మన మహిళామణులు

కవయిత్రి రచయిత్రి అధ్యాపకురాలు శ్రీమతి మన్నె లలిత

మన్నెలలిత

కాళోజీ పురస్కారం తోపాటు ఎన్నో అవార్డులు రివార్డులు బహుమతులు అందుకున్నారు లలిత గారు.ఒకప్రైవేట్ స్కూల్ టీచర్ గా సంసారం తో పాటు సాహిత్య పథంలో తనకంటూ గుర్తింపు పొందారు.ఆమె మాటల్లోనే తెలుసుకుందాం.

మన్నె లలిత, హైదరాబాద్., తల్లిదండ్రులు: శ్రీమతి పిన్నక చారుమతిగారు, శ్రీ పిన్నక వేంకటేశ్వరరావు గారు.
అమ్మ పనులన్నీ చేసుకుని పిల్లి మమ్మల్ని స్కూలుకు పంపించిన తర్వాత హార్మొనీ పెట్టె తీసుకొని త్యాగరాయ కీర్తనలు పాడుతూ ఉండేది. మా ఊరిలో మహిళా సమాజం స్థాపించి మధ్యాహ్న సమయంలో కుట్లు అల్లికలు రాట్నం వాడటం నేర్పిస్తుండేది. ఎవరికైనా ఉత్తరాలు వస్తే చదివి పెడుతుండేది. ఉత్తరాలకి సమాధానాలు కూడా అమ్మ చేత రాయించుకునే వారు.
నాన్నగారు కొంతకాలం తర్వాత ఉపాధ్యాయునిగా చేస్తూనే వ్యవసాయం కూడా చేసి మంచి ఉత్పత్తులు సాధించారు. కొత్త వంగడాలు తెచ్చి వేసి రైతులకు ఆదర్శం అయ్యారు. అజాతశత్రువు అనిపించుకున్నారు.

బాల్యం: ఆంధ్ర ప్రదేశ్ లోని “ఆంధ్రాప్యారిస్ “గా ప్రసిద్ధి చెందిన
తెనాలిలో జన్మించాను. తెనాలికి దగ్గరలోఉన్న ‘గుడివాడ’ గ్రామంలో 30 సంవత్సరాల తర్వాత ఆ ఇంటిలో పుట్టిన ఆడపిల్లను. నా… బిరుదులు:

కవిరత్న, సహస్ర కవిమిత్ర, సహస్ర వాణి శతపద్య కంఠీరవ, కవి సుధ, సాహితీ సచివ, సహస్ర కవితాసంధాత ,సహస్ర స్వీయ కవితా కోకిల ,సహస్ర శత శ్లోక కంఠీరవ ,సహస్ర వాణి సూక్తిశ్రీ, సహస్ర శ్లోక కంఠీరవ ,సహస్ర వాణి సహస్ర పద్య కంఠీరవ, సారస్వత మంజీర,సాహితీ సహృదయి,సాహితీ రత్న .

పురస్కారాలు:
“తెలుగు రక్షణ వేదిక “వారి ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో గౌరవనీయులు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారు( ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ )శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి ద్వారా

సుప్రసిద్ధ నటి కీ.శే. జమున గారితో లలిత

“కవి రత్న” బిరుదు అందుకున్నాను ( 2014).
ప్రపంచంలోనే మొట్టమొదటి వాట్స్అప్ అష్టావధాన కార్యక్రమం మరియు ప్రపంచంలోనే మొట్టమొదటి వాట్స్అప్ కవితా వేదిక పెట్టిన “తెలుగు కవితా వైభవం” నిర్వాహకులు శ్రీ మేక రవీంద్ర గారు నిర్వహించిన సందర్భంలో పృచ్ఛకురాలుగా పాల్గొన్నాను. యాదగిరిగుట్ట లో శ్రీమతి బులుసు అపర్ణ గారి అష్టావధాన కార్యక్రమంలో పృ…
ఇవే కాకుండా చాలా సమూహాలలో పాల్గొని ప్రథమ, ద్వితీయ బహుమతులు పొందాను .
శ్రీ శ్రీ కళావేదిక ద్వారా అనేక మార్లు టాప్ 20లోప్రశంసా పత్రాలు పొందాను.వాగ్దేవి సాహితీ వేదిక ,తెలుగు వెలుగు సాహితీ వేదిక ద్వారా పుస్తకములు, ప్రశంసా పత్రములు బహుమతిగా పొందాను .అక్షర యాన్ సంస్థ ద్వారా అనేకమార్లు సన్మానాలు పొందాను పుస్తకములు కూడా నావి రెండు ఆవిష్కరింపబడినవి . ముఖపుస్తకం ద్వారా కూడా ప్రశంసా పత్రాలు పొందాను .

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

“నిజమైన పొందిక”

అమ్మా….! ఒక్కసారి ఆలోచించు..