చిత్రకవిత
ఆనందాలు విషాదాలు
పరివ్యాప్తమైన చోట
ఒక నిర్వచనీయత
ఒక అనుబంధం
మనిషికి పాటకు మనం అనుకునే మాటకు
మా గన్నుల మాసాలు
రంజింపచేసే రుతువులు
మనసులు తత్వాలు
మనవైన ఆత్మాభిమానాలు
పొడచూపిన ప్రతిసారి
హృదయావరణంపై
సంగీతం ప్రవహిస్తుందనుకోవచ్చు
ఈ జగత్తుం ఈ అక్షర చాళ్ళుగా
వెలిగే దీపాలు
కన్నులూ మనస్సూ ఒక్క చోట లగ్నం
గుండె లయ తప్పని వేళ
భావమంతా లోలోపల జగత్ సృష్టే!!
లోకమంతా వర్ణమయ సౌందర్యమే!!
మంచి చెడుల కష్టసుఖాల తరాజు బేరిజుల్లో
నీవే ఒక తూకమైనప్పుడు!
– డా|| కొండపల్లి నీహారిణి, తరుణి సంపాదకురాలు