హిందువులు అత్యంత ఇష్టంగా జరుపుకునే పండగ ఉగాది. ‘ఉగ’ అంటే నక్షత్రగమనం, ‘ఆది’ అంటే మొదలు అని అర్థం. అంటే సృష్టిలో నక్షత్రగమనం మొదలైన రోజు ఉగాది.
చైత్ర శుద్ధ పాడ్యమినాడే అనగా ఉగాది రోజునే బ్రహ్మ సృష్టిని ప్రారంభించాడని పురాణాలు చెప్తున్నాయి.
శ్రీ మహావిష్ణువు మత్స్యావతారాన్ని ధరించి, సోమకుడుని సంహరించి, వేదాలను రక్షించి, బ్రహ్మకు అప్పగించిన రోజు ఉగాది.
యుగమునకు ‘ఆది’ యుగాది – యుగము అంటే 2 లేదా జంట అని అర్థం.
ఉత్తరాయణం, దక్షణాయనం కలిపి ఒక యుగము అనగా ఒక సంవత్సరం అని అర్థం.
మన కాలగమనంలో గల 60 సంవత్సరాలలో ఈ ఉగాది శోభకృత్ నామ సంవత్సరముగా మొదలవుతుంది. శోభకృత్ అనగా శోభను కలిగించేది అని అర్థం. ఈ శోభకృత్ నామ సంవత్సరం అందరి జీవితాల్లో శోభను నింపాలని ఆకాంక్షిద్దాం.