పంట ఇంటికొచ్చిన సంబరం
ముంగిట రంగవల్లుల స్వాగతం
రవి ఉత్తరాయణ గమనం
మకర రాశి ప్రవేశం
పుణ్యం పురుషార్థం పుడమిలో
సంతోషాల సంబరాల సంక్రమణం!!
రకరకాల బొమ్మలు
రంగురంగుల చిత్రాలు
దేవుళ్లు పశుపక్ష్యాదులు
పురాణేతిహాసాల కథనం
ప్రకృతితో మమేకం
పిల్లలకు దొరికే విజ్ఞాన వినోదం
అందంగా ముస్తాబైన బొమ్మల కొలువు
బొమ్మలన్నీ ఒకచోట చేర్చిన వైనం!!
అతివల ఆర్భాటం
పతంగులతో పిల్లల ఆటలు
భోగి పండ్లతో చిన్నారుల కేరింతలు
సంతోషాల లోగిళ్ళు
ఉత్సాహపు పొంగళ్లు
సంబరాల సంక్రాంతి
రవి ఉత్తరాయణ క్రాంతి
అంబరాన్నంటే ఆనంద కాంతి
అందరికీ కావాలి శాంతి!!