శీతల తరంగాలు కనుపాప
లోగిలి నిండా విరబూయాలి
ఆ చల్లని సాయం సమయం
హృదయ పులకింతల పూబుట్ట
తుషార హేమంతాలు
విరిసినంత కురిసినంత
నీలాకాశం నీదవుతుంది
తరళిత రాగ తాళ మై జ్వలిస్తుంది
ఏఏ ఊహాగానాలు చెలరేగుతున్నాయో
ఏకాంత సమీరం ఏ భావనా శోభిత మయ్యిందో!
కాలం క్షణమాగిపోయే సుందర దృశ్యం
మనో సంస్కారాలు మించి
మంచి మాటలా!
తెలియాల్సిందొక్కటే
దూరపు కొండలు నునుపు అని!
శ్రమశీలత్వపు తెలివి నీదైతే
సాధన ఆరాధన లో విజయం నీదే ఇక!
.
చిత్ర కవిత by కొండపల్లి నీహారిణి, తరుణి పత్రిక సంపాదకులు
చిత్రకారిణి – R. భాగ్య, తెలుగు టీచర్.