నేనున్నానంటూ
ఎక్కడో ఓ చోట
తన ప్రతాపం చూపిస్తూ
పంజా విసురుతూనే ఉంది
పక్షుల కలకలం
ఒక హెచ్చరిక
ముందే చెప్తేనేం
పట్టించుకోని జనం
ఉరుకుల పరుకులతో
కార్లలో షికార్లు
సెల్లు ఫోన్ కబుర్లు
నిర్లక్ష్యపు ప్రవర్తన లు
అవేమీ పేకమేడలు కావు
ఒక్కసారే కుప్పకూలిన
అందమైన భవనాలు
బహుళ అంతస్తులు
జీవిడిచిన వేల ప్రాణాలు
భూమి కూరుకుపోయి
దిబ్బలుగా మారిన అందాల నగరం
టర్కీ కాస్త
అతలాకుతలం
అయోమయం
గందరగోళం
చిక్కుల్లో పడిన వైనం!!
అంతస్తులు వెలిశాక
తట్టుకోలేని బాధ
చెప్పలేని వేదన
మోయలేని భారం
పుడమితల్లి ఆవేదన
తట్టుకోలేని భూదేవి
ఒక్కసారే తల్లడిల్లి
ప్రకంపించి
ప్రతాపం చూపింది
ప్రకృతి పంజా విసిరింది!!
ఎక్కడ చూసినా మట్టిదిబ్బలు
తేలిన శవాల కుప్పలు
వణుకుతున్న ప్రజానీకం!!
కాళ్ళు చేతులు విరిగిన వాళ్ళు
తల్లికి దూరమైన చిన్నారులు
తనవాళ్లను కోల్పోయి
బిక్కుబిక్కుమంటూ
కుంగి కుమిలిపోతున్న కుటుంబాలు
తిండిలేక తిప్పలు పడుతూ
దాహానికి నోచుకోక ఎండిన నోర్లు
ఏడుపులు
పెడబొబ్బలు
ఆపన్న హస్తాలకై ఎదురుచూపులు!!
సాయానికి
మీరూ నేనూ
భారతమాత
మరో దేశం
అందరి జాలి చూపులు ఒక్కచోట
ఆచరణ ఆదరణ
రెండు ఏకమయ్యి
త్వరగా కోలుకోవలన్న కోరిక
అల్లకల్లోలానికి తెర దించ
అందిద్దాం చేయూత
నింపుదాం ధైర్యం
పెంచుదాం నమ్మకం
టర్కీ ఇప్పుడొక రెక్కలు తెగిన
ఎడారి పక్షి
ఇనుప ముక్కలు కావు
గుండె లబ్ డబ్ లు
మనం అంటే సమస్త మానవాళి!!
__**_
(టర్కీలో వచ్చిన భూకంపము చూసి చలించి రాసింది)
ధన్యవాదాలు నీహారిణి….చక్కగా ప్రచురించినందుకు..