ఎన్నని చెబుతుంది ..
తన హృదయంలో ఉప్పొంగుతున్న కన్నీటిఅలలను..
తన మదిగదిలో పోగైన ఆవేదనల పరంపరలను..
ఏమని రచిస్తుంది….
అవమానాలు చేసిన హృదయగాయాలను..
అపనిందలు రగిల్చిన అగ్నిజ్వాలలను…
అక్కున చేర్చుకునే మనిషే లేనపుడు..
ఆమె మనోవేదనకు ఊరడింపేది,..
ఆదరించే మనసే కరువైనపుడు..
ఆమె ఇష్టాయిష్టాలకు గుర్తింపేది….
తనవారి ఉన్నతికై అహర్నిశలు యంత్రమౌతున్ననూ….
తనకై తాను ఘడియైనా వెచ్చించలేని అభాగ్యురాలు….
ఎవరున్నారని చెప్పుకుంటుంది బాధను….
చెలియలికట్టను దాటలేని సంఘర్షణలను మోస్తూ…
రాయబడని కావ్యాలెన్నింటికో స్థానమవడం తప్ప…