ఏది తినిపించాలి

డా.నీలం స్వాతి

హలో మేడమ్…! నమస్తే బాగా బిజీ అయిపోయినట్టున్నారు ఈ మధ్య ఫోన్ కూడా లిఫ్ట్ చేయడం లేదు. మెసేజ్ కి కూడా రిప్లై ఇవ్వడం లేదు.
మమ్మల్ని కూడా కొంచెం గుర్తుపెట్టుకోండి మేడం ఎంతైనా మనం మనం చిన్ననాటి స్నేహితులం అంటూ
మాటల దాడిని ప్రారంభించింది
రీతు. అదేం లేదే నీ ఫోన్ వచ్చేటప్పుడు మొన్న వంట చేస్తూ వున్నాను అందుకే లిఫ్ట్ చేయలేదు అంతేగానీ నిన్నెలా మర్చిపోతాను చెప్పు అంటూ
బుజ్జగించడం మొదలుపెట్టింది
లల్లి. ఇన్నాళ్లకైనా ఫోన్ ఎత్తావు సంతోషం ఆగు అమ్ము కు కూడా లైన్ కలుపుతాను చాలా రోజులయ్యింది తనతో మాట్లాడి అంటూ కాన్ఫరెన్స్ కాల్ ని కనెక్ట్ చేసింది రీతు. హాయ్ డాక్టర్ గారు ఎలా ఉన్నారు కాస్త మాకు కూడా అప్పాయింట్మెంట్ ఇవ్వండి మేడం అంటూ హేళన చేయడం మొదలుపెట్టింది.
కొంత సేపు బాగోగులు, మరి కొంత సేపు సరదా కబుర్లు, చిన్ననాటి జ్ఞాపకాలను నెమరు వేసుకుంటూ హాయిగా మాట్లాడుకున్నాక మాటలలో పిల్లల తిండి గురించి ప్రస్తావన వచ్చింది. మా వాడు పప్పు తప్పించి ఏమీ తినడే వాడు లంచ్ బాక్స్ లో ఎప్పుడు పప్పే పంపించాలి. మరే కూరలు పంపినా తినడు కాక తినడు. ఉదయం టిఫిన్ లో ఒక్క దోస తింటాడు ఇడ్లీ అంటే అస్సలు ఇష్టం లేదు మా చిన్ను గాడితో వేగలేక చచ్చిపోతున్నానంటూ
రీతు చెప్పగానే లల్లి కూడా నా పరిస్థితి అలానే ఉందే. నీకు ఒక్కడే నాకు ఇద్దరు ఒకరికి నచ్చింది మరొకరికి నచ్చదు. మా పాప కి మూడు పుట్ల చపాతీ కావాలి, మా అబ్బాయికి మ్యాగీ నూడిల్స్ కావాలి నేనేం చేయను చెప్పు అంటూ ఇద్దరు
పిల్లల ఆహార విషయాలలో వారు పడుతున్న అవస్థలను చెప్పడం మొదలుపెట్టారు.
ఆ మాటలను వింటున్న అమ్ము
అరే అరే కొంచెం ఆగండే ఈ డాక్టర్ సలహా కూడా తీసుకోండి. ఆ…ఆ మర్చిపోయాం చెప్పండి…! డాక్టర్ మీ అమూల్యమైన సందేశాన్ని అందించండి
అంటూ మౌనం వహించింది రీతు. చెప్తాను జాగ్రత్తగా వినండి మరి పిల్లలు ఎదిగే వయసులో వారికి పౌష్ఠిక ఆహారాన్ని మెరుగ్గా అందించాలి. లేకుంటే వారి ఇమ్యూన్ పవర్ లోపించి అనేక వ్యాధులకు గురి అవుతారు. కనుక వారు తినే
మూడు పూట్ల ఆహారంలో మనం అమితమైన శ్రద్ధ వహించాలి. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ లో పాలు, ఇడ్లీ, దోశ, మొలకెత్తిన విత్తనాలను అందించాలి. ఉదయం టిఫిన్ లో ఆయిల్ ఫుడ్ యవాయిడ్ చేయడం మంచిది. అంటే పూరి, వడ లాంటివి అని చెప్పింది లల్లి. కరెక్ట్… అలాగే మధ్యాహ్నం లంచ్ బాక్స్ ని
4 భాగాలుగా విభజించి ఒక భాగంలో కార్బోహైడ్రేట్స్ అంటే
అన్నం,రాగి సంగటి లాంటివి.
మరో భాగంలో ప్రోటీన్స్ అంటే పప్పు, సాంబార్ (కందిపప్పు, పెసరపప్పు) లాంటివి కానీ, గ్రీన్ లీఫీ వెజిటేబుల్ కర్రీస్ (క్యారట్, పాలక్ లాంటివి).
మరో భాగంలో ఫైబర్ అంటే పీచు పదార్థాలు ఆకుకూరలు కానీ, లేదా చపాతీ లాంటివి. రోజు గుడ్డు కంపల్సరీగా ఇవ్వాలి.
వీటితో పాటు ఫ్రెష్ ఫ్రూట్ ను స్నాక్ గా ఇంటర్వెల్ టైం లో ఇవ్వాలి. ఫ్లూయిడ్స్ కూడా ఎక్కువగా పిల్లలకు అందించాలి. ఇంక నైట్ టైం లో
లైట్ ఫుడ్ ఇచ్చి పాలు తాగించాలి. కర్డ్ రైస్ ను నైట్ టైం లో యవాయిడ్ చేయడం మంచిది. ఇవి మాత్రమే కాదు ఐరన్ రీచ్ ఫుడ్స్ అంటే చిక్కి( వేరుశనగ ముద్ద) లాంటివి పిల్లలకు రోజులో ఒక్కసారైనా అందించాలి.
ఇలా చేస్తే పిల్లలు ఆరోగ్యకరంగా ఎదుగుతారు అని అమ్ము చెప్పగానే చాలా మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చావే థాంక్యూ వెరీ మచ్ రేపటి నుంచి మా పిల్లల లంచ్ బాక్స్ ను ఇలానే రెడీ చేస్తాము అని అంటే ఆనందపడింది.అది సరేనే నువ్వు చెప్పినట్లే అన్నీ
వండి పెడుతాం. వాళ్ళు తినరే మరి దాన్ని సంగతేంటి అంది లల్లి. ఈసారి కాల్ చేసినప్పుడు మనం దాని గురించి మాట్లాడుకుందాం సరేనా….!
ఓకే నేనొక పేషంట్ ను అటెండ్ అవ్వాలి అంటూ అమ్ము బై చెప్పి వెళ్ళగానే లల్లి, రీతు కూడా తమ తమ బాధ్యతలలో నిమగ్నమయ్యారు..

Written by Dr.Neelam Swathi

చిన్న చెరుకూరు గ్రామం,
నెల్లూరు.
6302811961.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

సంస్కృతి

దేశభక్తి గీతం