వివేకం సౌమ్యత
ధిషణ ధీమతి
ఎంత మంచి మాటలు
లుంబిని పట్టణం ఏ మంచి పూలను ప్రేమించెనో
మూడు రంగులు సామాన్య సహజత్వం
త్రిపీటకాలు
ఏమా జ్ఞాన సంపన్నత
నాలుగు పరమ సత్యాలను వెంటతెచ్చుకొని
అష్టాంగ మార్గాల ఆర్యసత్యాలను పంచి
రాగద్వేషాలు అంతరించాలని
సహనం సందేశమై అంకురించాలనీ
నీవో శాంతి మంత్రానివయ్యావు!
రత్న త్రయాలు
బుద్ధం శరణం గచ్ఛామి
ధర్మం శరణం గచ్ఛామి
సంఘం శరణం గచ్ఛామి
నీదంతా సమ్యక్ సంకల్పం
నీవో నిరంతర అంతః చేతన
వాక్కు
దృష్టి
కృషి నీవై
నీవే వెలుగై
వెలుగే నీ తత్వమై
అనంతత్వమై
మాలో మేము గా
లోలోనే చక్ర సందర్శన మై
పంచశీల సూత్రాలమై ……
ధర్మ బద్ధ జీవనులమవుతాం
చిత్ర కవిత by – డా. కొండపల్లి నీహారిణి