లోకం లోకి చూడు
నీవై నీకు కనిపిస్తావు
భ్రమల పొట్లం విప్పి చూస్తే
ఆకసమంత మనో వైచిత్రి పసిగడ్తావు
పుస్తకం తెరిచావంటే పృధ్వీ కనిపిస్తుంది
పట్టలేనంత శూన్య మూ తెలిసొస్తుంది
ఎందుకంటే నీవు తెరిచింది పుస్తకం
ఎందుకంటే నీవు తెరిచింది ప్రపంచం
విజ్ఞానపు వెలుగుల దారి దీపం
వింత వింత భావనల ప్రతిరూపం
పోయేది ఏమీ లేదు
వచ్చేదంతా జ్ఞానమే
తెచ్చేదంతా విజ్ఞానమే!
పుస్తకాల్ని తెరుద్దాం అవి బుద్ధిని తెరుస్తాయి!
పిడికెడు తెలివి గుట్టెడు చీకటిని చీల్చేస్తుంది
చిత్ర కవిత రచన- కొండపల్లి నీహారిణి