ప్రతి మనిషి వెనుక
ఒక చరిత్ర
గట్టిదో.. ఒట్టిదో.. మట్టిదో..
ఏదో ఒకటి
రాస్తే రాయగలిగినన్ని పేజీలు
అవనిలో అచ్చవని గ్రంధాలెన్నో..
ప్రతి హృదయం వెనకా
ఒక వ్యథ
బాధలతో.. గాయాలతో..
కష్టాలు కడగండ్లతో..
కార్చిన కన్నీటి చుక్కలు
లెక్క పెట్టలేని సంద్రాలెన్నో..
ఘనమైన చరిత్రను కలిగిన వాళ్ళందరూ
గొప్పవాళ్ళు కాకపోవచ్చు..
మట్టి బతుకులో ముగిసిన జీవితాలన్నీ
హీనచరితలు కాకపోవచ్చు..
కొలతలు వేయలేని
బతుకు చిత్రాలు మనవని
గ్రహించాలి..
మంచిని మనలో నింపుకుని
మానవత్వంతో మసలుకోవాలి..!!