పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురం లో పుట్టిన సుబ్బలక్ష్మి గారు బి.ఎ.బి.ఇడి.చేశారు.ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ లో ఎకౌంట్స్ ఆఫీసర్ గా చేసి రిటైరైనారు.బాల్యంలో తమ పక్కింట్లో ఉన్న మొగల్తూరు రాజుల దూరపు బంధువులతో పరిచయం పుస్తకంతో దోస్తీ కి కారణమైంది.ఇక తన అనుభవాలను ఇలా పంచుకున్నారు.
“చిన్నప్పుడు మా పొరుగింటి కి వెళ్లే దాన్ని.ఆస్త్రీలు ఘోషా పాటిస్తారు.చాలా పుస్తకాలు వారు తెప్పించి చదివేవారు.అలా చందమామ చదవడం తో సాహిత్యం కథలపై ఆసక్తి పెరిగింది.
మానాన్న గారి ఆఫీస్ వారు నిర్వహించిన కథల పోటీలో 15రూపాయలబహుమతిరావటంతో నారచనకు బీజం పడింది.ఒకజోక్ పబ్లిష్ అయి5రూపాయలు ఎం.ఓ.అందుకోడం మరువలేని అనుభూతి.
తప్పు చేయకు అనే తొలి డిటెక్టివ్ కథ తో ఊపందుకుని బాలల కథలతో ఓ రచయిత్రి గా ఎదిగారు.అవి బొమ్మరిల్లు చందమామలో వచ్చాయి.విపులలో వచ్చిన అక్షింతలు కథ 5భాషల్లోకి అనువదింపబడింది.దాదాపు అన్ని ప్రముఖ పత్రికల్లో కవితలు వచ్చాయి.టి.వి.ఛానల్స్ లో ఈమె పరిచయం ప్రసారం ఐంది.ప్రపంచకవిసమ్మేళనం పుష్కర అవధానాల్లో పాల్గొన్నారు.వివిధ సాంస్కృతిక సంస్థలనించి ఎన్నో ఎన్నెన్నో పురస్కారాలు పొందారు.బాలగోకులం ఆకెళ్ళ అసోసియేషన్ సంస్థలు నెలకొల్పి బాలకథారచయితలను బాలలను సత్కరిస్తున్నారు. ప్రభుత్వ బడుల్లో వర్క్ షాప్ లు నిర్వహిస్తారు.బాలలనేస్తం బాలప్రియ అవార్డులను పిల్లల కి ఇస్తున్నారు.రేడియోలో స్త్రీ ల పిల్లల కార్మికుల ప్రోగ్రాంలలో ఈమె రచనలు ప్రసారం ఐనాయి.భర్త ఏ.జి.ఆఫీసు ఉద్యోగి శ్రీ వెంకటసుబ్బారావు గారు.పిల్లలను ఈమె ప్రోత్సహించడం ముదావహం