మహిళలు మహరాణులు అంటారు. విద్య వైద్య వైజ్ఞానిక రంగాలలో నే కాదు కళారంగాలలో ఎందరో కీర్తిని సంపాదించి భావి తరాలకు ఆదర్శనీయులైనవారున్నారు. ఏ రంగం లో ఉన్నా తమదైన ముద్ర వేసిన మహిళలు మనకు మార్గదర్శులు.
అల్కా యాగ్నిక్ బాలీవుడ్ లో పరిచయం అవసరం లేని మహిళా నేపథ్య గాయని. గుజరాతీ హైందవ కుటుంబంలో 1966,మార్చి 20 న పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలోని కలకత్తా నగరంలో జన్మించారు .వీరి తల్లిగారైన శుభయాగ్నిక్ భారత శాస్త్రీయ సంగీత గాయని. అల్కా యాగ్నిక్ 6 సంవత్సరముల వయసులో ఉండగా కలకత్తా నగరంలోని ఆకాశవాణిలో పాటలు పాడడం ప్రారంభించారు. అల్కా 10 సంవత్సరముల వయసులో ఉండగా వీరి తల్లి వీరిని బాల గాయనిగా ముంబై నగరానికి తీసుకెళ్లారు. వీరి గాత్రం పరిణతి చెందే వరకు కాస్త వేచి ఉండాల్సిందిగా అనుభవజ్ఞులైన సంగీత స్వరకర్తలు సూచించారు. కానీ వీరి తల్లిగారు చాలా పట్టుదలతో ప్రయత్నాలు కొనసాగించారట. సుప్రసిద్ధ నటులైన రాజ్ కపూర్ గారు ఈ అమ్మాయి తెలివితేటల గురించి తెలుసుకొని, ప్రఖ్యాత సంగీత దర్శకులైన లక్ష్మీకాంత్ ప్యారేలాల్ వద్దకు పంపగా, వారు చాలా ముచ్చటపడి అల్కా కు రెండు ప్రత్యామ్నాయలను సూచించిరి. మొదటిది డబ్బింగ్ ఆర్టిస్ట్ గా తక్షణం కెరీర్ మొదలుపెట్టడం, రెండవది కాస్త సమయం తీసుకుని గాయనిగా కొనసాగడం అని. వీరి తల్లి రెండవ దాని వైపే మొగ్గు చూపారు. 1989 సంవత్సరంలో షిల్లాంగ్ కు చెందిన వ్యాపారవేత్త నీరజ్ కపూర్ తో కుటుంబ సభ్యులు, అతి కొద్ది మంది స్నేహితుల సమక్షంలో వీరి వివాహం చాలా నిరాడంబరంగా జరిగింది. వీరికి ఒక కుమార్తె జన్మించింది.
అల్కా యాగ్నిక్ ఉత్తమ మహిళా నేపథ్య గాయనిగా 7 సార్లు ఫిలింఫేర్ అవార్డును కైవసం చేసుకున్నారు.1000 కి పైగా భారతీయ చిత్రాలకు నేపద్య గానం చేశారు. వివిధ భారతీయ భాషలలో కొన్నివేలకు పైగా పాటలు పాడారు. ఆశాభోంస్లే,లతా మంగేష్కర్,మహమ్మద్ రఫీ,కిషోర్ కుమార్ ల తదుపరి బాలీవుడ్ లో అత్యున్నత గాయకులలో ఐదవ స్థానం లో నిలిచారు. బాలీవుడ్ లో అత్యధిక సంఖ్యలో మహిళా సోలో గీతాలను పాడిన లతామంగేష్కర్, ఆశాభోంస్లే ల తర్వాత మూడవ అగ్రశ్రేణి మహిళా నేపథ్య గాయని గా స్థానాన్ని ఆక్రమించారు. వీరు ఉర్దూ – హిందీ లలోనే కాకుండా గుజరాతీ, ఒడియా, అస్సామీ, రాజస్థానీ,బెంగాలీ,భోజపురి, పంజాబీ, మరాఠీ,తెలుగు,తమిళం, ఇంగ్లీషు,మలయాళ భాషల్లో కూడా పాడారు. 1980లో ‘పాయల్ కి ఝంకార్’ అనే చిత్రంతో నేపథ్య గాయనిగా ప్రస్థానం ప్రారంభించారు. 1981లో ‘లావారిస్’ చిత్రంలోని ‘ మేరే అంగానే మే’, 1982 లో ‘హమారీ బహు అల్క’ అనే చిత్రం లో పాటలు పాడారు. 1988 లో ‘తేజాబ్’ చిత్రంలోని ‘ఏక్ దో తీన్’ పాట అత్యంత ప్రజాదరణ పొంది ఆమెకు అత్యున్నత మహిళ నేపథ్యగాయని అవార్డును అందించింది . 2000 నుండి 2002 సంవత్సరం వరకు వరుసగా 3 సార్లు ఉత్తమ మహిళా నేపథ్య గాయని అవార్డు అందుకున్నారు. లక్ష్మీకాంత్ ప్యారేలాల్ వీరితో కూలీ , తేజాబ్, హమ్, ఖల్నాయక్ , ఖుదాగవా అగ్నిపథ్ , రాజ్ కుమార్ మున్నగు చిత్రాలలో గీతాలను పాడించారు.
నేపథ్య గాయనిగా ఏడుసార్లు ఫిలింఫేర్ అవార్డు అందుకున్నారు. అత్యుత్తమ మహిళా నేపథ్య గాయనిగా మూడుసార్లు ఫిలింఫేర్ అవార్డు అందుకున్నారు. జాతీయ చలనచిత్ర అవార్డులు:- 1993 వ సంవత్సరంలో గీత రచయిత సమీర్ రచించి నదీమ్ – శ్రవణ్ స్వరపరిచిన ‘హమ్ హై రహీ ప్యార్ కే ‘ అనే చిత్రంలోని ‘ఘుం ఘట్ కీ ఆద్ సే ‘ అనే పాటతో మరియు 1998 సంవత్సరంలో సమీర్ రచించి, జతిన్ – లలిత్ స్వరపరిచిన ‘ కుచ్ కుచ్ హోతా హై’ చిత్రంలోని టైటిల్ సాంగ్ తో మరోసారి జాతీయ చలనచిత్ర అవార్డును అందుకున్నారు. లతా మంగేష్కర్ అవార్డు:- 2013 సంవత్సరంలో భారతీయ సంగీతానికి అత్యుత్తమ సహకారం అందించినందుకు గాను లతా మంగేష్కర్ అవార్డును అందుకున్నారు. గ్లోబల్ ఇండియన్ ఫిల్మ్ అవార్డ్స్:- 2007 లో జావేద్ అక్తార్ రచించి శంకర్- యహేసాన్ – లాయ్ స్వరపరిచిన ‘కభీ అల్విదా నా కహనా ‘ అనే చిత్రంలోని టైటిల్ సాంగ్ తో అవార్డును అందుకున్నారు. జీ సినీ అవార్డులు :- 1999 వ సంవత్సరంలో గీత రచయిత సమీర్ రచించి జతిన్- లలిత్ స్వరపరిచిన ‘కుచ్ కుచ్ హోతా హై ‘చిత్రంలోని టైటిల్ సాంగ్ తో, 2001వ సంవత్సరంలో ఇబ్రహీం అష్క్ రచించి రాజేష్ రోషన్ స్వరపరిచిన ‘కహో నా ప్యార్ హై ‘ అనే చిత్రంలోని టైటిల్ సాంగ్ తో, 2007 లో జావేద్ అక్తర్ రచించి శంకర్ -ఎహసాన్ – లాయ్ స్వరపరిచిన ‘ కభీ అల్విదా నా కహనా’ చిత్రంలోని ‘తుమిహి దేఖో నా’ , 2020 లో జి సినీ స్పెషల్ అచీవర్స్ అవార్డ్ . బాలీవుడ్ మూవీ అవార్డులు :- 2002వ సంవత్సరంలో గుల్జార్ రచించి అనుమాలిక్ స్వరపరిచిన ‘అశోక ‘ చిత్రంలోని శాన్ సాన్ సనా అనే గీతంతో, 2007వ సంవత్సరంలో జావేద్ అక్తర్ రచించి శంకర్ – ఎహసాన్ లాయ్ స్వరపరిచి న ‘కభీ అల్విదా న కేహనా’ అనే చిత్రంలోని ‘తుం హీ దేకోన’ అనే పాటతో,1999వ సంవత్సరంలో సమీర్ రచించి జతిన్ – లలిత్ స్వరపరిచిన ‘కుచ్ కుచ్ హోతా హై’ అనే చిత్రంలోని టైటిల్ సాంగ్ తో మరియు 2001వ సంవత్సరంలో ఇబ్రహీం అష్క్ రచించి రాజేష్ రోషన్ స్వరపరిచిన ‘కహో నా ప్యార్ హై ‘అనే చిత్రంలోని టైటిల్ సాంగ్ తో అవార్డులు సాధించినచారు.
స్క్రీన్ అవార్డ్ లు :-1996వ సంవత్సరంలో గీత రచయిత సమీర్ రచించి దిలీప్సేన్ సమీర్ స్వరపరిచిన ‘హాకీకత్ ‘చిత్రంలోని ‘దిల్ నే దిల్ సే ఎకరార్ కియా’ మరియు 2001వ సంవత్సరంలో జావేద్ అక్తర్ రచించి అనుమాలిక్ స్వరపరిచిన ‘శరణార్థ ‘చిత్రంలోని ‘పంచీ నదియన్ ‘అనే పాటతో మరియు 2002లో సమీర్ రచించి నదీమ్ – శ్రవణ్ స్వరపరిచిన ‘కుసుర్ ‘చిత్రాల్లోని ‘కిత్నీ బే చైన్ హో కే ‘అనే గీతంతో మరియు 2005 వ సంవత్సరంలో 20 సంవత్సరం నుండి భారతీయ సంగీతానికి విశేష కృషి చేసినందుకు ప్రత్యేక అవార్డు అందుకున్నారు.
ఇంటర్నేషనల్ ఇండియన్ ఫిల్మ్ అకాడమీ అవార్డులు :-2000 సంవత్సరంలో ఆనంద్ బక్షి రచించి ఏఆర్ రెహమాన్ స్వరపరిచిన ‘తాల్’ సినిమాలోని ‘తాల్ సే తాల్ మిలా’ అనే పాటతో మరియు 2001 వ సంవత్సరంలో ఇబ్రహీం అష్క రచించి రాజేష్ రోషన్ స్వరపరిచిన ‘కహో నా ప్యార్ హై’ చిత్రంలోని టైటిల్ సాంగ్ తో మరోసారి ఈ అవార్డును కైవసం చేసుకున్నారు. బెంగాల్ ఫిలిం జర్నలిస్ట్ అవార్డులు :- 1989 సంవత్సరంలో ఖయామత్ సే ఖయామత్ తక్ అనే పాటతో మరియు 2007వ సంవత్సరంలో ప్రత్యేక అవార్డు సాధించారు. సాన్సుయి అవార్డులు :- 1999వ సంవత్సరంలో సమీర్ రచించి జతిన్ – లలిత్ స్వరపరిచిన ‘కుచ్ కుచ్ హోతా హై ‘ చిత్రంలోని టైటిల్ సాంగ్ తో మరియు 2004లో సమీర్ రచించి హిమేష్ రేష్మియా స్వరపరిచిన తేరే నామ్ చిత్రంలోని ఊడ్ని అనే గీతంతో అవార్డును సొంతం చేసుకున్నారు.
ఫిలింఫేర్ అవార్డులు :-1988వ సంవత్సరంలో జావేద్అక్తర్ రచించి లక్ష్మీకాంత్ ప్యారేలాల్ స్వరపరిచిన తేజాబ్ చిత్రంలోని ‘ఏక్ దో తీన్’ పాటతో, 1993వ సంవత్సరంలో ఆనంద్ బక్షి రచించి లక్ష్మీకాంత్ ప్యారేలాల్ స్వరపరిచిన ఖల్నాయక్ చిత్రాల్లోని ‘చోళీ కే పీచే క్యా హై’ పాటతో, 1998వ సంవత్సరంలో ఆనంద బక్షి రచించి నదీమ్ – శ్రవణ్ స్వరపరిచిన పరదేశి చిత్రంలోని ‘మేరీ మెహబూబా’ పాటతో, 2000 సంవత్సరంలో ఆనంద్ బక్షి రచించి ఏఆర్ రెహమాన్ స్వరపరిచిన తాల్ చిత్రంలోని ‘తాలసే తాల్ మీలా’ అనే పాటతో, 2001 వ సంవత్సరంలో సమీర్ రచించి నదిమ్ – శ్రవణ్ స్వరపరిచిన ధడకన్ చిత్రంలోని ‘దిల్ నే ఏ కహా హై దిల్సే అనే పాటతో, జావేద అక్తర్ రచించి ఏఆర్ రెహమాన్ స్వరపరిచిన లగాన్ చిత్రంలోని ‘ఓరే చోరీ ‘అనే గీతంతో 2005వ సంవత్సరంలో ప్రసూన్ జోషి రచించి జతిన్ – లలిత్ స్వరపరిచిన హమ్ తుమ్ చిత్రంలోని టైటిల్ సాంగ్ తో మొత్తం 7 సార్లు ఫిలింఫేర్ అవార్డుని సొంతం చేసుకున్నారు.
మిర్చి మ్యూజిక్ అవార్డు :-2015 వ సంవత్సరంలో తమాషా చిత్రంలోని అగర్ తుమ్ సాత్ హో అనే పాటతో అవార్డు అందుకున్నారు.
బిబిసి వరల్డ్ మ్యూజిక్ అవార్డు:- 2003 లో అందుకున్నారు.
అప్సర అవార్డు :- 2004లో సమీర్ రచించి హిమేష్ రేష్మియా స్వరపరిచిన తేరే నామ్ అనే చిత్రంలోని ఊదుని పాటతో అవార్డు అందుకున్నారు . ఈమె అత్యంత సమర్థవంతమైన మహిళా నేపద్యగాయని. బాలీవుడ్ కెరీర్లో పెద్ద సంఖ్యలో మహిళా సోలోలను పాడారు. నాలుగు దశాబ్దాల పాటు సాగిన కేరీర్లో వెయ్యికి పైగా చిత్రాలకు పాటలు పాడారు మరియు వివిధ భారతీయ భాషలలో 20వేలకు పైగా పాటలు రికార్డు చేశారు. ఆమె యొక్క 20 ట్రాక్లు బీబీసీ యొక్క ఆల్ టైం టాప్ 40 బాలీవుడ్ సౌండ్ ట్రాకుల జాబితాలో ఉన్నాయి. 2022వ సంవత్సరంలో 15.3 బిలియన్ యూట్యూబ్ వీక్షణలతో గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ సాధించింది. అల్కా యాగ్నిక్ “ప్లే బాక్ సింగింగ్ క్వీన్ ” గా గుర్తింపు పొందింది. టైమ్స్ ఆఫ్ ఇండియా ఆమెను “తేనె స్వరం గల గాయని ” గా పేర్కొంది. హిందుస్థాన్ టైమ్స్ ఆమెను “మ్యాజికల్ వాయిస్” గా అభినందించింది. మిడ్ డే ఆమెను 90 ల నాటి ప్రముఖ నేపద్య గాయకుల జాబితాలో చేర్చింది. పాడటమే కాకుండా ఆమె టీవీలో అనేక సింగింగ్ రియాలిటీ షోలకు న్యాయ నిర్ణేతగా కూడా వ్యవహరించారు. బాలిక సాధికారతకు సంబంధించిన పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు.2014 మే 25వ తేదీన’ కామెడీ నైట్స్ విత్ కపిల్’ అనే ప్రముఖ టీవీ షోలో కుమార్ సానుతో కలిసి ప్రత్యేక అతిథిగా విచ్చేశారు.2014లో శిశు సంరక్షణ అవగాహనపై సోనూనిగంతో కలిసి ‘ఫూల్ కిల్ జాయేంగే ‘ అనే గీతాన్ని ఆలపించారు. మహిళా దినోత్సవ సందర్భంగా “మైనే లీ జో అంగడాయి “అనే పాటను పాడారు. 1992వ సంవత్సరంలో సప్నే సాజన్ కి అనే చిత్రంలో సహగాయకుడు కుమార్ సాను తో కలిసి ‘ఏ దువా హాయ్ మేరి’ పాటలో కనిపించారు. 2006వ సంవత్సరంలో సరిగమప లిటిల్ చామ్స్ లో ఆమె తన మొదటి టీవీ షో తో ఆరంగ్రేటం చేశారు. స్టార్ వాయిస్ ఆఫ్ ఇండియా లో న్యాయ నిర్ణతే గా కూడా కనిపించారు.
ప్రముఖ సంగీత దర్శకుల సహకారాలు :- నదీమ్ – శ్రవణ్ సాజన్ 1991, పూల్ ఔర్ కాటే 1991, దీవానా 1992, రంగ్ 1993, దిల్వాలే 1994,
వంటివి ప్రముఖ పేర్లు మనసు తెరపై నడయాడుతాయి.
జతిన్ – లలిత్ హిందీ సినిమా రంగ విశేషాలను తెలియజేస్తూ రాయాలి అంటే ఈ పేర్లు తిరుగాడుతుతుంటాయి. కీలాడి, రాజు బన్గయా జెంటిల్మెన్, గులాం, ఖామూషి, సరఫరోష్, ఎస్ బాస్, కుచ్ కుచ్ హోతాహై , దిల్ క్యా కరే, కభీ ఖుషి కభీ ఘం,
అనుమాలిక్ పాటలు యువతను ఉర్రూతలూగించిన వి. బాజీగర్, ఫిర్ తేరి కహాని యాద్ ఆయే, జోష్, ఇష్క్ వి ష్క్
సుప్రసిద్ధ సినీ దిగ్గజం ఏ ఆర్ రెహమాన్ :- తాల్ , లగాన్, జుబేదా, ద లెజెండ్ ఆఫ్ భగత్ సింగ్, స్వదేశీ, యువరాజ్, ఆదా, స్లమ్డాగ్ మిలియనేర్,తమాషా, రాజేష్ వంటివెన్నో కీర్తి సంపాదించిన వి.
రోషన్ :- కాంచోర్ , కరణ్ అర్జున్ , సబ్సే బడా కిలాడి, కోయ్ ల, పాపా కహతే హై, కహో నా ప్యార్ హై , కోయి మిల్ గయా, అప్ ముజే అచ్చే లగ్నే లగే, క్రిష్, ఆనంద్ –
మిళింద్ :- కొన్ని పాటలు అలా నిలిచిపోయిన పాటలున్నాయి.ఖయామత్ సే ఖయామత్ తక్ ,లాడ్ లా, గోపి కిషన్, సుహాగ్, ఆజ్ కా గూండారాజ్, కూలి నెంబర్ వన్, ఆర్మీ, లుటేరే ,లోఫర్, మిస్టర్ బేచారా , జాన్, రక్షక్, అజయ్, హీరో నంబర్ వన్,.
హిమేష్ రేష్మియా :- చురాలియా హై తుమ్నే, తేరే నామ్,, బర్దాష్ వంటివీ మంచి పేరును తెచ్చిపెట్టాయి.
శంకర్ – ఎహసాన్ -లాయ్:- సినీ జగత్తులో ఒక హల్ చల్ చేసిన పాటలు దిల్ చాహతా హై, మిషన్ కాశ్మీర్,,అర్మాన్, లక్ష్య, కభీ అల్విదా నా కహనా, వంటి ప్రముఖ చిత్రాలలో ఇందరితో కలిసి పని చేశారు.
సంగీతమంటే ఇష్టం , పాటలు పాడడం లో కనబరిచి శ్రద్ధ , సమయపాలన , పెద్దలంటే గౌరవమూ, సాహిత్యం పైన కూడా ఆసక్తి కనబరచడమూ ఇవన్నీ అల్కా యాజ్ఞక్ లో చూస్తాం.అత్యంత విజయవంతంగా సాగిన వీరి సినీ ప్రస్థానం వర్తమాన గాయకులందరికో స్ఫూర్తిదాయకం.