇలా కారాణాలు ఏమైనా అనేక రకాల అంతర్జాల అనువర్తనాలలో, వేదికలలో తెలిసి కొంతా తెలియక కొంత చిక్కుకు పోవడం జరుగుతోంది. దురదృష్టంయేమిటంటేచాలామందికిచాలామట్టుకుచిక్కుకుకొనిపోతున్నాముఅనితెలియకపోవడం.

ఇదిమంచిదా ,చెడ్డదా, వీటి ఉపయోగం లేదా నిరుపయోగం ఎంత అన్న విషయాలు చర్చించే ముందు తెలుసుకోవాల్సిన  మరో ముఖ్య విషయం మనమిస్తున్నసమాచారం యొక్క “దురుపయోగం”.

ఒకసారి  ఫ్బి  సామాజిక వేదికలో లేదా ఇన్స్టా లాంటి అనువర్తనాలలో యేదైనా పోస్టు చేసినప్పుడు అది తర్వాత మీరు తొలగించినా అప్పటికే అది యెవరెవరిని చేరి ఉంటుందో తెలియదు. వ్యక్తిగత గోప్యత లాంటి జాగ్రాత్తలు యెన్నితీసుకున్న అవి మృగతృష్ణలే అన్నవిషయం సామాజిక వేదికల గురించి, అనువర్తనాల గురించి అక్కడ ఇక్కడ వచ్చే వార్తల ద్వారా మనకి తెలియందికాదు.

గాలిలో ధూళి కణం యొక్క దిశ  ,ప్రయాణం, గమ్యస్థానం యే విధంగా అయితే నిర్దేశించడం కష్టమో అదేవిధంగా ఈ సమాచరం ఎవరిని చేరుతోంది, యెవరెవరు యెక్కడెక్కడికి ఈ సమాచారాన్నిచేరవేస్తున్నారో , యే ఉద్దేశ్యంతో చేరవేస్తున్నారో, పొందినవారు ఆ సమాచారాన్ని యెలా వినియోగింపదలచుకున్నారో వాటి పర్యవసనాలు… ఇలా యేది మనచేతిలో లేదు అన్నది సత్యం.

యెవరైనా మన సమాచారం యెందుకు వినియోగించుకుంటారు అన్నప్రశ్న వస్తే, యెవరికైనా మన స్వ విషయాలు ఎందుకు?! అన్న ప్రశ్న కూడా వేసుకోవాలి .కాలక్షేపానికి ఇలాంటి అప్ప్లికేషన్స్ని వాడే వారి సంఖ్యే యెక్కువ వాటిని సద్వినియోగించుకునే వారికన్నా. కాబట్టి వాట్సప్ , ఫేస్బుక్, ఇన్స్టా ,స్నాప్చాట్ ఇలా అనేక రకాల సామాజిక వేదికలు , అనువర్తనాలువాడే  (అప్ప్లికేషన్స్) వారు వారి తంతులను టపా చేసే ముందు యే సమాచారం మనం పోస్టింగ్చేస్తున్నాము అన్న జాగురకత ఉంటే మంచిది.   ఆ సమాచార మోచిత్రమో లేక మీ గురించిన అంశమో యేదైనా దుర్వినియోగ పరచడానికి యెంత అవకాశం ఉందో ఆలోచించుకొని పోస్ట్చేస్తే మంచిది.  ఇవాళ ఏదో పోస్ట్చేసి ఒక 5 ,6 యేళ్ళు పోయాక అదే పోస్ట్హాని కారకంగా మారే అవకాశమూ లేకపోలేదు.

సాంకేతికత అభివృధ్ధి అసిధార లాంటిది.  సరిగా వినియోగించుకోలేదో గాయపడే అవకాశమూ లేకపోలేదు. సైబర్ నేరాలు అనేక రంగులను పులుముకొని ఎప్పటికప్పుడు కొత్తకొత్త పధ్ధతుల్లో దాడిచేస్తున్నప్పుడు మెలుకువ, విచక్షణ అత్యావశ్యకం. ఒకవేళ అటువంటి అనుకోని అవాంఛనీయ పరిస్థితులు ఎదుర్కోవల్సి వచ్చినా ధైర్యం వీడక చట్టాన్ని ఆశ్రయించా లేకా కంగారుపడి స్థైర్యం కోల్పోయి అనుచిత నిర్ణయాలు తీసుకోకూడదు.

వాయువు కన్న వేగంగా సమాచార ప్రయాణం సాగుతున్న ఈ కాలంలో అవధి హద్దు గమ్యము కూడా లేని ఆ సమాచారన్ని ఎవరికి ఎందుకు ఇస్తున్నామో అన్న ప్రశ్న ఎవరికి వారు వేసుకుంటే కొంత మేరా నేరాలని అరికట్టవచ్చు. ఆరోగ్యమై నసమాజాన్నినిర్మించవచ్చు.

Written by Varigonda Surekha

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

సీతమ్మ

నైతిక విలువలకు దర్పణం .. “శారదాంబ శతకం”