ఇనుప పాదాల కర్కస కబంధహస్తాలలో,
జీవితాంతం స్త్రీ అనుభవించిన వేదన.
సంఘం ఇనుప ఊచల వెనక
ఆమె నర నరాల్లో పెల్లుబికిన ఆవేదన.
పురుష ప్రపంచ దౌర్జన్యంతో
బలికి ఆహుతయిపోతున్న
మహిళ ఆత్మఘోష! బాల్యం నాడే భయం భయంగా
అమ్మానాన్నల ఒడిలో
ఓనమాలు దిద్దుకొని ఆడవాళ్ళ మీద,
అమాయకత్వపు అందం మీద,
ఆట పాటలు గడపాల్సిన వయసులో
ఆటో డ్రైవర్ల అంకుల్ వడిలో
ఒదిగిపోయిన పసిపిల్ల.
ఎక్కడెక్కడో కర్కశ హస్తాలు రాపిడి తెలుసుకోలేని బాల్యం.
పాఠాలు నేర్పే బడిపంతులు దగ్గరకు తీసుకుని బుజ్జగించే వైనం.
అభం శుభం తెలియని ఆ పిల్లకి ఏం తెలుసు.
కామంతో తడిమే శరీరంపై తమాషా చూస్తున్న పసితనం.
అప్పుడే రెక్కలు వస్తున్నా పక్షికూనకు ఒక్కసారి కొత్తదనం పూసుకున్న ప్రేమ లేపనం.
యవ్వనం పూర్తిగా రూపుదిద్దుకొనేసరికి ఆమె సౌందర్యాన్ని,
సర్వాసం దోచుకున్న కాలేజీ ప్రాంగణం.
బ్లాక్ బోర్డ్ పై గీసిన ఎన్ని నగ్న దృశ్యాలు చూసి
గుండెలు చేత్తో పట్టుకొని
భయంతో పరుగులు తీసిన
కళాశాల ప్రాంగణం ఉలిక్కిపడిన రోజులు.
అడవి మృగాల మధ్య
నిత్యం నిలువునా కాలే చూపులతో
మహిళలు నిలువునా దగ్ధమైపోతుంటే,
భరతావని సిగ్గుతో తలవంచుకుంటున్నది.
మృగాలను వేటాడటమే ధీటైన సమాధానం.
ఆనాడే అసలైన మహిళా దినోత్సవం.
నా కవిత అశీర్షిక అసలైన మహిళా దినోత్సవం.
(మార్చి 8వ తేదీ మహిళాభ్యుదయం దినోత్సవ సందర్భంగా కవిత)