నీవు అబలవు కావు సబలవు సృష్టికర్తకు మరో రూపం నీవు
ఓర్పుకు నేర్పుకు ఓదార్పుకు నీకు నీవే సాటి.
అమ్మగా, ఆలిగా, అక్కగా, చెల్లిగా, అత్తగా, పిన్నిగా, వదినగా మరదలుగా, బామ్మగా, అమ్మమ్మగా ఎన్నెన్ని అవతారాలు, ఎన్నెన్ని బంధాలు. బీజ రూపంలో ఉండి మహావృక్షాన్నివై వ్యాపించావు. కానీ నీవు సిగ్గు లజ్జా కల లావణ్యమూర్తి. పుష్ప సదృశ్యవి. నేడు విద్యావతివై గడప దాటి బయటకు వస్తే, మానవత్వం మంటగలిసిన ఈ రోజులలో నీ నడత,నడక మారాలి. త్రేతాయుగపు సీతవుకావు, ద్వాపర యుగపు ద్రౌపతిది కావు. కలియుగపు అపర కాళికవి. మడమ తిప్పక ముందంజ వేయిఅన్ని రంగాలలో . ఇదే మా జోహార్లు నీకు.