మన మహిళామణులు

సుప్రసిద్ధ కథా, నవలా రచయిత్రి, కవయిత్రి కాలమిస్ట్ శ్రీమతి అల్లూరి గౌరీలక్ష్మి

గోదావరి నదీపాయల మధ్య కోనసీమలో అంతర్వేది సముద్రానికి దగ్గరగా ఉండే అంతర్వేది పాలెం గ్రామంలో జన్మించి కొబ్బరి, మావిడి తోటల మధ్య నేస్తాలతో కోతి కొమ్మచ్చి ఆడుతూ, కాలవలో ఈతలు కొట్టిన గౌరి గారికి ప్రకృతి అంటే గొప్ప ఆరాధన. మానవ జీవితంలో చివరికి మిగిలేవి రెండే అవి స్నేహం, ప్రేమ అని మనసా, వాచా నమేమ ఈమె తండ్రి కీ.శే.అల్లూరి లక్ష్మీపతిరుగారు. తల్లి కీ.శే.శ్రీమతి ఎ.సరసమ్మగారు.  ఈమెకు మాతృసమానురాలైన అక్కయ్యలు ముగ్గురు. కీ.శే. వెంకటసరసమ్మ, శ్రీమతి సరస్వతి, శ్రీమతి సూర్యకాంతంగారుల. తండ్రిలా పెంచిన బావగారు శ్రీ దఁడు విశ్వనాధరాజుగారు. ఏకైక సోదరుడు శ్రీ అలూలరి సూర్యనారాయరాజుగారు, వదినమ్మ శ్రీమతి స్వరాజ్యలక్ష్మిగారు.

విద్యాభ్యాసం : 4వ తరగతి ఒక ఆశ్రమ పాఠశాల, రాజమండ్రి 5,6,7 తరగతులు ఓరియంటల్ హైస్కూల్ (సంస్కృత పాఠశాల),  సీతంపేట, రాజమండ్రి టౌన్, 8వ తరగతి మలికిపురం, తూర్పు గోదావరి జిల్లా. తెలుగు హైస్కూల్ నుంగం బాకం, మద్రాస్, గాజువాక హైస్కూల్, వైజాగ్, 9వ తరగతి మోగల్లు, కోపల్లె హైస్కూల్స్, 10వ తరగతి ఉండి హైస్కూల్, పశ్చిమగోదావరి జిల్లా, ఇంటర్, బి.ఎస్సి మలికిపురం డిగ్రీ కాలేజ్, తూ.గో.జిల్లా., ఎమ్. ఏ. (పాలిటికల్ సైన్స్), & బి‌పి‌ఆర్ , అంబేడ్కర్ యూనివర్సిటీ, హైదరాబాద్.

ఈమె ఆంధ్రప్రదేశ్ హస్తకళల సంస్థ (ఏ‌పి‌హెచ్‌డి‌సి)లో 1984లో చేరి రెండున్నర సంవత్సరాలు పనిచేసి రిజైన్ చేసి, పారిరశామిక మౌలిక సదుపాయాల సంస్థ (APIIC) లో చేరి, ౩౩ సంవత్సరాలు పనిచేసి పబ్లిక్ రిలేషన్స్ జనరల్ మేనేజర్ గా 2019లో పదవీ విరమణ చేశారు. రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నతోద్యోగినిగా విధుల్ని నిర్వహిస్తూనే ప్రముఖ రచయిత్రిగా తనను తాను నిరూపించుకున్నారు. 1992లో మొదలు పెట్టి, గౌరీలక్ష్మిగారు గత ౩౦ సంవత్సరాలుగా సాహితీ సేద్యం చేస్తూ, నవలా రచయిత్రిగా, కథా రచయిత్రిగా, కవయిత్రిగా, కాలమిస్ట్ గా చక్కని పేరు తెచ్చుకున్నారు. అనేక పొలిటికల్ సెటైర్ లు కూడా రాశారు. ఈమె రాసిన అనేక కథలకు, కవితలకు బహుమతులు వచ్చాయి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం శ్రీ విళంబి ఉగాది (18.3.18) నాడు, అప్పటి గౌరవ ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబునాయుడుగారి చేతులమీదుగా “ఉగాది పురస్కారం” అందుకున్నారు. అక్టోబర్ 2018లో పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీ, హైదరాబాద్ నుండి “కీర్తి’ పురస్కారం, ఇంకా లేఖిని సంస్థ నుండి “లేఖిని’” పురస్కారం అందుకున్నారు. మరికొన్ని మ్యాగజైన్ ల వారు ఇచ్చిన సాహితి సేవా పురస్కారాలు కూడా పొందారు.

ఫామిలీ : జీవన సహచరుడు శ్రీ పెన్మెత్స సుబ్రమణ్య గోపాలరాజుగారు ఆంధ్రప్రదేశ్ సెక్టటేరియట్ లో పనిచేసి పదవీ విరమణ పొందారు. కుమార్తె కాంతిరేఖ, కోడలు శ్రావణి సాఫ్ట్ వేర్ ఇంజనీర్లు. అల్లుడు శ్రీ నడింపల్లి రఘుకిరణ్ , Asst.Prof., VITS, Chennai, కుమారుడు శ్రీ పెన్మెత్త ఫణిచంద్రవర్మ, మేనేజర్, ఇంటర్నేషనల్, ఎయిర్పోర్టు, బెంగళూరు. మనుమలు చిరంజీవులు సాయి వివేక్ వర్మ, శ్రీ ప్రణవ్ వర్మ, బుజ్జాయి సాయిశుభ.

ప్రకృతి ఆరాధనా, సంగీత సాధనా వ్యసనాలుగా జీవిక సాగించాలని మనసు కోరిక. కానీ లోకరీతినీ, గతినీ, మానవ నైజాలనీ గమనిస్తూ, నాతోపాటు జీవనవాహినిలో సాగుతున్న తోటి మను,ల మధ్య ఘర్షణను చూస్తూ, మనం ఇంతకన్నా బాగా, ప్రశాఁతంగా బతకలేమా అందుకోసం ఆలోచించలేమా అనుకున్నప్పుడు తోటివారికి ఏదో చెప్పాలన్న తపన, ఉద్వేగం రాయిస్తాయి. మానవ సంబంధాల కోణంలో నవల, కథ, కవిత, కాలమ్ ఇలా పలు ప్ర్రకియల ద్వారా రాల్చిన చిటపట రవ్వలే నా రాతలు” అంటూ ఈమె తన సున్నిత హృదయాన్ని పది పుస్తకాల రూపంలో మనముందుంచారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

స్త్రీ శక్తి  

వేముగంటి శుక్తిమతిగారి కథ