అదొక ఊహా లోకం
అక్కడేమో మనసు మబ్బుల్లో
మహదానందంగా తేలిపోతుంది
ఎన్నో వర్ణాలు పసిపిల్లలవుతాయి
కుందేలు తెలివి లా శూన్యాన్ని బొమ్మలు గా చేస్తుంటాయి
కుంచె ఊయలపై ఊగినట్టు
అనేకానేక కారణాలు
అందంగా విరబూస్తుంటాయి
చుట్టూ మూగిన ఆలోచనలు ఒక్కసారి గా పారిపోయి
విరిసిన ఊదారంగు పూవులో
ముసి నవ్వులు నవ్వుతాయి
షేడ్స్ మస్ట్ బి క్రేజీ
నలుపు తెలుపు మేళవింపు లలో
కాన్వాస్ పైనే కాదు
తోటి తోటంతా ఊదారంగు పూలమయం
చిత్ర కవిత రచన _ డాక్టర్
కొండపల్లి నీహారిణి, తరుణి సంపాదకురాలు.