నేడు ప్రతీ కుటుంబానికి ఆడదే ఆర్థిక మంత్రి. మన దేశాన్ని కూడా ఆడదే ఆర్థిక మంత్రి. ఆర్థికం అనేది పొదుపు కి ఖర్చుకి సంబంధించినది పొదుపు మన భారతీయ స్త్రీలకు పెట్టింది పేరు పూర్వం నుంచి మన తాతమ్మలు మామలు ట్రంకు పెట్టెలు వాళ్లకి కిడ్డీ బ్యాంకులు. త్రీధనం కింద పుట్టింటి వారిచ్చిన పొలం కానీ బంగారం కానీ ఎంతో భద్రంగా దాచి తర్వాత తరాలకి అందించేవారు అవసరాలకు పక్కకు వస్తుందని పొదుపు ఎప్పుడూ పాటించేవారు కానీ నేటి యువతకు భావి భారత పౌరులకు డబ్బు సంపాదన మాట ఎలా ఉన్నా ఖర్చు మాత్రం విచ్చలవిడిగానే చేస్తున్నారు ఆ ఖర్చులకు అర్థం పర్థం ఉండదు. దీనికి పెద్దలే కారణభూతులు. పొదుపు చేయకపోవడం వలన మొన్న వచ్చిన కరోనాకాలంలో మధ్యతరగతి వారు ఎన్నో కష్టాలు నష్టాలు పడ్డారు. అందుకే మన పెద్దలు ముందుచూపు ఉండాలి అని ఎవరు. మన మన దృక్పథంలో పొదుపు ఖర్చు వేరువేరు అంశాలు కాదు. అది ఒక దానికి ఒకటి పెనవేసుకుని ఉన్నాయి. పొదుపు చేయకపోతే ఖర్చు పెట్టడానికి వెనకా ముందు ఆలోచించాలి. ఖర్చు పొదుపు రెండు సమానంగా ఉండాలి అప్పుడే పొదుపు అనేది కుదురుతుంది. రెండింటికి అవినాభావ సంబంధం ఉంది. ఎలాగంటే మన దగ్గర 100 రూపాయలు ఉన్నాయి అనుకోండి అందులో నుంచి ఒక పాతిక రూపాయలు ప్రక్కకు పెట్టి నా దగ్గర ఉన్నది 75 రూపాయలే ఉన్నాయి అనుకోవాలి. ఎంత ఎక్కువగా షాపింగ్ చేసిన దానికి తగ్గట్టు పక్కన పెట్టుకుని షాపింగ్ చేయాలి అవసరమైనప్పుడు ప్రతి రూపాయి విలువైనదే. మీ పిల్లలకు కూడా ఇదే నేర్పండి. ఇంటి యజమానికి కూడా కొన్ని హద్దులు ఏర్పరిచి ఫిక్స్డ్ డిపాజిట్లు ఎల్ఐసి పాలసీలు హెల్త్ ఇన్సూరెన్స్ లు తప్పక తీసుకోండి. కష్టకాలంలో అవి కొండంత అండ. మనం కొనే కార్లు టీవీలు ఏసీలు వాటికి కూడా ఇన్సూరెన్స్ చేయించండి. వాటికి ఈ ప్రాబ్లమ్స్ వస్తే ఆదుకుంటాయి. మధ్యతరగతి, క్రింద మధ్య తరగతి వారికి ఈ పొదుపు చాలా అవసరం. తీర్థయాత్రలకు, పండుగలు పబ్బాలకు, పిల్లల పెళ్లిళ్లకు, చదువులకు, అనారోగ్య లు లాంటి అనుకోని ఖర్చులకు పొదుపే శ్రీరామరక్ష