ప్రముఖ రచయిత డాక్టర్ కందేపి రాణి ప్రసాద్ తరుణి ముఖాముఖి

ఆమె అక్షరం ఒక మేలుకొలుపు. చిన్నారుల కోసం రాసే కథలు పిల్లలు ఎన్నో ప్రాపంచిక విషయాలను తెలియజేస్తాయి. అన్ని తరగతుల వారికి ఆమె ఒక స్ఫూర్తి. కళాభారతి, బాల సాహితి పూర్ణిమ, బాల సాహితి కౌముది, కవితా వాణి, కళా రాణి వంటి బిరుదుల్ని సొంతం చేసుకున్న ఆమె ఇటీవలే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విశిష్ట మహిళ పురస్కారాన్ని అందుకున్నారు. అక్షరాలతో అవగాహన కల్పించడమే కాదు పనికిరాని వస్తువులను కళాత్మకంగా తీర్చిదిద్దడం ఆమెకే సాధ్యం. ఆమే బహుముఖ ప్రజ్ఞాశాలి , ప్రముఖ రచయిత డాక్టర్ కందేపి రాణి ప్రసాద్. ఆమెతో ఈవారం తరుణి ముఖాముఖి…
తరుణి : విశిష్ట మహిళా పురస్కారం అందుకున్న మీకు తరుణి తరఫున అభినందనలు. బాల సాహితి వేత్తగా, మహిళా శిశు అభ్యుదయం కొరకు, ప్రమాదకర జబ్బుల గురించి అవగాహన కల్పించేందుకై రచనల్లో కథలు, కవితలు, వ్యాసాలు, పజిల్స్, సైన్స్ వ్యాసంగం, గల్పికలు మొదలైన ప్రక్రియల ద్వారా ప్రయత్నించారు. ఈ అవార్డు అందుకోవడం పై మీ స్పందన?
రాణీ ప్రసాద్: చాలా సంతోషంగా ఉంది. ఈ అవార్డు నా బాధ్యత ను మరింత పెంచింది. రేపటి సమాజం కోసం ఇంకా ఎంతో చేయాల్సి ఉంది అని గుర్తుచేసింది.

తరుణి: జబ్బుల గురించి తెలియ చెప్పే కవితలను చిత్రాలుగా గత 20 సంవత్సరాల నుండి వేస్తున్నారు కదా! ఈ ఆలోచన ఎలా వచ్చింది? విభిన్న తరహా లో మీరు చేసిన కృషి గురించి చెప్పండి.

రాణీ ప్రసాద్: విద్యార్థులకు సైన్స్ పట్ల, ఆరోగ్య అంశాలపై అవగాహన కల్పించేందుకై సులభమైన మార్గం బొమ్మలు. చిన్నారుల ను ఆకట్టుకునే విధంగా పుస్తకం తీసుకువచ్చే ప్రయత్నం లో ఈ ఆలోచన వచ్చింది. భారతీయత, అంతరించి పోతున్న మానవత్వం పె జీవ
జలాలు, దేశభక్తి, అరుదైన వృక్ష జాతులు, వంటి 30 రకాల ధీమ్ లతో 1500 చార్టులను వేశాను. వాటి కి చాలా మంచి స్పందన వచ్చింది.
అంతేకాదు మహిళా సమస్యల గురించి చెప్పటానికి వంటింటి వస్తువులతో వంద మహిళా చిత్రాలను వంద తయారు చేశాను. పిల్లలకు సులభంగా పాఠాలు బోధించేలా వేస్ట్ మెటీరియల్స్ తో దాదాపు 4000 టీచింగ్ ఎయిడ్స్, కళాకృతుల తయారీ చేశాను. భారత స్వాతంత్ర అమృతోత్సవాల సందర్భంగా 75 స్వాతంత్ర సమర వీరుల చిత్రాలు వేసి ప్రదర్శన నిర్వహించాం. కరోనా సమయంలో ఆసుపత్రిలో అవగాహన తరగతులు నిర్వహించడం, కరోనా కవితలతో స్ఫూర్తి దాయకమైన ‘క్వారంటైన్’ పుస్తక ప్రచురించాను.
తరుణి: మహిళా అభ్యున్నతికి చేస్తున్న సాహిత్య సేవ?
రాణీ ప్రసాద్: మహిళలు ఆరోగ్యంగా ఆనందంగా ఉంటే కుటుంబమంతా బాగుంటుంది. అందుకే ‘ హౌస్ వైఫ్ ‘ పేరుతో ఇంటి పనంతా అలుపు సొలుపు లేక చేసే మహిళల గురించి వారి సాధికారత గురించి రాశాను. సామాజిక సమస్యలను, ప్రమాదకర జబ్బులు ఎదుర్కొంటూ మహిళల ముందుకు వెళ్లేలా అనేక రచనలు చేశాను.
తరుణీ: మీ ఆసుపత్రిని మ్యూజియంగా మార్చి ప్రతిరోజూ ఆసుపత్రికి వచ్చే చిన్నారులకు అనేక విషయాలపై అవగాహన కల్పిస్తున్నారు. కారణం?
రాణీ ప్రసాద్: మా వారు డాక్టర్. మొదట్లో ఆసుపత్రికి వచ్చే పిల్లలు భయపడకుండా వారి ఆసక్తి అనిపించేలా కొన్ని చిత్రాలు వేశాను. పిల్లల్లో సాహిత్య విలువలు పెంపొందించేలా చిల్డ్రన్ లైబ్రరీ ని ఏర్పాటు చేసాం. దాంతో ఆసుపత్రికి వచ్చే చిన్నారులకు ఆరోగ్యం అందించడం తో పాటు సాహిత్య విలువలు
నేర్పిస్తున్నాం. జిల్లాలో అనేక స్కూళ్ళలో ఎగ్సిబిషన్లు పెట్టి ఇంటరాక్షన్ క్లాసులతో చైతన్యం కలిగిస్తున్నాం. రచనలు, చిత్రాలు, ముగ్గుల ద్వారా విద్యార్థులకు సులభంగా సైన్స్ నేర్పుతూ బాల వికాసం కొరకు కృషి చేస్తున్నాం. మన సాహిత్య సంపద కు వారసులు చిన్నారులే కదా.. అనారోగ్యాల వలన ఆసుపత్రిలో చేరి పండుగ రోజులు, జాతీయ దినాల రోజున బాధపడే చిన్నారుల కోసం స్వాతంత్ర దినోత్సవం, బాలల దినోత్సవం, వంటి వాటిని ఆసుపత్రిలో నిర్వహిస్తున్నాం.
తరుణి: బడి పిల్లల కోసం చేస్తున్న ప్రత్యేక కార్యక్రమాలు
రాణీ ప్రసాద్: జంతు శాస్త్రం లో ఎమ్మేసి చదివిన నేను దాదాపు నూటయబై జంతువుల విశేషాలు చెప్పేలా పొడుపు కథలను, పాటలను రచించి పుస్తకాలుగా ప్రచురించాను. బాలసాహిత్యంలో పిల్లల పక్షాన నిలబడి పెద్దలను ప్రశ్నించే కవితలతో మొదటి పుస్తకం వెలువరించాను. పిల్లలు స్కూళ్ళలో పడుతున్న మానసిక వత్తిడి గుర్తించి, ఒంటరిగా దూరంగా హాస్టళ్ళలో ఉండడం గురించి ఎన్నో కవితలు, గేయాలు, వ్యాసాలు రాస్తున్నాను. పిల్లలకు వచ్చే వ్యాధుల గురించీ, వాటికి తీసుకోవాల్సిన జాగ్రత్తలు గురించి కథలుగా రాసి అందిస్తున్నాం. దాంతో గవర్నమెంటు స్కూలు టీచర్లు, హోం సైన్స్ విద్యార్థులు వారి ప్రాజెక్టుల కోసం మా హాస్పిటల్ ను సందర్శిస్తుంటారు.
అరుదైన మొక్కల గురించి వ్యాసాలను విద్యార్ధి చెకుముకిలో పిల్లల కోసం రాశాను. కొన్ని యూ ట్యూబు చానెల్స్ నేను రాసిన కథల్ని కవితల్ని ఆడియోలుగా రూపొందించాయి. వందల కథల్ని అడియోలుగా చేసి శ్రోతలకు అందుబాటులో ఉంచాం. ఆకాశవాణి, దూరదర్శన్ , ఈ టివి, టివి 9, NTV వంటి చాలా చానెల్స్ లో నేను చేస్తున్న సేవలపై కథనాలు రావడంతో చిన్నారుల కోసం నేను రాసిన సాహిత్యం ఎంతో మందికి చేరువ అయ్యింది. తెలుగు భాషను పిల్లలకు నేర్పించడం కోసం చిల్డ్రన్ లైబ్రరీ పెట్టి కథల పుస్తకాలను అందిస్తున్నాం. పొడుపు కథలు, పజిల్స్, కథలు, గేయాలు వంటి 20 రకాల ప్రక్రియలతో బాలసాహిత్యాన్ని నేటి చిన్నారులకు అందిస్తున్నాను.
తరుణి: నిరుపయోగంగా పడేయాల్సిన అనేక వస్తువులను అలంకరణ వస్తువులుగా, కూరగాయలను బొమ్మలుగా మార్చి పిల్లలకు వైవిధ్యమైన బొమ్మల్ని అందిస్తూ.. వారిలో ఆసక్తిని పెంపొందిస్తారు. వీటిపై ఆసక్తి ఎలా కలిగింది
రాణీ ప్రసాద్: పిల్లలకు ఆసక్తి కలిగించాలంటే కొత్తకొత్త బొమ్మలు కావాలి. ఎన్ని కొన్నా వాటితో కొద్దిసమయమే ఆడుకుంటూరు. అందుకే వారే తయారుచేసేలా బొమ్మలను చేశాను. మన ఇంట్లో వృధాగా పడి ఉండే వస్తువులతో వెరైటీ బొమ్మలు చేశారు. దాంతో చిన్నారుల్లో ఆసక్తి పెరుగుతుంది. ఆలోచనకు కాస్త సృజనాత్మకత జోడిస్తే చాలు.. ఎన్నో అద్భుతాలు చేయవచ్చు. నేను తయారు చేసిన 4000 సైన్స్ ప్రాజెక్టులను వార్త దినపత్రిక పన్నెండు సంవత్సరాలు ఏకధాటిగా ప్రచురించబడింది. పిల్లల కోసం తయారు చేసిన కూరగాయల బొమ్మల్ని సైతం కూడా పలు పత్రికలు సంవత్సరాల తరబడి ప్రచురించాయి. కేవలం బొమ్మలే కాకుండా విజ్ఞానాన్ని చొప్పించి తయారైన వ్యాసాలు “ బొటనికల్ జూ “ పుస్తకంగా తీసుకువచ్చాం.
తరుణి: ఇప్పటివరకు మీరు నిర్వహించిన శీర్షికలు :
రాణీ ప్రసాద్: ప్రముఖ పత్రికల్లో అన్నింటిలో నా రచనలు ప్రచురించారు. ఏళ్ళ తరబడి శీర్షికలు నిర్వహించాను. వాటిలో కొన్ని
1. ‘సరదా సరదా బొమ్మలు’ నవంబరు 1998 నుండి 2007 వరకు
2. వార్తదినపత్రిక ‘మొగ్గ’ లో పిల్లల కోసం బొమ్మలతో నిర్వహిస్తున్న శిర్షిక
3. నది మాసపత్రికలో ‘పిల్ల కెరటాలు’ శిర్షిక 2007 జనవరి నుండి 2008 వరకు
4. ‘బాలతేజం’ మాసపత్రికలో ‘సైన్స్ పాయింట్’ శీర్షిక 1999 నుండి…
5. ‘మొలక’ మాసపత్రికలో ‘చేసిచూద్దాం’ శీర్షిక 2013 నుండి…
6. ‘బాలబాట’ మాసపత్రికలో ‘ఇలా చేద్దాం’ శీర్షిక 2015 నుండి…
7. ‘నవ తెలంగాణ’ దినపత్రికలో ‘వేస్ట్ టు బెస్ట్’ శీర్షిక 2013 నుండి…

టి.వి. కార్యక్రమాలు :
1) ‘సుధామయి’ ఈటివిలో ‘అధ్నిక మహిళలు – పిల్లల పెంపకం’ పేరుతో ప్రసంగం – 1998
2) ‘నారి – భేరి ఈటివి – 2లో ‘చిన్నారులు – చదువులు’ చర్చ కర్యక్రమంలో బాల సాహితివేత్తగా పాల్గొనడం – 2007
3) ‘తెలుగు వెలుగు’ ఈటివి – 2 లో బాలగేయాలు, పొడుపు కథలు ప్రసారం – 2009
4) గిడుగు జయంతి సందర్భంగా స్పెషల్ ప్రోగ్రాంగా ఈటివి – 2 లో పొడుపు కథలు ప్రసారం – 2009
5) ‘మాతృభాషా దినోత్సవం’ సందర్భంగా N tv లో బాలగేయాలు, పొడుపు కథల్ని పిల్లలకందుబాటులో
ఉంచిన ఆసుపత్రిగా ‘సృజన్ పిల్లల ఆసుపత్రి’ పరిచయం – 2009
6) R tv లో ‘బ్రేక్ ఫాస్ట్’ షో ద్వారా బాలసాహితివేత్తగా పరిచయం – 2010
7) ‘కళరాణి’ పేరుతో Tv – 9లో వ్యర్థ పదార్థాలతో కళాఖండాల పరిచయ కార్యక్రమం – 2011
8) Tv – 9లో వ్యర్థ పదార్థాలతో బొమ్మల పరిచయం – 2006
9) ‘ఇన్ కేబుల్’ లో పొడుపు కథలు, వ్యర్థ పదార్థాల బొమ్మలు ప్రసారం – 1997,1999,2001,2008,2011
10) సుధామయి, వనితావాణి కార్యక్రమాల్లో ఈటివి లో వ్యర్థపదార్థాలతో షోపీస్ లా తయారీ ప్రసారం –1998,1999
11) సిటికేబుల్ లో ప్రసారం 1996,1998,2000,2002,2003,2005,2009,2011,2013,2015
12) ఇస్రో మోడల్ సిటి కేబుల్, ఎస్.ఎస్.కేబుల్ లో ప్రసారం 2017
13) ‘సీసాల సోయగం’ పేరుతో బాటిల్ ఆర్ట్ కళాఖండాల ప్రదర్శన ప్రసారం – 2018
తరుణి: మీరు రచించిన వ్యాసాలు
రాణీ ప్రసాద్ : అనేక అంశాలపై కథలు, కవితలు, నాటికలు, వ్యాసాలు రచించాను. వాటిలో ముఖ్యమైనవి
• ప్రపంచంలోని వివిధ శునక జతులపై ప్రాసిన వ్యాసాలు – 35
• వార్త దినపత్రిక మొగ్గలో ఆగస్టు 2001 నుండి మే 2002 వరకు ప్రచురించబడ్డాయి.
• పిల్లల విద్య, పాఠశాల సమస్యలపై వ్రాసిన వ్యాసాలు వివిధ దినపత్రికల్లో ప్రచురించబడ్డాయి.
• సైన్స్ వ్యాసాలు 50, • సాహిత్య వ్యాసాలు 10 , • యాత్రా చరిత్రలు 40 కి పైగా ప్రచురించారు.
తరుణి: ఇప్పటి వరకు మీరు అందుకున్న అవార్డులు – పురస్కారాలు
రాణీ ప్రసాద్ : వందల్లో ఉన్నాయి. వాటిలో కొన్ని ..
1) ‘ కళాభారతి ‘ అవార్డు 2004 2003
‘ సెట్ ‘ చీరాల వారి పురస్కారం
2) ‘ సిరివెలుగుల ఆత్మీయ సత్కారం 2003
సిరిసిల్ల తాలుకాలోని విశిష్టవ్యక్తులకు, కరీంనగర్
జిల్లా క్పోలిసు యంత్రాగంచే జరిగిన ఆత్మీయ సత్కారం
3) ‘ సాహిత్యరత్న ‘ 2005
బిరిద ప్రదానం ప్రతిభా పురస్కారం
మానస సాహిత్య, సాంస్కృతిక అకాడమీ
4) ‘ స్వర్ణాంధ్ర ఉగాది పురస్కారం ‘ 2003
సెట్ సంస్థ, చీరాల
5) ‘ పద్మపీఠం పురస్కారం ‘ 2002
పద్మపీఠం మాసపత్రిక సప్తతివత్సర సత్కారం
6) ‘ గ్రామీణ కళాజ్యోతి పురస్కారం ‘ 2001
కరీంనగర్ జిల్లా ఫోక్ ఆర్ట్స్ అకాడమీ వారి పురస్కారం
7) ‘ యునెస్కో మిలీనియం బెస్ట్ చిల్డ్రన్ రైటర్ ‘ 2000
యునెస్కో క్లబ్ ఆఫ్ రేపల్లె వారి ప్రశంసాపత్రం
8) ‘ నాగుల మల్లయ్య స్మారక ‘ పురస్కారం 2009
9) విశ్వభారతి వారి ఉగాది పురస్కారం 2011
10) బాల సాహిత్య పరిషత్ వారి బాల సాహిత్య కౌముది పురస్కారం 2011
11) భారత్ ఆర్ట్స్ అకాడమీ వారి ఉగాది పురస్కారం 2016
12) రావూరి భరద్వాజ బాలల విజ్ఞాన పీఠం వారి బాలసాహిత్య పురస్కారం – 2017
13) తెలంగాణ ప్రభుత్వ జిల్లా స్థాయి ఉత్తమ సాహిత్య పురస్కారం – 2017, సిరిసిల్ల జిల్లా
14) ‘ నాగుల మల్లయ్య స్మారక ‘ పురస్కారం 2009
15) విశ్వభారతి వారి ఉగాది పురస్కారం 2011
16) బాల సాహిత్య పరిషత్ వారి బాల సాహిత్య కౌముది పురస్కారం 2011
17) మహిళా శిశు సంక్షేమ శాఖ వారి జిల్లా ఉత్తమ మహిళా రచయిత్రి అవార్డు – 2017, సిరిసిల్ల
18) ఐక్య ఉపాధ్యాయ ఫెడెరేషన్ వారి జిల్లా ఉత్తమ మహిళా రచయిత్రి అవార్డు – 2017, సిరిసిల్ల
19) కళామిత్ర మండలి వారి జాతీయ స్థాయి సాహిత్య ప్రతిభా పురస్కారం ఒంగోలు – 2017
20) ‘ సహజ సాహితీ సంస్థ ‘ చీరాల వారి ‘ ఉత్తమ రచయిత్రి పురస్కారం, చీరాల – 2017
21) “ నారంశెట్టి బాలసాహితి పురస్కారం “ పార్వతీపురం (విజయనగరం జిల్లా) – 2017
22) 50వ జాతీయ గ్రంధాలయ వారోత్సవాల సందర్భంగా ఉత్తమ బాలసాహిత్య రచయిత్రి పురస్కారం – 2017
చిలకలూరిపేట (గుంటూరు జిల్లా)
23) వాసాల నర్సయ్య బాల సాహితీ పురస్కారం, కరీంనగర్ – 2018
24) ‘ బాల సాహితీ పూర్ణిమ ‘ బిరుదు ప్రదానం, చీరాల, సమాజ సాహితీ సంస్థ వారిచే – 2017
25) పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయ ఉత్తమ రచయిత్రి పురస్కారం – 2017
26) ఎన్. మంగాదేవి బాల సాహిత్య పురస్కారం – గుంటూరు 2018
27) విశ్వబ్రాహ్మణ ప్రొఫెషనల్స్ & అఫిషియల్స్ సంస్థ – 2018
28) చింతోజు బ్రహ్మయ్య బాల సాహిత్య పురస్కారం – 13-6-2018
29) సిరిసిల్ల సాహితీ సమితి నుంచి కవితావాణి బిరుదప్రదానం 22-8-2019
30) వోపా సిరిసిల్ల జిల్లా అధ్వర్యంలో సన్మానం 25-8-2019
31) గిడుగు రామ్మూర్తి సాహిత్య పురస్కారం 27-8-2019
32) రాజా వాసిరెడ్డి పౌండేషన్ వారి బాలసాహిత్య పురస్కారం 7-10-2019
33) బాలగోకులం సంస్థ వారి “బాలప్రియ” పురస్కారం 19-11-2019
34) కవితా విద్య సాంస్కృతిక సంస్థ, కడప వారి జాతీయస్థాయి పురస్కారం 24-2-2019
35) మహతి మహిళా కళాశాల వారి ఉత్తమ మహిళా సత్కారం 8-3-2019, 2018
36) సి.వి రామన్ అకాడమీ వారి జాతీయ ఉగాది పురస్కారం 6-2-2019
37) ఆరిగపూడి ఫౌండేషన్ వారి మహిళారత్న పురస్కారం 11-3-2019
ఈ ఏడాది తెలంగాణ ప్రభుత్వ విశిష్ట మహిళా పురస్కారం అందున్నాను.
తరుణి: నేటి మహిళలకు వీరిచ్చే సూచన
రాణీ ప్రసాద్ : పొద్దున లేచింది మొదలు ఎన్నో పనులతో సతమతమయ్యే మహిళలు కాస్త తమలోని సృజనాత్మకతకు కూడా టైం ఇచ్చి తమ సంతోషం కోసం ఏదైనా చేయాలి. వారికి నచ్చింది ఏదైనా చేస్తే ఆ కళ వారికి రెట్టింపు ఉత్సహాన్ని ఇస్తుంది.

వంగ యశోద

Written by vanga Yashoda

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

మన మహిళామణులు

పిచ్చుక