అమ్మా….! ఒక్కసారి ఆలోచించు..

తరుణి పాఠకులందరికీ నమస్కారం!
తురుణి పత్రిక ప్రారంభించి సంవత్సరం పైనే గడిచింది. ప్రారంభంలో పాఠకులు పరిచయం కావాలని ప్రతి రోజు కొన్ని ఆర్టికల్స్ ని పెడుతూ వచ్చేదాన్ని. కవయిత్రులు, రచయిత్రులు, కళాకారులు తరుణి పత్రికకు పరిచయం అయ్యాక, నేను ముందు నిర్ణయించుకున్నట్టుగా దినపత్రిక నుంచి వారపత్రికకు మార్చుకున్నాను. ఇదంతా బాగానే ఉంది. లబ్ద ప్రతిష్టులైన రచయితలు వర్ధమానకవయిత్రులు తరుణి ద్వారా పాఠకులకు పరిచయమయ్యారు. రచనలు ఎక్కువై అంటే లోడ్ ఎక్కువై వెబ్సైట్ తిరుగుతూ ఉండేది , సరిగ్గా ఓపెన్ కాకపోయేది !ప్రారంభంలో నేను తీసుకున్న వెబ్సైటు డిజైన్ ఎలాంటిదో సాంకేతిక విజ్ఞానం తెలియదు.సాంకేతికంగా ఇతరులపై ఆధారపడి చేస్తున్నాను. మళ్లీ వెబ్సైట్ డిజైన్ అంత చేంజ్ చేయించి ఇప్పుడు వస్తున్న విధంగా ఒక క్యాలెండర్ ఒక పద్ధతిగా చేయడానికి మళ్లీ కసరత్తు చేయాల్సి వచ్చింది. అప్పుడు ప్రారంభంలో వచ్చిన ఆర్టికల్స్ ఏవి ఇప్పుడు కనిపించడం లేదు కాబట్టి ఆ ఆర్టికల్స్ అన్ని మళ్ళీ ఇప్పుడు తరుణిలో చేర్చాలని నిర్ణయించుకున్నాను. చక్కని కవితలు, కథలు,ఉషోదయం, తరుణీయం ,ఉషోదయం, న్యాయ సలహాలు, డాక్టర్ సలహాలు అన్నీ కూడా ప్రతివారం కొన్ని కొన్ని పెట్టాలని నిర్ణయించుకున్నాను ఇది పాఠకులు గమనించాలని అభ్యర్థన. చిత్రాలు వాటికి నేను రచించిన చిత్ర కవితలు అన్ని చేరుస్తాను. చూడండి మీ అభిప్రాయాలను తెలియజేయండి.
మీ,
కొండపల్లి నీహారిణి, తరుణి పత్రిక వ్యవస్థాపకురాలు, సంపాదకురాలు.

 

అవునండీ! ఆమె బాధ్యత అంతటితోనే తీరిపోదు.
పెళ్లయిన తర్వాత తనకంటూ ఒక కుటుంబాన్ని ఏర్పరచుకుంటుంది. తన సంసారాన్ని సవ్యంగా సాగించడానికి తనని తాను మార్చుకుంటూ, కొత్త అలవాట్లను నేర్చుకుంటూ, బంధాలను బంధుత్వాలను కలుపుకుంటూ తనదైన కుటుంబంలో తాను ఒకటిగా ఇమిడిపోవడానికి సకల విధాల ప్రయత్నిస్తుంది ఓ ఆడపిల్ల. తన కలలను, కోరికలను పక్కన పెట్టి తన భర్త, తన పిల్లలే సర్వస్వంగా
బ్రతుకుతుంది. అమ్మతనం లోని ఆనందాన్ని
అనుభవిస్తూ “ఆయుష్మాన్ భవ” అంటూ నిండు మనసుతో ఆశీర్వదిస్తూ,తన పిల్లల వృద్ధి కోసం తపిస్తూ ఉంటుంది తల్లి.

Dr. నీలం

నిజానికీ బడి పాఠాల కన్నా ముందు అమ్మ ఒడి పాఠాలే ఆ చిన్నారులు నేర్చుకునేది.
పాలబుగ్గల, పసిడి నవ్వుల చిన్నారులకు తల్లే తొలి గురువు.అలాంటి తల్లి పిల్లల విషయంలో తన బాధ్యతను సక్రమంగా నిర్వహిస్తుందా?
కేవలం వారి సదుపాయాలను సమకూర్చడంతో మాత్రమే సరికాదు. పిల్లల భవిష్యత్తుతో ముడిపడిన సమస్యలను పరిష్కరించడంలో, తలెత్తిన సందేహాలను సమాధాన పరచడంలో కూడా ఆమె పాత్ర కీలకమైనది. అయితే ఈ విషయంలో ఆమె ఎంత వరకు భాగస్వామ్యాన్ని పుచ్చుకుంటుంది?
పొద్దున్నే పిల్లలకు స్నానాన్ని చేయించి, వారికి టిఫిన్ తయారు చేసి, మధ్యాహ్నానికి భోజనాన్ని బాక్సులలో పెట్టి, వారిని బడికి పంపించినంత మాత్రానే ఆమె బాధ్యత తీరిపోతుందా?
మా అమ్మాయికీ, అబ్బాయికీ స్కూల్లో, కాలేజీల్లో మంచి మార్కులు వస్తున్నాయి అని చెప్పుకుంటూ సంబరపడిపోతుంటే సరిపోతుందా? మనిషి జీవితాల పై పరిసరాల, పరిస్థితుల ప్రభావమే ఎక్కువగా వుంటుంది.

డా. నీలం అమ్మగారితో

మా పిల్లలు మంచి మార్కులు తెచ్చుకుంటున్నారు అంటూ సరిపెట్టుకుంటే ఎలా?
తన పొత్తిళ్లలో పెరిగిన పిల్లల ప్రవర్తన ఎలా ఉందో కూడా గమనించాలి. అందరికీ తెలిసిన విషయమే అయినా
చెప్పక తప్పట్లేదు… ఆనాటి రోజులకి ఈనాటి పరిస్థితులకి వ్యత్యాసం చాలానే ఉంది.
మారుతున్న కాలానికి అనుగుణంగా తరాల అంతరాలు కూడా తారస్థాయిలో పెరిగిపోయాయి.” పెద్దల మాట చద్ది మూట” అన్న తీరుగా సాగుతున్న చదువులు కాదు ఇప్పటి పిల్లలు చదివేది.
నేటి తరం యువత ముఖ్యంగా స్వేచ్ఛ వైపు మొగ్గు చూపుతున్నారు, వారి సంతోషాలకు ఆటంకాలు కలిగించే ఏ విషయాన్నీ అంగీకరించలేని సున్నిత మనస్తత్వాలు వారివి. అమ్మ తన పిల్లలను కంటికి రెప్పలా కాపాడుకుంటూ వుంటుంది. వారి ఎదుగుదలను చూసి ఎంతో సంబర పడిపోతూ ఉంటుంది.
అయితే చిన్నతనంలో ఆ పసిపాదాల నడకను సవరించిన తల్లి, ఎదుగుతున్న సంతతి నడవడికలో మార్పులను కనిపెట్ట గలుగుతున్నారా అన్నదే పెద్ద ప్రశ్న? తోటి సహచరులతో వారి నడవడి ఎలా ఉంది, చెడు వ్యసనాలకు బానిసలు అవుతున్నారా,
సమాజం పట్ల బాధ్యతగా వ్యవహరిస్తున్నారా లేదా అని అసలు ఎవరైనా గమనిస్తున్నారా అంటే అటు అవుననీ, ఇటు కాదనీ చెప్పలేము.
తానే గమనిస్తూ ఉంటే నేడు ఆడపిల్లలపై ఇన్ని అత్యాచారాలు, ఇన్ని అరాచకాలు జరుగుతూ ఉండేవా? కొడుకు పుడితే స్వర్గానికి పోతామంటూ సంబరపడిపోతే సరిపోదు, విలువైన చదువులను, వస్తువులను అడగకముందే వారికి అందిస్తే చాలదు
కాస్త విలువలు కూడా నేర్పాలి. ఆడపిల్లల పట్ల సత్ప్రవర్తనను కలిగి ఉండటం అనేది చిన్ననాటి నుండే ఒక అలవాటుగా వారికి నేర్పించాలి. అప్పుడే సమాజం సమసమానత్వంతో శోభిల్లుతుంది.
ఆడపిల్లల పట్ల వివక్ష అనేది
ఎప్పటి నుంచో ఉన్న ఒక దురాచారం. ఈ దురాచారాన్ని మార్చడానికి తల్లులే నడుం బిగించాలి. మన కుటుంబ వ్యవస్థలో ఉన్న లోటుపాట్లలో స్త్రీ వివక్ష కూడా ఒకటి. ఇంట్లోని కుటుంబ సభ్యులు ఆడపిల్ల, మగపిల్లవాడి మధ్య భేదాన్ని చూపుతుంటే తల్లులు కలుగజేసుకొని ఖండించాలే తప్ప… మౌనంగా ఉండిపోకూడదు. అలా వుంటే మీరు వారిని ప్రోత్సాహించినట్లే…ఈ ఆచారానికి అనుమతిని అందించినట్లు. అలాగే ఆడపిల్లలకు కూడా
కోరుకున్నంత స్వేచ్ఛను అందిస్తే సరిపోదు దానివల్ల వ్యవహారాలు హద్దులు మీర కుండా గమనిస్తూ వుండాలి.
పిల్లల తప్పులు సర్దుబాటుతో
ఆపేయకుండా, తిద్దుబాటును తన బాధ్యతగా తీసుకుంటేనే, అన్నీ తానై బాధ్యత వహిస్తేనే
పిల్లలు భావిభారత పౌరులుగా, వర్ధిల్లి స్ఫూర్తి పథంలో పయనిస్తారని వారిని అలా మలిచినప్పుడే ” అమ్మతనం ” పరిపూర్ణమవుతుందని నా భావన. దానికి ఈ మాతృ దినోత్సవం సహకరిస్తుందని నా ఆకాంక్ష….

 

డా. నీలం స్వాతి
చిన్న చెరుకూరు గ్రామం,
తోటపల్లి గూడూరు మండలం,
నెల్లూరు జిల్లా.
Ph.no-6302811961

Written by Dr.Neelam Swathi

చిన్న చెరుకూరు గ్రామం,
నెల్లూరు.
6302811961.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

మన మహిళామణులు

ఆదర్శ మాతృమూర్తి కుంతి!