పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ లో ఎం.ఎ.చేశారు సీతామహాలక్ష్మీ.అమ్మనాన్నలు అనంతలక్ష్మి గోదావరి శాస్త్రి గార్లు.మృదంగంలో డిప్లొమా ఎం.ఎ.హైదరాబాద్ తెలుగు విశ్వవిద్యాలయం నుండి పొందారు.తొలుత సుదర్శనాచారిగారి వద్ద మృదంగం నేర్చుకుని సర్టిఫికేట్ కోర్సు టిటిసి కోర్సు చేశారు.ధర్మాల వెంకటేశ్వరరావు గారి వద్ద మృదంగం డిప్లొమా చేశారు.సర్వశ్రీ ఎల్లా వేంకటేశ్వర రావు సుబ్బరాజు గార్ల వద్ద తమకళకి మెరుగులు దిద్దుకున్నారు
రేడియో లో వివిధ టి.వి.ఛానల్స్ ప్రోగ్రాంలలో పాల్గొన్నారు.ఇంటర్వ్యూలు ఇచ్చారు.హైదరాబాద్ జవహర్ బాల భవన్లో మృదంగం టీచర్ గా పనిచేశారు.సూపరింటెండెంట్ గా బాధ్యతలు స్వీకరించారు.స్పెషల్ నీడ్స్ పిల్లల కి మృదంగం లో శిక్షణ ఇవ్వడం మరపురాని అనుభూతి.ఈమె ఘటంకూడా వాయిస్తారు.ఆన్లైన్ లో అనేక మంది విదేశీ విద్యార్థులకు మృదంగం లో శిక్షణ ఇస్తున్నారు.గాత్రం వీణ వైలెన్ నాట్యం హరికథలకు వాయిస్తారు.త్యాగరాజ ఆరాధనోత్సవాలు నిర్వహిస్తారు.ఢిల్లీ తిరుపతి పుట్టపర్తి మొదలైన ప్రాంతాల్లో సన్మానాలు పొందారు.పుట్టపర్తి సత్యసాయి బాబా వారి సమక్షంలో 8గంటలు నిర్విరామంగా వాయించి బాబా ఆశీస్సులు పొందటం మధురానుభూతి.బాలమురళీకృష్ణ గారు ఎం.ఎస్.సుబ్బలక్ష్మిగార్ల సమక్షంలో వాయించి వారి ఆశీస్సులు పొందారు.ఇప్పటికీ హేమాహేమీలముందు వాయిస్తూ నే ఉన్నారు.శ్రీ ఎల్లా మల్లాది బ్రదర్స్ హైదరాబాద్ బ్రదర్స్ హైదరాబాద్ సిస్టర్స్ సమక్షంలో మృదంగం విన్యాసాలతో ప్రశంసలు పొందుతూనే ఉన్నారు.ఆమె పొందిన పురస్కారాలు కొన్ని.. స్వామి రామానంద తీర్థ మెమోరియల్ కమిటీ తెలంగాణ ప్రభుత్వం భాషా సాంస్కృతిక శాఖ విశ్వసాహితి ఇంటర్నేషనల్ లిటరరీ కల్చరల్ అండ్ సర్వీస్ ఆర్గనైజేషన్ ఆలిండియా మెడికల్ సైన్సెస్ ఢిల్లీ వారి అవార్డు రివార్డులు ఎన్నో! ఆలిండియా అంతర్జాతీయ యువజనోత్సవాలు లక్ష గళార్చన గిన్నీస్ రికార్డు ప్రోగ్రాం
గోల్కొండ లో2500మంది గాయకులు సామూహిక రాందాసు కీర్తనాగానం ప్రదర్శన లో గిన్నీస్ రికార్డు ప్రోగ్రాం లలో పాల్గొన్నారు.మృదంగవాదకురాలిగా గృహిణి గా తల్లి గా ఆమె రాణించడం విశేషం