తరుణి – న్యాయ సలహాలు

తరుణి పాఠకులందరికీ నమస్కారం!
తురుణి పత్రిక ప్రారంభించి సంవత్సరం పైనే గడిచింది. ప్రారంభంలో పాఠకులు పరిచయం కావాలని ప్రతి రోజు కొన్ని ఆర్టికల్స్ ని పెడుతూ వచ్చేదాన్ని. కవయిత్రులు, రచయిత్రులు, కళాకారులు తరుణి పత్రికకు పరిచయం అయ్యాక, నేను ముందు నిర్ణయించుకున్నట్టుగా దినపత్రిక నుంచి వారపత్రికకు మార్చుకున్నాను. ఇదంతా బాగానే ఉంది. లబ్ద ప్రతిష్టులైన రచయితలు వర్ధమానకవయిత్రులు తరుణి ద్వారా పాఠకులకు పరిచయమయ్యారు. రచనలు ఎక్కువై అంటే లోడ్ ఎక్కువై వెబ్సైట్ తిరుగుతూ ఉండేది , సరిగ్గా ఓపెన్ కాకపోయేది !ప్రారంభంలో నేను తీసుకున్న వెబ్సైటు డిజైన్ ఎలాంటిదో సాంకేతిక విజ్ఞానం తెలియదు.సాంకేతికంగా ఇతరులపై ఆధారపడి చేస్తున్నాను. మళ్లీ వెబ్సైట్ డిజైన్ అంత చేంజ్ చేయించి ఇప్పుడు వస్తున్న విధంగా ఒక క్యాలెండర్ ఒక పద్ధతిగా చేయడానికి మళ్లీ కసరత్తు చేయాల్సి వచ్చింది. అప్పుడు ప్రారంభంలో వచ్చిన ఆర్టికల్స్ ఏవి ఇప్పుడు కనిపించడం లేదు కాబట్టి ఆ ఆర్టికల్స్ అన్ని మళ్ళీ ఇప్పుడు తరుణిలో చేర్చాలని నిర్ణయించుకున్నాను. చక్కని కవితలు, కథలు,ఉషోదయం, తరుణీయం ,ఉషోదయం, న్యాయ సలహాలు, డాక్టర్ సలహాలు అన్నీ కూడా ప్రతివారం కొన్ని కొన్ని పెట్టాలని నిర్ణయించుకున్నాను ఇది పాఠకులు గమనించాలని అభ్యర్థన. చిత్రాలు వాటికి నేను రచించిన చిత్ర కవితలు అన్ని చేరుస్తాను. చూడండి మీ అభిప్రాయాలను తెలియజేయండి.
మీ,
కొండపల్లి నీహారిణి, తరుణి పత్రిక వ్యవస్థాపకురాలు, సంపాదకురాలు.

 

 

డా.వరిగొండ సత్య సురేఖ, వృత్తిరీత్యా న్యాయవాది, ప్రవృత్తిరీత్యా

రచయిత అయిన వీరు విశాఖపట్టణం నివాసి. వీరి కథలు ఆకశవాణి వరంగల్లు మరియు

విశాఖ కేంద్రం ద్వారా ప్రసారం కాబడినవి. పలు ప త్రికల్లో వీరి రచనలు

ప్రచురణయే కాక వివిధ సాహితీ సంస్థల ద్వారా బహుమతులు అందుకున్న వీరు తెలుగు

సాహిత్యం పైగల మక్కువతో వాఙ్మయి అనే యూట్యూబ్ చానెల్ పెట్టి ;నా

కావ్య విశిష్టత అనే కార్యక్రమం ద్వారా పలువురు సాహితీ ప్రముఖులని పరిచయం

చేస్తున్నారు. సామాజిక స్పృహ ,చైతన్యం ప్రధానాంశాలుగా రచనలు సాగించే వీరు

దేశ పౌరులందరికి చట్టముల గురించి చట్ట వ్యవస్థ గురించి అవగాహన ఉండాలి అని

భావిస్తూ తమ పరిధిలో మహిళలలు, యువతీయువకులు మరియు విద్యార్థులకి వారు నేటి

సమాజ ధోరణుల వల్ల యెదుర్కొనే సమస్యల గురించి వాటి కి చట్టపరమైన భద్రత

గురించి అవగాహన కలిగిస్తున్నారు.                                                                                                                                – సంపా.

 

ఆన్ లైన్ షాపింగ్- అవసరమైనజాగ్రత్తలు

                                   వరిగొండ సురేఖ

మా అమ్మగారు మా అబ్బాయికి శతకపద్యాలు నేర్పితే బదులుగా మా అబ్బాయి మా అమ్మగారికి ఆన్-లైన్ షాపింగ్ ఎలా చేయాలో నేర్పుతున్నాడు. వీడు 6వతరగతి విద్యార్థి అయితే ఆవిడ 60 యేళ్ళ వనిత. దీనినిబట్టి నేటికాలంలో ఆన్-లైన్ షాపింగ్ అవసరాన్ని, అది పొందుతున్న ప్రాముఖ్యతని మనం అర్థం చేసుకోవచ్చు.

ఇంట్లోకి కావల్సిన నిత్యావసర సరుకులు మొదలుకొని, ఔషధాలవరకు అన్ని ఆన్-లైన్లో దొరుకుతున్నాయి.  కంప్యుటర్ , ఎ.సి., రిఫ్రిజరేటర్లు వంటి వేలల్లో ధరలుండే వస్తువులు మొదలుకొని, బంగారం, వెండి లాంటి విలువైన ఆభారణలని సైతం కొంటున్నారు ఈ ఎలాక్ట్రానిక్ మార్క్ దుకాణంలో. ఇంట్లోని ఉపకరణాల శుభ్రత మొదలుకొని స్వీయ అలంకరణ వరకు నేడు ఆన్-లైన్లో అందుబాట్లో లేని వస్తువు లేదంటే అతిశయోక్తికాదు.

అయితే మరి నిత్యం అనేక అనువర్తనాలలో(అప్లికేషన్స్), వెబ్సైట్లలో కొనుగోలు చేస్తున్న మన అందరికి ఈ దుకాణంపై గల అవగాహన ఎంత అంటే ఆలోచనలలో పడవల్సిందే. అలా అని సంజీవనిలా సమయానికి ఆదుకుంటూ, అనేక రకాల సౌఖ్యాన్ని, సంతోషాన్ని ఇస్తూ ముఖ్యంగా స్త్రీలకి సమయాన్ని శ్రమని అప్పుడప్పుడు ధనాన్నిఆదా చేస్తున్నఆన్ లైన్ షాపింగ్ లో కొలగలమా అంటే కష్టమనే చెప్పాలి.

ఆన్లైన్లో కొనుగోలులో ముఖ్యమైనవి రెండు విషయాలు. ఒకటి యే ప్లాట్ఫారంలో అనగా ఏ వెబ్సైట్ లేదా ఆప్ లో కొంటున్నాము. రెండు చెల్లింపు యే విధంగా చేస్తున్నాము. బాగా ప్రాచుర్యంలో ఉన్న వెబ్సైట్స్లలో లేదా ఆప్స్లో కొనుగోలు చేసినప్పుడు కొంతమేలు.

అలా కాకుండా యేదొ ఒక లింక్ ద్వారానో లేదా యేదో ఒక ప్రకటనని అనుసరించు కొనేప్పుడు జాగ్రత్త వహించాలి.

ముందుగా యే వెబ్ సైట్ లేదా ఆప్ లో కొంటున్నారో దాని గురించిన సమాచారం కోసం గూగొల్లాంటి సేర్చ్ ఇంజిన్స్లో వెతికి చూడాలి. ఆ సమాచారం ఆధారంగా మనకు కొంతమేర అది యెంతవరకు నమ్మదగిందో తెలిసే అవకాశం ఉంటుంది. అలాగే ఆ వెబ్ చిరునామా http:// https://  లాంటి భద్రతాపరమైన  IP చిరునామాని కలిగిఉందా, లేదా ఊరికినే వెబ్ సైట్ చిరునామా మాత్రమేఉందా గమనించాలి.

ఇక ఆ ఫలానా వెబ్సైట్లో కొనే ముందు ఆ సంస్థయొక్క కార్యాలయ చిరునామా యెక్కడైనా ఇచ్చారేమో చూడాలి. అలాగే సంప్రదింపు చిరునామాగా , “contac us” అనే డబ్బాని ఇచ్చి వదిలేసారా లేదా ఆ సంస్థ కార్యాలయ చిరునామా ఏమైనా ఇచ్చారా చూడాలి

వస్తువు వాపసి మరియు నగదు వాపసి, రిఫండ్ మరియు రిటర్న పాలసీలను జాగ్రత్తగా చదవాలి.  వాపసి కోసం ఇచ్చే MAIL ID లు G-MAIL లాంటివి ఇచ్చారా లేక సంస్థ యొక్క వెబ్చిరునామతో ఇచ్చారా గమనించాలి.

ఉదాహరణకి infoxyz@gmail.com అని ఉందా లేక info@xyz.com అని ఉందా గమనించాలి. అలాగే ఇచ్చిన ఫోనునంబరు టోల్ఫ్రీనంబరా, లాండ్లైను నంబరా లేక మొబైలు నంబరా గమనించుకొవాలి..

ఒకవేళ చరవాణి అయితే వస్తువు కొనుగోలు చేసేముందే ఫోనుచేసి వారి సంస్థ కార్యా లయాలు యెక్కడ యెక్కడా ఉన్నాయో తెలుసుకోవాలి. ఆ సంస్థ పెట్టి యెన్ని సంవత్సరాలు అయింది, ఆ వెబ్సైట్ పెట్టి ఎంతకాలం అయింది , ఏ కొరియరు ద్వారా వస్తువు పంపుతారు, వస్తువు వాపసు చేయాలంటే ఏలా, వస్తువు తిరిగి పొందాక మన డబ్బు మనకు ఏ పద్ధతి ద్వారా జమచేస్తారు ఇత్యాది వివరాలు కనుక్కొవాలి.

అలాగే మీకు తెలిసిన వారితో ముఖ్యంగా ఆన్లైన్ షాపింగ్ అనుభవం ఉన్న వారితో కానిసైబెర్ నిపుణులు లేదా ఉద్యోగస్తులు కాని మీ పరిచయంలో ఉంటే ఫలాన వెబ్సైట్ యొక్క ప్రామాణికతను గురించి తెలుసుకునే ప్రయత్నం చేయాలి.

అయినప్పటికి వస్తువు కొనదలుచుకున్నట్లైతే , ముందుగా అతి తక్కువ ధరగల వస్తువులని ఒకటి రెండుసార్లు కొని చూడాలి. అంతగా అవగాహన లేని వెబ్సైట్లలో కొనెటప్పుడు యెప్పుడు కూడా చెల్లింపు నగదు ద్వారానే చేయాలి.

వస్తువుని పొందిన తరువాత, దానికి సంబంధించిన రసీదుని, ఆ ప్యాకేజిపైగల చిరునామా , ఫోనునంబరు ఇత్యాది వివరాలు అన్నిసరిగ్గా ఉన్నయో లేదో చూడాలి. మోసపూరిత సైట్లు తమ చిరునామాని ముద్రించరు. ఒకవేళ చిరునామా ఉన్నా కూడా దాని నిజనిర్ధారణ అవసరమే

వస్తువుపొందాకా వాటి నాణ్యతని చూడాలి. కొన్ని మోసపూరితమైన వెబ్సైట్లో మొదటిసారి కొనే వినియోగదారులు లేదా తక్కువ ధరగల వస్తువులని కొన్నప్పుడు వస్తువులను సరిగ్గానే పంపుతాయి , కాని యెపుడైతే వినియోగ దారుడు నమ్మి యెక్కువ పైకం చెల్లించి వస్తువుకొంటాడో అప్పుడు అసలు మోసం బయటపడుటుంది.

ఇక చెల్లింపు విషయానికి వస్తేముందు పేర్కొనినట్లు అతి తక్కువ ధర గల వస్తువుని కొని, నగదు ద్వారానే పైకం చెల్లించాలి. డిజిటల్ చెల్లింపుల ద్వారా మన సమాచారం వారు తెలుసుకునే అవకాశం కలుగుతుంది. సాధ్యమైనంతమేరా ఎలక్ట్రానిక్ చెల్లింపులకు దూరంగా ఉంటేనే మేలు.

యెన్ని జాగ్రత్తలు తీసుకున్నఒక్కోసారి మోసపోవడం జరుగుతూనే ఉంటుంది. అలాంటప్పుడు దిగులుపడకుండా సమీప సైబెర్సెల్ల్లో మరియు జాతీయ సైబెర్నేర నిరోధక సంస్థలో ఫిర్యాదున మోదుచెయ్యాలి. 1930 అనే నంబరుకి ఫోనుచేసి కూడా ఫిర్యాదు ఇవ్వవచ్చు.

వస్తువు కొనుగులు చేసినప్పుడు తత్సంబంధ స్క్రీన్ షాట్, మరియు వస్తువు పొందినప్పుడు దాని పైగల రసీదు మరియు ఇతరత్రా వివరాలని ఫోటోలు తీసి జాగ్రత్త పరుచుకొని ఫిర్యాదు అప్పుడు https://cybercrime.gov.in/ వెబ్ పోర్టల్లో అప్లయి చేయవలసి ఉంటుంది.

ఏది ఏమైనప్పటికి సైబర్ మోసాల నేపథ్యంలో జాగ్రత్తే మనల్నిఎక్కువకాపాడుతుంది. కొనేచోటు తెలుసుకొని కొంటే యెప్పుడైనా మేలే కదా.!!!

Written by Varigonda Surekha

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ఉషోదయం

అమ్మ కొంగు