నింగిన చుక్కలు తెచ్చి
తారాహారం అల్లినట్లుగా
తోచే చుక్కల ముగ్గు!
లెక్కగా పెట్టిన చుక్కలతో
చక్కని చిత్తరువోలే తీర్చిన తీరైన ముగ్గు!
లతలు,పద్మములు,
నక్షత్రములు,శంఖువుల
ఆకారాలతో రూపుదిద్దుకునే
రమ్యమైన రంగవల్లి!
ఇంతుల కళానైపుణ్యానికి…
సహనానికి, పరిసరాల పరిశుభ్రతకు తార్కాణంగా నిలిచి…
ఇంటికి శోభను చేకూర్చే ముచ్చటైన ముగ్గు!
కీటకములకు లక్ష్మణరేఖగా నిలిచి…
కనువిందు చేసే పచ్చని
పేడకళ్ళాపిపై తెల్లని
అందాల మెలికలు
తిరిగిన గీతల ముగ్గు!
నేడు నేల కరువై…
సుద్దముక్కల గీతలకే పరిమితమై…
పండుగలకు మాత్రమే ప్రత్యక్షమౌతోన్న
మొక్కుబడి ముగ్గు!!!