మన మెరుగని మహిళా  వాగ్గేయకారులు

కళ్యాణి వరదరాజన్

తరుణి పాఠకులందరికీ నమస్కారం!
తురుణి పత్రిక ప్రారంభించి సంవత్సరం పైనే గడిచింది. ప్రారంభంలో పాఠకులు పరిచయం కావాలని ప్రతి రోజు కొన్ని ఆర్టికల్స్ ని పెడుతూ వచ్చేదాన్ని. కవయిత్రులు, రచయిత్రులు, కళాకారులు తరుణి పత్రికకు పరిచయం అయ్యాక, నేను ముందు నిర్ణయించుకున్నట్టుగా దినపత్రిక నుంచి వారపత్రికకు మార్చుకున్నాను. ఇదంతా బాగానే ఉంది. లబ్ద ప్రతిష్టులైన రచయితలు వర్ధమానకవయిత్రులు తరుణి ద్వారా పాఠకులకు పరిచయమయ్యారు. రచనలు ఎక్కువై అంటే లోడ్ ఎక్కువై వెబ్సైట్ తిరుగుతూ ఉండేది , సరిగ్గా ఓపెన్ కాకపోయేది !ప్రారంభంలో నేను తీసుకున్న వెబ్సైటు డిజైన్ ఎలాంటిదో సాంకేతిక విజ్ఞానం తెలియదు.సాంకేతికంగా ఇతరులపై ఆధారపడి చేస్తున్నాను. మళ్లీ వెబ్సైట్ డిజైన్ అంత చేంజ్ చేయించి ఇప్పుడు వస్తున్న విధంగా ఒక క్యాలెండర్ ఒక పద్ధతిగా చేయడానికి మళ్లీ కసరత్తు చేయాల్సి వచ్చింది. అప్పుడు ప్రారంభంలో వచ్చిన ఆర్టికల్స్ ఏవి ఇప్పుడు కనిపించడం లేదు కాబట్టి ఆ ఆర్టికల్స్ అన్ని మళ్ళీ ఇప్పుడు తరుణిలో చేర్చాలని నిర్ణయించుకున్నాను. చక్కని కవితలు, కథలు,ఉషోదయం, తరుణీయం ,ఉషోదయం, న్యాయ సలహాలు, డాక్టర్ సలహాలు అన్నీ కూడా ప్రతివారం కొన్ని కొన్ని పెట్టాలని నిర్ణయించుకున్నాను ఇది పాఠకులు గమనించాలని అభ్యర్థన. చిత్రాలు వాటికి నేను రచించిన చిత్ర కవితలు అన్ని చేరుస్తాను. చూడండి మీ అభిప్రాయాలను తెలియజేయండి.
మీ,
కొండపల్లి నీహారిణి, తరుణి పత్రిక వ్యవస్థాపకురాలు, సంపాదకురాలు.

 

సంగీత ప్రపంచంలో ఓలలాడేవాళ్ళకు అందులోని సాహిత్యమూ నచ్చుతుంది . తమ మధుర గాత్రంతో వారెప్పుడూ

సుమనస్విని

సజీవంగా మన హృదయాలలో ఉంటారు . పూర్వ సంప్రదాయాలకు తలవంచి తమలోనే కళలను ముడుచుకున్న తరుణులెందరో మన ఆ నాటి తరుణులు! కొందరున్నారు తమదైన ప్రతిభను చాటిన తరుణులు .

కర్ణాటక సంగీతంలో వాగ్గేయకారులనగానే మనకు గుర్తుకు వచ్చే పేర్లు అన్నమయ్య, త్యాగయ్య, పురందరదాసు, రామదాసు…. కానీ ఎప్పుడైనా మీరు ఆలోచించారా స్త్రీ వాగ్గేయకారుల గురించి? ఎంతోమంది స్త్రీ వాగ్గేయకారులు ఉన్నారు కానీ వారు వెలుగులో లేరు అంతే. పూర్వకాలంలో స్త్రీలకు ఎన్నో నియమాలు ఉండేవి. వాటివల్ల వారు బయటకు వచ్చి పాడేవారు కాదు. అయినా కొంతమంది స్త్రీలు అటు సమాజఁతో పోరాడుకుంటూ, ఇంటి పనులు చేసుకుంటూ కూడా ఎన్నో రచనలు చేశారు. ఎక్కువమంది స్త్రీ వాగ్గేయకారులకు వాళ్ళ రచనలను ప్రాచుర్యం చేసుకోవడం కొరకు మగవారి పేర్లను తమ మారు పేర్లుగా వాడుకున్నారు. ఈ విషయం ఆనాటి మహిళల స్థితిగతులను చెప్పకనే చెబుతుంది. ఈ ధారావాహికలో మహిళా వాగ్గేయకారుల గురించి చర్చించుకుందాం. అందులో భాగంగా, ఆండాళ్, అక్క మహాదేవి, తాళ్ళపాక తిమ్మక్క…. లాంటి ఎందరో మహానుభావులైన వాగ్గేయకారులను గురించి , నేటి తరం మహిళా వాగ్గేయకారుల వరకు తెలుసుకుందాం. నా ఆలోచనలను మీతో పంచుకోవడానికి ఆతృతగా ఉన్నాను.

మీ

పాలకుర్తి  సుమనస్విని

 

కళ్యాణి వరదరాజన్

కళ్యాణి వరదరాజన్, మహిళా లోకం గర్వించదగ్గ గొప్ప మహిళా వాగ్గేయకారిని. తాను అన్నీ మేళకర్త రాగాలు (79)లో రచనలు చేశారు. కళ్యాణి, సంగీత సాహిత్యపరమైన వాతావరణంలో పెరిగారు. తాను చిన్నప్పటి నుండే రచనలు చేసి వాటిని స్వరపరిచేవారు.

తన తం్రడి నరసింహాచారియర్ తెలుగు, సంస్కృత భాషల్లో పండితులు, మరియు తన తల్లి శ్రీమతి సింగారమ్మాళ్, ఒక సంగీతకారిని. కళ్యాణినికి చిన్నప్పటి నుండే సంగీతం, వీణలో శిక్షణ ఇప్పించారు. ఆ తరువాత వయోలీను కూడా నేర్చుకున్నారు.

కల్యాణి వివాహనంతరం, ముంబయిలో స్థిరపడ్డారు. తాను 1956లో “మహారాష్ర్ట సంగీత సమ్మేళన్”లో పాల్గొనగా, అప్పటి ముఖ్యమంత్రి శ్రీ మొరార్జీ దేశాయ్ తనకు బంగారు పతకాన్ని బహుమానించారు, గ్రహించారా? తాను ఎంత గొప్ప కళాకారిణో!

తనకి కర్నాటక సంగీతంతో పాటు హిందుస్థానీ సంగీతంలో కూడా ఎంతో జ్ఞానం ఉన్నది.  అందువలన తాను, ఎన్నో కృతులు హిందుస్థానీ రాగాల్లో స్వపరిచారు

ఆ వరదరాజన్ గారు, ఎందరో మంది దేవతామూర్తులు తన రచనలు కొనసాగించారు. వాటిల్లో, వేంకటేశ్వర స్వామిపై తాను రచించిన, “సప్తగిరీశం సదా భజేహం” అనే కానడ రాగ కృతి, నళినకాంతి రాగంలో “అపర్న పార్వతి” అనే కృతి ఎంతో ప్రఖ్యాతి పొందాయి. తాను శ్రీరంగ రంగనాథుని మీద, శ్రీనివాసుని మీద, లక్ష్మీ పార్వతి సరస్వతి దేవిలపైన కీర్తనలు రచించారు

తాను కృతులే కాకుండా, వర్ణాలను కూడా రచించారు. ఒకటి, శుభపంతువరాళిలో తన వర్ణం, మరొకటి, వాచస్పతి రాగంలో పదవర్ణం.

(అసలు వర్ణం అంట ఏమిటి అని ఆలోచిస్తున్నారా? మీరు అనుకుంటున్నట్టు రంగు కాదండీ! వర్ణమంటే రాగభావ సమన్వితమై మధురసపూరితమై, పాండిత్య ప్రతిభ గల రచన!)

తన రచనలు

కృతి                             రాగం           భాష                    తాళం

  1.     అపర్నపార్వతి            నళినకాంతి         సంస్కృతం          రూపకం
  2.   శ్రీ నరసింహం               శహన                సంస్కృతం          ఖండచాపు
  3.   అమృతపానమే             సారంగ               తెలుగు              ఆది
  4.   మురుగవా                   కాంభోజి             తమిళ్               ఆది

 

(16 ఏ్రపిల్ 2022)

Written by tharuni

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ఆపాత మధురాలు- Part2

అభ్యుదయ కవయిత్రిగా డాక్టర్ నీలం స్వాతి