మన మహిళామణులు

   కొలిపాక శోభారాణి

సిరిసిల్ల చేనేత కి ప్రసిద్ధి.ఆపట్టణానికి చెందిన రచయిత్రి కవయిత్రి శోభారాణి గారు తన జీవితానుభవాలను తరుణి తో పంచుకున్నారు…

కొలిపాకశోభారాణి, సిరిసిల్లా.
…..
నేను జన్మించిందివరంగల్ జిల్లా.హన్మకొండలో. అమ్మా,బాపు ఇద్దరూ టీచర్లు మాకుటుంబం
లో నలుగురం..సంతానం ఇద్ద రు తమ్ముళ్లు,ఒక చెల్లెలు మొద టగా నేను పెద్దదాన్నవటo..వల్ల
అమ్మా వాళ్ళు స్కూల్ కు వెళ్లి నప్పుడు..మిగితా మిగులు సమయంలో..చిన్నవాళ్ళయిన
తమ్ముళ్లు చెల్లెలి బాధ్యత తీసుకునేదాన్ని..నా 10వ తరగతి తరువాత పెళ్లి జరిగింది1977 లో అత్తయ్య
వాళ్ళది.వేములవాడ..నా భర్త సిరిసిల్లలో.. కో ఆపరేటివ్ ఎలక్ట్రిక్ సొసైటీ లో పని చేస్తూ oడే వారు..ముందు పాప తరు వాత బాబు..జీవితంలో పెద్ద దెబ్బ జీవిత సహచరుని మృతి అతని ఆఫీసులో నే
ఎల్.డి.సి.గా చేరాను..అప్పటికే డిగ్రీ పూర్తి అవ్వటం పిల్లలిద్దరూ చిన్నవాల్లవ్వటం ఆతరువాత పిల్లలిద్దరి తో చాలాకష్టపడ్డాము. తరువాత కాలంలో 2004లో “చలనo”కవితా సంపుటివచ్చిo ది.ఇందుకు చిన్నప్పుడు.. బాపు
తెచ్చి ఇచ్చిన చందమామ,బాలమిత్ర, మొదలైన చిన్న పిల్లలకథ ల పుస్తకాలు..బీజం వేసాయి
సాహిత్యం పట్ల అభిరుచి పెరగటానికి కవిత్వం “చలనం”బుక్ రావడానికి.. నా చుట్టూ ఉన్న సాహితీ ప్రపంచం ప్రధాన కార ణం మిత్రులు పెద్దలు జూకంటి జగన్నాథం సార్ పెద్దింటి అశోక్కుమార్ సార్ మద్ధికుంట లక్ష్మణ్ సార్ ఆడేపులక్ష్మణ్.అనిశెట్టి రజిత పత్తిపాక మోహన్ఇతర సాహితీ మిత్రులు…పెద్దలు నలిమెలభాస్కర్,నాలేశ్వరం శంకరం వారాల ఆనంద్ గూడూరి సీతారాం గార్ల ఆశీర్వాదాలే కారణం.  ఉద్యోగ జీవితంలో అంచెలంచెలుగా.యూ.డి.సి,తరువాత జె.ఎ. ఓ.,,ఏ.ఎ.గా..పనిచేసి 20
18 లోరిటైర్మెంట్ తీసుకున్నాను ప్రస్తుతం కథలు డజన్ వరకు రాసాను కవితలు అప్పుడప్పుడు వ్యాసాలు
రాస్తుoటాను.”ప్రజాస్వామ్యం రచయిత్రుల వేదిక” తో..కొన్నిసార్లు క్షేత్ర పర్యటనలు చేసాను.ప్రస్తుతం కథలు,కవి త్వం చదువుతుoటాను.బాగా ఇష్టాంగా..రాస్తుంటానుకూడా. నా మిగులు సమయంలో.. నేను కొనుక్కున్న వ్యవసాయ
భూమి తoగళ్లపల్లి శివారు లో ఉన్నది దాని కౌలు విషయాలు చూస్తుంటాను..అందులో ప్రధా
నంగా వరిమాత్రం వేస్తుంటాము మేము తినే బియ్యము మా పొలం లోనివె. పిల్లలు పెద్దవా ళ్ళయ్యారు.
ఇక.నేను పొందిన పురస్కారా లు:-
1.చలనం కవితా సంపుటికి రుద్రరవి స్మారక పురస్కారం 2004లో
2.”చలనం” కవితా సంపుటికే రంగినేని ఎల్లమ్మ స్మారక పుర స్కారం.
3.చిన్న కథా విభాగంలో”శేష
ప్రశ్న”కు సోమేపల్లి వెంకటసుబ్బ య్య పురస్కారం 2013 లో
4.మార్చి 8అంతర్జాతీయ విశిష్ట మహిళా పురస్కారం 2014లో
5. మల్లినాథసూరి కళా పీఠం వారి పురస్కారం
6.గురజాడ అప్పారావు జిల్లాస్థాయి.. పురస్కారం కవిత్వానికి.2013 లో
7.జ్యోతిభాపూలే పురస్కా రం .2014 లో
8.అలిశెట్టి ప్రభాకర్ జగి త్యాల రాష్ట్రస్థాయిపురస్కారo 2019లో.
చాలానే పురస్కారాలు, ప్రశ oసలు అందుకున్నాను.
నా ఉద్యోగ జీవితంలో బెస్ట్ ఎంప్లాయ్ అందుకోవడం..సంతోషం..
ఈ నా కృషిలో ఎంతోమంది ప్రోత్సహం నన్ను నడిపిoచిoది.
అందరికి నా వినమ్ర నమస్సులతో .🙏

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

మన మహిళామణులు

ఓ అమ్మ కూతురికి రాసిన లేఖ