అమ్మ కొంగులో
దాక్కొని చనుపాలు
తాగుతున్న నాకు
ఈ లోకం అంతా కూడా
ఏదో ముసుగు వేసుకుని
పాలని తాగాలని చూస్తున్నారు
కానీ,
వాళ్ళకి తెలియదేమో
చనుపాలకి ,
డబ్బాపాలకి
మధ్య అంతరం –
అందుకే
డబ్బా పాల కోసం
కొట్టుకు చస్తుండ్రు
అవే డబ్బు పాలు
డబ్బా పాలు
ఆప్యాయత
ప్రేమానురాగాలు
కలిగిన చనుపాలని
మరచిన లోకం
డబ్బా గా తయారైంది.