ఈ సమాజంలో ప్రతి ఒక్కరికి సమస్యలు ఉన్నాయి. అయితే ఆడవాళ్లకు సమస్యలు అధికం.ఈ సమస్యలు పోగొట్టడానికి హక్కులను పొందడానికి అస్తిత్వం నిలబెట్టుకోవడానికి ఒకప్పుడు పశ్చిమ దేశాలలో ఉద్యమాలు జరిగాయి. మనదేశంలో ఈ ఉద్యమాలు ఇంకా జరగాల్సిన అవసరం ఉంది . ఎందుకంటే అంత ఎక్కువ అవసరం ఉన్నది ఇక్కడ. ఈ ఉద్యమాల సభా వేదికలలో సభా ప్రాంగణాలలో స్త్రీలు ఎక్కువగా ఉంటున్నారు కానీ పురుషులు కనిపించడం లేదు. ఉదాహరణకు రాజకీయ విషయాలు తీసుకున్న సామాజిక విషయాలు తీసుకున్న ఆడవాళ్ల కు తక్కువ అవకాశాలు ఇస్తున్నారు. స్త్రీల అభ్యున్నతి కోసం సభలు నిర్వహించాలి కానీ ఇది ఏదీ కనిపించదు ఆడవాళ్ళ పరిస్థితి ఎక్కడి గొంగడి అక్కడే అన్నట్టు ఉన్నది. అసలు క్రియాశీలక రాజకీయాలలో ఆడవాళ్లు ఎంతమంది ఉన్నారు? జనాభా ప్రాతిపదికన అసలే లేదు.ఇది ఆలోచించాల్సిన విషయం. స్త్రీలు ముందుకు వెళ్లాలి లేకుంటే ఇంకా అణచివేతలు చేస్తూనే ఉంటారు కాబట్టి, స్త్రీలు తమదైన పాత్ర నిర్వహిస్తూనే ఉండాలి.
ఆడవాళ్లు వాళ్ళ సమస్యలను ధైర్యంగా చెబుతున్నారు. కానీ పరిష్కారాలే దొరకడం లేదు.
ఇప్పటి సమాజంలో ఆడంబరాలు ఎక్కువయ్యాయి. ఈ ఆడంబరాల లో స్త్రీ పాత్రను ఎక్కువగా కనిపిస్తున్నది ఇది నాకు అసలే నచ్చడం లేదు.పెళ్ళిళ్ళు ఐదేసి రోజులు చేస్తున్నారు.అలంకరణలలోనే మునిగిపోతున్నారు.ఇది పోవాలంటే మళ్ళీ ఆడవాళ్ళే ముందుకురావాలి.మనలో ఉన్న తప్పులను మనమే కనిపెట్టాలి.మనవాళ్ళ కోసం ఏం చేస్తే బాగుంటుంది అనేది ఆలోచించాలి,ఆచరణచేయాలి.తల్లిగా , అక్కగా, చెల్లెలు గా , ఇంట్లోని వ్యక్తి గా ఆడవాళ్లే సరిదిద్దాలి.దేనిద్వారా ఎట్లాంటి ఇబ్బందులు కలుగుతాయి అనే వాటిని ఆడవాళ్లే ఎట్లా చూస్తున్నదీ ,మగవాళ్ళు ఎట్లా ఆలోచిస్తున్నదీ పసిగట్టి సరిదిద్దుకునే లా చేయాలి.