మనసు మట్టిలో నాటాను
ప్రేమ విత్తనాన్ని
ప్రియా! నిను చూసిన క్షణాన
మొక్కై మొలిచి చిగురులేసింది
నీ ప్రేమ వానతోనే
నీవైన మమతానురాగాలతో మురిసిపోయింది
నీ కరుణామయి హృదయంతో కరిగి
నా మది సంతోషంతో పెళ్లి పుష్పమై విరిసింది
ఆ పువ్వును ఎన్నటికీ వాడనివ్వను
సిపాయిగా పహారాకాసేది మాతృ భూమి రక్షణ కోసం
నీవు వచ్చే దారిలో ఈ పూవు నవ్వుతుంది
మన ఏడడుగుల బంధాన్ని ఎన్నటికీ వీడను
నీకు నేను మాట ఇస్తున్నాను ప్రియతమా!
దేశ సరిహద్దులు నీ అడుగుల స్పర్శతో
ధైర్య వచనాలు పలుకుతున్నాయి
అక్కడ నేను లేకున్నా
ఇక్కడ సైనికుని భార్య గా
నేనూ గౌరవ వచనాలను అందుకుంటున్నా
ఇవన్నీ నీవు రాగానే అక్షర గుచ్ఛాలుగా చేసి
నీ చేతికి అందిస్తాను