ఓ అమ్మ కూతురికి రాసిన లేఖ

లక్కరాజు నిర్మల

ప్రియమైన బేబీకి
నీకు ఆశీస్సులు నీవు ఎప్పటికీ ఆరోగ్యంగా ఆనందంగా సంతోషంగా ఉంటావు అని నాకు తెలుసు ఎందుకంటే నువ్వు నా కూతురివిగా!
నీకు ఇష్టం ఉందో లేదో తెలియదు నా చిన్నతనంలో పెళ్లి చేశారు అది నా ఇష్టం ఉందో లేదో తెలుసుకోకుండా ఓ బాధ్యతఅని నా పెళ్లి చేసి పంపించారు. ఈ తెలంగాణలో పెళ్లి చేసి చేయి దులుపుకుంటారు. తల్లిదండ్రులు. అలా నన్ను పెళ్లి చేసి పంపారు కానీ ఏనాడు పుట్టింటికి పిలిస్తే ఒట్టు. పెళ్లి చేసి పంపించారు
ఆ లాంఛనాలని ఈ కట్న కానుకలని వీళ్లు ఎక్కడ ఆడపిల్లని ముట్టుకుంటే బాధ్యతలు మా మీద పడతాయని పుట్టింటి వాళ్ళు నన్ను పట్టించుకోలేదు. ఎవరు పుస్తెలు కూడా చేయించకున్నా అన్నీ నేనే కొనుక్కొని ఆనందించాను అర్హుడైన అసాధ్యుడైన అమాయకుడైన ఆలనా పాలనా చూడకుండా వేరే గత్యంతరం లేక కాపురం చేశానమ్మ.
తెలియకో తెలుసో అందరూ పెళ్లి అయింది పిల్లలు లేరా అంటారుఅని. నీవు నాకు చెప్పి కన్నావా అంటారు పిల్లలని ఈ అమ్మకి భయం.
అందుకే నిన్ను కన్నాను రా కానీ నీవు నన్ను ఇది కొను అది కావాలి అని ఏనాడు నోరు విప్పి నన్ను నీవు అడగలేదు.
నా సంతోషం కోసం గౌనులు లంగాలు కొన్నాను డ్రెస్సులు అలా నాకిష్టమైన కోరికలన్నీ నీకు చేస్తూ ఆనందించాను. నీ ఇష్టం ఏనాడు అడగలేదు ఇది నాకిష్టమని అన్ని కొన్నాను చదువుకోవద్ద న్నా ఎందుకంటే నేను చదివి ఏం సాధించాను .నిన్ను చూసుకోవడానికి ఓ పనిమనిషి లేక అటు పుట్టింటి వాళ్ళ ఆదరణ లేక ఇటు అత్తింటి వారు లేక అందరూ దూరం దూరం అందుకే నీకోసం గవర్నమెంట్ ఉద్యోగాన్ని కూడా వదిలేశా.
డబ్బుకి ఎంత కష్టమో తెలుసు అయినా నీకోసం నీ ప్రేమ కోసం నీ భవిష్యత్తు కోసం నీవే సర్వస్వం అనుకొని నా కోరికలు ఆశలు ఆశయాలు అన్ని నీతోనే తీర్చుకున్నాను. అయినా చదవకే అన్నా కూడా అన్నిట్లో నువ్వు ఫస్ట్ మంచి ఉద్యోగం సంపాదించుకున్నవు. నీకు నీవు గానే అమ్మా నాన్నకు ఏ కష్టం లేకుండా చూస్తున్న నీకు ఏ రకంగా రుణం తీర్చుకోనమ్మ మాకు ఈ వయసులో దేనికి కొదవ లేకుండా చూస్తున్నందుకు కృతజ్ఞతలు హృదయపూర్వకమైన కృతజ్ఞతలు.
నేను ప్రస్తుతం నీకు తల్లిని కానీ శారీరకంగా మానసికంగా చాలా అలసిపోయానమ్మ మనసు నీకు ఎన్నో చేయాలని ఉన్న శరీరం సహకరించదు చూడ్డానికి బాగానే ఉన్నా శారీరకంగా మానసికంగా వయసుతోపాటు నాలో ఎన్నో మార్పులు జరిగాయి. మనసు నీకు ఎంత చేయాలని ఉందమ్మా కానీ ఈ మనిషికి శారీరకంగా బలహీనురాలను అసమర్థ్రురాలను అని చెప్పగలరు .నేను నీ కంటికి చకచకా చాకచక్యంతో నీ చుట్టూ అల్లరిగా ఆనందంగా ఉత్సాహంగా ఓపికతో ఆర్భాటాలతో తిరిగిన అమ్మనే నీకు కనిపిస్తోంది. ఈ అమ్మ ఓపిక అమ్మలాలనా అమ్మ ప్రేమ అమ్మ ఆత్మీయతను చూస్తూ ఆ రూపాన్ని నువ్వు తలుచుకుంటున్నావు.
అమ్మ నాకు తోడు ఉంటుందని ఇంకా ఎంతో శారీరక శ్రమ చేస్తుందని కలలు కంటున్నావు అమ్మ నీకు ఎంతో చేయాలని చెప్పాలని చూస్తుంది కానీ మీ ప్రేమలో నీకు ఆమె భావము ఆమె భాష ఆమె బాధ అర్థం కావటం లేదు.
లోకం పిల్లల పెళ్లిళ్లు కాన్పులు పెంపకం మనవరాలు మనవళ్ళు పెంపకం అన్ని అమ్మే చేయాలని ఈ లోకంలో నానుడి కానీ నీ ముందు ఏదీ నోరు విప్పలేని తనం.నాది.
నీవు అన్నీ చేసుకోగలవు. నీవు నా కూతురివి నీవు నన్ను అర్థం చేసుకోగలవు లోకంలో అందరిలా బేలవి కూడా కాదు చాలా ధైర్యస్తురాలివి ప్రస్తుత కాలంలో మనిషివే అయినా నీ మనసులో స్థానం నేను చాలా గొప్పగా ఉన్నాను అని తెలుసు.
నీ మనసులో స్థానం నాకు ఉందమ్మా ఈనాటి అమ్మల ఆవేదన ఇది. పిల్లలకు చేయ శారీరక సామర్థ్యం ఆర్థిక స్వాతంత్రం రెండే అమ్మలు కోరుకునేది మా మంచి చెడు చూస్తున్న నీకు ఏ రకంగా సహాయం చేయలేని స్థితి. నాది నాకే అసహ్యంగా ఉంది ఎంత శారీరక బలహీనురాలనైపోయాను కానీ వయస్సు వెనక్కి వెళ్ళదు కదమ్మా పెళ్లి లేటు పిల్లలు లేటు నీవు వివాహం 30 దాటాక చేసుకున్నావు మరి నీ పిల్లలకి ఈ వయసులో నేను నీకు సహాయం చేసేది ఎలా నన్ను అర్థం చేసుకో.
మీ నాన్న ఏం చేయకున్నా నీవు వెళ్లి అమ్మాయికి హెల్ప్ చెయ్యి అంటారు కానీ నీవు ఎన్నాళ్ళు నాతో 45 సంవత్సరాలు కాపురం చేశావు ఇంతమందికి మర్యాదలు చేశావు ఈ ఇంటికి ఒక ఇల్లాలుగా నాకు ఏమీ లోటు లేకుండా చేశావు. ఈ రోజైనా నీవు విరామం తీసుకో అని ఒక్క మాట కూడా మీ నాన్న మాట వరసకైనా అనరు. ఎందుకంటే ఆయన చెడ్డవాడు కావడం ఇష్టం లేదు మీ అందరి దృష్టిలో అందుకే నన్ను నా ఈ బాధను ఈ ఉత్తరం ద్వారా తెలుపుతున్నాను.
అమ్మాయి నీవు ప్రజ్ఞాశాలివి ఎడ్యుకేటెడ్ వి ఎడ్యుకేట్ అయ్యావు కూడా! నీ ఆరోగ్యం నీవు చూసుకో నీవు ఆరోగ్యంగా ఉంటేనే మానసిక ఆరోగ్యం కూడా వస్తుంది శారీరక ఆరోగ్యం బాగుంటుంది చక్కటి ఆలోచనలు ఆలోచనలు ఆచరణ యోగ్యత కలిగి ఉంటాయి. ఇంకా అమ్మానాన్నలు ఏదో చేస్తారని ఆశపడకమ్మా.
నీవు నీ బాధ్యతలు చేసుకోగలవు అర్హుడైన అల్లుడు. నీవు ఎంత గొప్ప ఆఫీసర్ అయినా నాకు నువ్వు కూతురువే నీ ప్రజ్ఞ నాకు తెలుసు సమస్యలని సమస్యలుగా కాక పరిష్కార మార్గంగా చూసుకుంటావు. నీ ఆకలి నీ నిద్ర శరీర ప్రవృత్తిని వేడి నా చలువనా చూసుకో దానికి తగిన ఆహారము నిద్ర పాటించు. ఎవరో వస్తారని నిన్ను చూసి అయ్యో చిక్కవని తినలేదని అంటారని ఆశించకు.

నీ శరీరాన్ని మనసుని అవసరాలని ఆకలింపు చేసుకో బ్రతకడం నేర్చుకో లౌక్యం పెంచుకో నీ గురించి నీవు ఆలోచించుకో నీ శరీరానికి మనసుకి ఏం కావాలో సరైన సమయానికి అందించుకో నీ గురించి నీవు ఆలోచించుకో.
నీవు ఆరోగ్యంగా ఉంటే మానసిక స్థితి బాగుంటుంది మంచి నిర్ణయాలు చేయగలవు నీవు అనుకున్న ప్రగతి సాధించగలవు నిన్ను నీవు ప్రేమించుకో నీ శరీరానికి కృతజ్ఞత చెప్పుకో ప్రతిరోజు శరీరానికి కావలసిన ఆత్మీయత ప్రేమను కండరాలకి నరాలకి బొక్కలకి రక్తానికి నిరంతరం ప్రేమతో అందించు. నీవు సాధించలేనిది ఏదీ లేదు. ఈ శరీరమే అన్ని విజయాలకి ముఖ్యం ఆరోగ్యం జాగ్రత్త ఆరోగ్యమే మహాభాగ్యం ఈ అమ్మను మార్గదర్శకంగా తీసుకొని నీ లోకాన్ని నీవు సృష్టించుకో నీ భర్త నీ పిల్లలు నీ సంసారం గురించి ఆలోచించుకో మూడు పువ్వులు ఆరు కాయలుగా నీ జీవితం కలకాలం ఆనందంగా వెలగాలని ఆనందంగా సాగాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తుంది అమ్మ.
ఇట్లు ప్రేమతో మీ అమ్మ

Written by Lakkaraju Nirmala

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

మన మహిళామణులు

మహిళా మణులు