అనగనగా ఒక అడవి. ఆ అడవిలో ఒక మర్రి చెట్టు. దాని వేర్లు భూమి అడుగు భాగంవరకు ప్రాకి ఉన్నాయి. ఆ చెట్టుపై ఒక పిచుక కుటుంబం జీవిస్తూ ఉండేది. బాధ వచ్చినా సుఖం వచ్చి అవి వాటిని అనుభవిస్తూ అక్కడే జీవనం కొనసాగాయి…
పెద్ద కూతురు పిచుక రెక్కలు రావడంతో వేరే గూటికి ఎగిరిపోయింది. కొన్ని సంవత్సరాలు గడిచాక ఒక పెద్ద తూఫాను… ఆ తుఫానులో పిల్లలలను రక్షించబోయి తల్లి పిచ్చుక మరణిస్తుంది.
తండ్రి పిచుక ఆ రెండు రెక్కలు రాని చిన్ని పిచుకలను ఒక సురక్షితమైన గూటికి చేరుస్తారు. ఆ చిన్ని పిచుకలకు ఆహారం తేవడానికి అక్కడి నుండి ఆ తండ్రి పిచుక ఎగిరిపోతాడు. అప్పటినుండి రెండు చిన్ని పిచుకలు ఒకరికి ఒకరు తోడుగా ఉంటూ జీవనం కొనసాగిస్తాయి.
తల్లి జ్ఞాపకాలతో సతమతమవుతున్న రెండో పిచుకకు ఇంకో రెండు చిన్ని పిచుకలు పరిచయమవుతారు. ఈ రెండో చిన్ని పిచుక, తనకు కూడా మంచి స్నేహితులు దొరికారని ఎంతో సంతోషిస్తుంది. కానీ వీటికి కూడా రెక్కలు రావడంతో ఈ రెండు చిన్ని పిచుకలు తలా ఒక చెట్టుమీదకు ఎగిరిపోతాయి. అలా కాలం గడిచే కొద్దీ వేరే కొన్ని పిచుకలు ఈ చిన్ని పిచుక మంచితనాన్ని హేలన చేస్తూ గ్రద్దల్లా పొడిచి పొడిచి వేధింపజేయసాగాయి. ఈ చిన్నారి పిచుక బాధతో ప్రతిరోజు నిద్రించసాగింది.
అసలు ఈ చిన్నారి ప చుక జీవితంలో సంతోషం మల్లీ రానుందా…..?