మా బంగారు సీతమ్మ

కామేశ్వరి

జగజ్జనని సీతాదేవి. రామచంద్రుని పట్టపురాణి. జనకరాజును ముద్దుల కుమార్తె. దశరథుని వంశాంకురం. పతివ్రత శిరోమణు అందరిలోనూ అగ్ర గణ్య.
పిల్లలు లేని జనకమహారాజు యజ్ఞం చేయడానికి భూమిని పూజించి, దున్నుతోంటే ఆ క్షేత్రం నుండి ఒక పసిబిడ్డ బయటపడింది. నాగేటి చాలు లో లభించినందున ఆమెకు సీత అని పేరు పెట్టారు. ఆయన గారాలపట్టిగా ఆ ఇంట పెరిగింది. అన్ని విద్యలందు ఆరితేరి యవ్వనంలోకి ప్రవేశించింది.
జనకుడు ఆమెకు వివాహం చేయ తలపెట్టాడు. తండ్రి జనకుని ఇంట్లో సురా సుర, గంధర్వ, యక్ష, కిన్నెర, మహోరగులు ఎవరు ఎక్కువ పెట్టలేని గొప్ప శివధనస్సు పూర్వీకుల నుండి వచ్చినది ఉన్నది.
విశ్వామిత్రుని యాగరక్షణార్థం బయలుదేరిన రామలక్ష్మణులు తాటక మారీచ సుబాహులు సంహరించి విశ్వామిత్రుని యజ్ఞం పూర్తి కావించి దారిగా మిధులకు వచ్చారు. వారిని జనకుడు సాదరంగా ఆహ్వానించి ఆ ధనస్సు గురించివివరించాడు. విశ్వామిత్రుడు ఆ ధనస్సును రామలక్ష్మణులకు చూపమన్నాడు. దానికి జనకుడు ఈ ధనస్సును ఎక్కుపెట్టిన వారికి అయ్యో నిజ, వీర్యశుల్క అయినా ఈ సీతతో వివాహం చేస్తాను” అన్నాడు. రాముడు ధనుర్భంగాన్ని సునాయాసంగా పూర్తి చేశాడు. జనకుడు సీతారాముల కళ్యాణం”” న భూతో న భవిష్యతి”” అన్నట్టుగా జరిపించరు. అయోధ్యలో సీతా రాములు 12 సంవత్సరాలు ఎంతో అన్యోన్యంగా, ఆనందంగా జీవించారు.
నీ ముద్దుల్లే భార్య అయిన కైకేయి కారణంగా సీతారాములు వనవాసం చేయవలసి వచ్చింది.. రామలక్ష్మణులు వనవాసానికి బయలుదేరుతుండగా సీత తాను వస్తానంది. శ్రీ రాముడు ఎన్ని విధాల భయపెట్టిన, ఎన్ని విధాల నచ్చజెప్పినా ససేమీరా అంది. “‘ నేను నీ భార్యను, నువ్వే గతి అని నమ్మిన దానిని, యవ్వన ప్రారంభంలో ఉన్నాను, నన్ను ఇప్పుడు ఎవరి రక్షణలో ఉండమంటున్నావు. నేను ఎలా ఉంటాను. నాకు తపస్సు అయిన, అరణ్యమైన, స్వర్గమైన నీతోనే. నీ సాన్నిద్యం లేని జీవితం నా కక్కరలేదు.”‘అంది. ఎంత మహా సాద్వియో కదా! రాముడు ఇంకా ఎన్నో మాయ మాటలు చెప్పి చేత మనసు మార్చాలనుకున్నాడు. అప్పుడు సీత”” రామా నీవు పురుష శరీరంలో ఉన్న స్త్రీ వి. నిన్ను ఏమనుకొని నా తండ్రి మిదిలాధిపతి అల్లుడుగా చేసుకున్నాడో తెలియటం లేదు అంది. రామబాణం కంటే తీవ్రమైన మాటల బాణం విసిరిన జాణ. వనవాసానికి బయలుదేరిన సీతారాములను చూసి అయోధ్య ప్రజలు ఎంతో దుఃఖించారు. సీతను చూచి వారు “” ఆకాశంలో తిరిగే వానికి కూడా చూడటం సాధ్యం కాని సీత ఈరోజున నగర వీధులలో, చుర్రున కాలే ఎండలో సామాన్య స్త్రీల విడుతోంది”అన్నారు. రోజు పట్టు చీరలు ధరించే చేత ఈరోజు ఆ మాయదారి కైక ఇచ్చిన నార చీరలను ఎంతో సంతోషంగా స్వీకరించిన సంతుష్టి ఆ సీత.
కోడలు సీతను చూసి కౌసల్యకు గర్వం వేసింది. “” అమ్మ! లోకంలో సగటు స్త్రీలు భర్త భోగభాగ్యాలు చేకూరుస్తూ, ఉన్నత స్థానంలో ఉంటే ఆ భర్తను గౌరవిస్తారు. లేకపోతే చులకన చేస్తారు. ఆపదలు రాగానే” క్షణమాత్త్రాత్ విరాగినః ” ఒక్క క్షణంలో భర్త పై అనురాగం కోల్పోతారు. కానీ నీవు పతివ్రతవై ముసులుకో “” అంది. అందుకు సీత” చంద్రుడుని కాంతి ఎలా వదలదో అలాగే నేను శ్రీరాముని, ధర్మాన్ని వదలను”” అంది
ఆ వనవాసం కాలంలోనే రావణుడు సీతను పహరించి లంకకు తీసుకుపోయాడు. తనని వివాహం చేసుకోవడానికి ఒక సంవత్సరం గడువు పెట్టాడు. వాడి మొహం కూడా చూడడానికి ఇష్టపడని సీత ఒక గడ్డి పరికను అడ్డుపెట్టుకొని రావణునితో”‘ రాక్షసా నేను ఉత్తమమైన వంశములో పుట్టాను. మరొక ఉత్తమమైన వఅంశానికి కోడలుగా వెళ్లాను, పతివ్రతను, తప్పుడు పనులు చేయలేని దాన్ని, నన్ను ఆశించకు” అని వీపు అతని వైపు ఉండేలా కూర్చుని ఇలా అంది “” ఉపదాయ భుజం తస్య లోకనాధస్య సత్కృతం కధo నామో పధా స్వామి, భుజ మన్యస్య కస్య చిత్ “” అంటే రాముడి భుజం తలగడగా చేసుకుని నిదురించే నేను ఇప్పుడు మరొకటి భుజం తలగడగా చేసుకోగలనా!అంది. ఎంత పరమ సాత్వి.
సీతను వెతకడానికి వచ్చిన ఆంజనేయునితో రామచరితం విని సీత”” మనిషి బ్రతికి ఉంటే రేపో, ఏడాదికో, నూరేళ్ళకో ఆనందం పొందుతాడు అనే సామెత నిజం మనిపిస్తోంది హనుమ ” అంది. భవిష్యత్తు మీద ఎంత నమ్మకమో. వెంటనే హనుమంతుడు నా వీపు మీద కూర్చో రాముని సమీపానికి తీసుకుపోతానన్నాడు. అప్పుడు సీత “” రాముడు వచ్చి రావణుడిని సభాంధవంగా సంహరించి తీసుకు వెళితే అది అతనికి తగిన పద్ధతి. ఆ రాముడి రాక కోసం ఎదురు చూస్తున్నాను. నువ్వు వెళ్లి వాళ్ళని తీసుకొచ్చి నాకు ఆనందాన్ని కలిగించు.” అంది హనుమ రాముని గురించి ఆనవాలు ఇమ్మంటే కొంగుముడి లోనున్న చూడామణిని తీసి ఇచ్చింది. ” హనుమా ఈ చూడాలని రాముడు వెంటనే గుర్తుపడతాడు. “అంది.
రామ రావణ యుద్ధం సమాప్తం అయింది. రాముడు లంకలో ఉన్న సీతను తను దగ్గరకు తీసుకురమ్మని హనుమను పంపాడు. సీత దివ్యాంబరాలు దివ్యభూషణాలు ధరించి రాముని చెంతకు వచ్చింది. సీతను చూచి రాముడు ఇలా అన్నాడు ” నా అవమానాన్ని తొలగించుకోవడానికి రావణుని చంపాను, నిన్ను గెలుచుకున్నాను, ఈ యుద్ధం నీకోసం చేసినది కాదు నా చరిత్రను రక్షించుకుందుకు నా వంశ కళం కాన్నీ తుడిచి వేసుకునేందుకు ” అన్నాడు. అప్పుడు సీత”” నువ్వు కోప ఆవేశంతో, చిన్న మనసుతో స్త్రీ తత్వానికే ప్రాధాన్యత నిచ్చి మాట్లాడుతున్నావు. నీ పట్ల నా భక్తి, నా శీలము ప్రశ్నకు పెట్టి ఆలోచిస్తున్నావు. నాకు జీవించాలని లేదు. ఈ బాధకు అగ్ని ఔషధం. నాకోసం చితి పేర్చు. భర్త వదిలిన స్త్రీకి అగ్నిప్రవేశమే తగిన గతి” అంది. అగ్నిలో ప్రవేశించింది. ” మనసా వాచా కర్మణా రాముని తప్ప ఇతరులను ఎరుగని దానినైతే అగ్నిదేవుడు నన్ను అన్ని విధాలా రక్షించుగాక!” అంటూ అగ్నిలోకి దూకింది. సీతను అగ్నిదహించలేదు. అగ్నిదేవుడు సీతను ఒడిలో కూర్చోబెట్టుకుని మంటలలోంచి బయటికి వచ్చి రామునితో “” ఈ మైధిలి ఏ పాపం చేయలేదు. ఈ పవిత్ర రాలని స్వీకరించు. ఇది నా ఆజ్ఞ”. అన్నాడు. ఆ సమయంలో స్వర్గం నుండి దశరథ మహారాజు కూడా వచ్చి సీతను’ నువ్వు అగ్నిప్రవేశం చేసి అన్ని లోకాలలోని స్త్రీలకు తలమానికంగా నిలిచావు”అన్నారు.
రాముడు సీతా లక్ష్మణ సమేతుడై పుష్పక విమానం ఎక్కి, అయోధ్యకు చేరి, భరతుడు అందించిన రామ పాదుకలు ధరించి, సీతా సమేతుడై పట్టాభిషేకం జరిపించుకున్నాడు.
ఆనాటి సీత ఔదార్యము, ఔన్నత్యము నేటికీ అనుసరించదగినదే, ఆచరింప వలసినదే

Written by Kameshwari

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

నవనాగరీకం

మన మహిళామణులు