మన మహిళామణులు

శ్రీమతి బండి ఉష

ఆమె ఒక టీచర్ యోగా గురువు కవయిత్రి రచయిత్రి ఆధ్యాత్మిక భావాలతో పరిమళించే సాహితీవేత్త.ఓతపస్సులాగా సాహితీ చరిత్రలో ఓఅద్భుతం ని చేశారు.దేశంలోని వివిధ ప్రాంతాల కవులచే రాయించి దాదాపు 570పేజీల పుస్తకం ని వెలుగులోకి తెచ్చారు.”అమ్మకు అక్షర నైవేద్యం”పేరు తో సింహవాహిని శ్రీ మహంకాళీ అమ్మవారి కి కవితా నైవేద్యం పెట్టిన భాగ్యశాలి!ఆదేవాలయ చీఫ్ అడ్వైజర్ శ్రీ మహేష్ గౌడ్ గారి సహకారం మరువలేనిది.హేమాహేమీలు మొదలు చిన్నారి బడి పిల్లలు కూడా రాయటం విశేషం.కంచిపీఠం స్వామివారి ఆశీస్సులు లభించాయి ఈమెకి సహకారం అందించినవారు శ్రీ ఉడతా రామకృష్ణ గారు భర్త శ్రీ దండా లక్ష్మణరావు గారు.ఆమె ఖమ్మం నివాసి.ఇక ఈమె మాటల్లో ఆమెను గూర్చి తెలుసు కుందాము ”

“నాపేరు బండి ఉష.ఖమ్మం రూరల్ మండలం ఆరెంపులో పుట్టాను.అమ్మ నాన్నలు బండి లక్ష్మి వెంకటవీరయ్య గార్లు.బి.ఎ.లెక్కలు ఎం.ఎ.ఎకనామిక్స్ తెలుగు చేశాను.బి.ఇడి కాగానే ప్రభుత్వ బడిలో చేరాను.ప్రస్తుతం జడ్ పి.హైస్కూల్ జలగంనగర్ లో లెక్కలటీచర్ గా పనిచేస్తున్నాను.రచనలు చేయటం సామాజిక సేవ లో పాలు పంచుకోవటం యోగానేర్పటం నాప్రవృత్తి.శ్రీమండలి బుద్ధప్రసాద్ గారు నాకథల్ని ప్రశంసిస్తూ పరిచయం వాక్యాలు రాశారు.
[23:08, 1/31/2023] Niharini: ఉషాకిరణాలు గ్రహణంవీడినవేళ అనే కవితా కథా సంపుటాలు అందరి ప్రశంసలు అందుకున్నాయి.నాకు వచ్చిన అవార్డులలో కొన్ని పేర్కొంటాను.మహంకాళీ దేవాలయం పురస్కారం (లాల్ దర్వాజా) నవకలం సిరికల్చరల్ ఫౌండేషన్ ఉగాది పురస్కారం వేదధర్మశాస్త్ర పరిషత్ రంజనివిశ్వనాధ రంజనిరాయప్రోలు రామకృష్ణయ్య మొదలైనవి.
నాన్నపేరు బండి వెంకటనరసయ్య అమ్మ లక్ష్మి
ఉషా కిరణాలు. కవితా సంపుటి
గ్రహణం వీడినవేళ., శారద రాత్రులు కథా సంపుటాలు
యోగా school age లోనే అలవాటు. తరువాత nature cure లో నేర్చుకొని అక్కడే యోగా కూడా నేర్పాను.
అరవింద యోగా trust స్థాపించి ఉచితంగా online, ofline ద్వారా ఉదయం, సాయంత్రం నేర్పిస్తున్నాము.
ఎంతోమందికి ఆరోగ్య సమస్యలు పరిష్కరించాం. దేశ, విదేశాలలో వారుప్రతి రోజూ యోగా చేస్తున్నారు


.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

అబద్ధపు తెర

పొదుపు ఖర్చు