మనం మన సంస్కృతిని పాటిస్తున్నామా?

           ఎమ్.పి. మమత

మనం మన సంస్కృతిని ఎంతవరకు పాటిస్తున్నాం అని ఆలోచిస్తే నాకు కొన్ని విషయాలు అర్థమయ్యాయి.

  • ఉదయం లేవగానే సూర్యనమస్కారం, సాయంత్రం సంధ్యావందనం చేయడం మన సంస్కృతి… కానీ.. ఉదయం జిమ్ లకు, సాయంత్రం పబ్ లకు వెళ్ళేవరకు దిగజారిపోయాం…
  • నేడు వేడి అన్నంలో నెయ్యి, పచ్చడి పోసుకొని తినే మనం పిజ్జ, బర్గర్లకు ప్రాకులాడుతున్నాం.
  • పెద్దవాళ్లను గౌరవించడం మన సంప్రదాయం… కాని ముసలివాళ్లని వారి మాటలను పెడచెవిన పెడుతున్నాం. ముసలితనం అంటే వాళ్ల వయసు కాదు, వాళ్లకు గల గొప్ప అనుభవం…
  • చీరలు మన భారతదేశపు స్త్రీల చిహ్నం…. కానీ… చీరలు కట్టినవాళ్లను ‘Any thing Special’ అనేవరకు మన సంస్కృతి పడిపోతుంది….
  • ఆపదలో ఆదుకోవడం, కష్టాళ్లో ఉన్నవాళ్లను చేరదీయడం మన భారతీయుల లక్షణం…. కానీ… వాటిని వీడియో తీసి లైక్ ల కోసం ప్రాకులాడే స్థాయికి మన మానవత్వం దిగజారిపోయింది…
  • విదేశీయులు శ్రీకృష్ణ నామంలో మునిగి నృత్యం చేస్తుంటే… నువ్వు త్రాగి నడిరోడుమీద తందానా అంటున్నాము.
  • నువ్వు మాత్రమే అందంగా ఉంటే సరిపోదు… నీ మనస్సు కూడా అంతే కల్మషం లేకుండా ఉండాలి.

Written by Mamatha

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ఫోటోవార్త

నవనాగరీకం