ఈ మధ్య చాలమంది ఆడవారు, మేము అన్నిటా మగవారితో సమానం అంటున్నారు. ఆ అనటంలోనే వారిని వారు తక్కువ చేసుకుంటున్నారేమో అనిపిస్తున్నది నాకు. ఎందుకు మీరు మగవారితో పోల్చుకోవాలి? ఏం మీరు వారికన్నా ఎక్కువ సాధించలేరా? ఎక్కువ చేయవచుచ, తక్కువ చేయవచుచ. అసలు ఎందుకు పోల్చుకోవాలి? మీరు మీరే. వారు వారే. వారిది ఒకజాతి. మీది ఒకజాతి. వారిది పురుషజాతి. మీది స్త్రీ జాతి. ఏ జాతి లక్షణాలు ఆ జాతివి కావా? పశు పశుపక్షాదులు, క్రిమికీటకాలలో, జంతువులలో లాగా మనష్యులతో కూడా జాతులు. అంతేగాకుండా ఎందుకు వారిలో సమానంగా ఉన్నామని పోల్చుకుంటారు? ఆ పోల్చుకోవటంలో మిమ్మల్ని మీరు తక్కువ చేసుకుంటున్నారేమో అనిపిస్తున్నది.
పూర్వపు స్త్రీలు ఎవరూ ఇలా పోల్చుకున్నట్లు నేను చదవలేదు. మీరేది చదవాలనుకుంటే అదే చదవండి. పురుషులతో సమానంగా ఉండాలని లెక్కలు రాకపోయినా, ఆసక్తి లేకపోయినా తల్లిదండ్రుల బలవఁతఁతో ఇంజనీరుల కాకండి. అలాగే ప్రాణులను కోయటం ఇష్టం లేకపోయినా, లాబం వాసనలు పడకపోయినా డాక్టరు చదువు చదవవాకండి. ఏదైనా ఇష్టము ఉంటేనే చేయండి. చీరే కట్టుకుంటే, పూలు పెట్టుకుంటే, జుట్టు పెంచుకుంటే తక్కువైపోతామనుకోండి. పాంట్, షర్ట్ వేసుకుంటే హాయిగా ఉంటుంది అనిపిస్తే వేసుకోండిగాని, వారితో సమానంగా ఉంటామనే భావనతో వేసుకోకండి. ఇందులో ఎవరు ఎక్కువ, ఎవరు తక్కువ , ఇద్దరూ తల్లి గర్భంలో నుంచి వచ్చినవారే. ఇద్దరూ ఉంటేనే సృష్టికి అందం, ఆ చూసేవారికి ఆనందం.
అందుకని మీరు ఎవరితోనూ పోల్చుకోకండి. టివిలవారు, పేపర్లవారు కూడా ఈనాడు స్త్రీలు, మగవారితో సమానంగా అన్ని రంగాలలో ముందంజ వేస్తున్నారు అని ప్రకటిస్తారు. ఈ పద్ధతి మారాలి. తల్లిదండ్రులు కూడా ఇద్దరినీ సమంగా చూడాలి, సమంగా పెంచాలి. ఇద్దరికీ పాకెట్టుమనీ సమంగా ఇవ్వాలి. లెక్కలు రాకపోతే ఆడపిల్లవి నీకు ఎక్కడ వస్తాయి? వాడు అంటే మగపిల్లవాడు అని అనకూడదు. అలాగే మగపిల్లలు సున్నితంగా ఉంటే నీవేమిటిరా ఆడపిల్లలాగా సిగ్గుపడుతున్నావు అనకూడదు. పెద్దయి నాక వారి వారి లక్షణాలు వారికి వస్తాయి. ఈలోపుగ వారి బుఱ్ఱలు పాడు చేయకూడదు.
అందుకని ఆడవారూ, మీరు వారితో పోల్చుకోకండి. అంతగా పోల్చుకోవాలనుకుంటే, ఒక ఇందిరాగాంధీతో, ఒక మిథాలిరాజ్ తో, ఒక కోనేరు హంపీతో, ఒక సరోజినీనాయుడు గారితో పోల్చుకోండి. అసలు నన్నడిగితే ఎవరితోనూ పోల్చుకోనక్కరలేదు. మీరు మీరుగానే ధైర్యంగా ఉండండి, మీ శక్తిని ప్రపంచానికి చాటండి. స్త్రీలు అన్ని రంగాలలో సమర్థులు అని తెలియచెప్పండి – స్త్రీ శక్తి ఎంత గొప్పదో ప్రపంచానికి తెలియచేయండి. అంతేగాని మేము పురుషులతో సమానంగా ముందుకు వెళ్తున్నాము అన్ని రంగాలలో అని ప్రకటించుకోకండి.