తరుణి పాఠకులకు అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు! సమానత్వం కోసం స్త్రీ లు ఏకమై
ఎన్నో ఏళ్లుగా పోరాటాలు చేసి హక్కులను సాధించారు. మనను ఒక్క త్రాటిపైకి తెచ్చారు. సమస్యల వలయాలు పోవాలంటే ఏంచేయాలి అనే ఆలోచన ప్రతి మహిళ మెదడు లో వస్తే , పూనుకొని పోరాటాలు చేయగలరు. లేదూ ఉద్యమాలు చేసేవాళ్లకు మద్దతునైనా ఇవ్వాలి.
ముఖ్యంగా ఈ చట్టాలు న్యాయాలు తెలియని ఎంతోమంది ఆడవాళ్ళన్నారు వాళ్ళ కు అండగా నిలబడాలి .
ఎక్కడైనా ఎవరైనా ఒక మహిళ కు గానీ మహిళా సమాజానికి గానీ కీడు తలపెడ్తున్నట్టు ఏం విధమైన అనుమానం వచ్చినా వెంటనే చట్టాన్ని ఆశ్రయించి తనకు , తన వర్గానికి సమయం కేటాయించి మేలు జరిగే లా చూడాలి.
చిన్న చిన్న విషయాలకే స్పందన తెలుపాలి. తప్పదు ! మనసు గోడలకు ఏదో కొంత ధైర్య వచనాల సాంత్వన చేకూరుతుంది.
తరుణి పత్రిక కోసం రచనలు పంపుతున్న కవయిత్రులు, రచయిత్రులందరికీ పాఠకులందరికీ అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు