శీతల తరంగాలు కనుపాప
లోగిలి నిండా విరబూయాలి
ఆ చల్లని సాయం సమయం
హృదయ పులకింతల పూబుట్ట
తుషార హేమంతాలు
విరిసినంత
కురిసినంత
నీలాకాశం నీదవుతుంది
తరళిత రాగ తాళ మై జ్వలిస్తుంది
ఏఏ ఊహాగానాలు చెలరేగుతున్నాయో
ఏకాంత సమీరం ఏ భావనా శోభిత మయ్యిందో!
కాలం క్షణమాగిపోయే సుందర దృశ్యం
మనో సంస్కారాలు మించి
మంచి మాటలా!
తెలియాల్సిందొక్కటే
దూరపు కొండలు నునుపు అని!
శ్రమశీలత్వపు తెలివి నీదైతే
సాధన ఆరాధన లో విజయం నీదే ఇక!
చిత్ర కవిత by కొండపల్లి నీహారిణి
తరుణి పత్రిక సంపాదకులు