ప్రసిద్ధ సాహితీవేత్త శ్రీ తిరుమల రామచంద్ర గారి మూడో సంతానం ఈమె.అమ్మ అనంతలక్ష్మి గారు.అక్క అన్ని తర్వాత తన తండ్రి 47వ ఏటపుట్టారు ఆముక్తమాల్యద.శ్రీవైష్ణవసంప్రదాయకుటుంబంలో భోగి పండుగ రోజు పుట్టిన ఈమె కు ఆండాళ్ అని పేరు పెట్టారు.కానీశ్రీ రాళ్ళపల్లి అనంత కృష్ణ శర్మ గారు ఆముక్తమాల్యద అని పెట్టడం ఓమలుపు.పి.జి.చేసిన ఈమె హిందీ విశారద ఆంగ్ల హిందీ టైపింగ్ నేర్చుకుని ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లో హిందీ టైపిస్ఝ్ గా చేరారు.ఆపై ఇండియన్ బ్యాంక్ లో గుమాస్తా జాబ్ ! జీవితం లో ఒక లక్ష్యం పెట్టుకుంటే విసుగు ఉండదు..అన్నీ తండ్రి మాటలు ఆమె కి వెలుగు దివ్వెలు!ఇక ఆమె మాటల్లో అనుభవాలు తెలుసుకుందాం.
“బాల్యం లో నేను బాగా నల్లగా ఉండేదాన్ని.అంతాకరుప్పి అని పిల్చి ఏడ్చించేవారు.నాన్నగారు ఓదార్చెవారు.కృష్ణుడు నలుపు కానీ అందరికీ ఆనందగోపాల బాలుడు! నేనూ నలుపు.కానీ అంతా నాపై ప్రేమ గౌరవం ఆదరణ చూపుతారు.మంచిగుణాలు ముఖ్యం.ఆయన మాటలు మంత్రంలా పనిచేశాయి.పురాణకథలు చెప్తూ సైన్స్ రికార్డు లో బొమ్మలు వేసేవారు.నాన్న స్నేహితులు సంధ్యావందనం శ్రీనివాసరావు విద్వాన్ విశ్వం రావూరి దొరైస్వామిగార్ల ఇళ్ళకి వెళ్లేదాన్ని.నేను పాడే కీర్తనలు మెచ్చుకునేవారు.మిమిక్రీ చేసేదాన్ని.నాన్నగారికి హైదరాబాద్ బదిలీ కావడం నాకు బాధ కలిగించినా ఆయన లేఖలు ఓదార్పు కల్గించేవి.మిరియాలరామకృష్ణ గారి గేయాలు హాయిగా పాడుకునే దాన్ని.ఆయన బహూకరించిన బాలాభిరామం ఇప్పటికీ నాదగ్గర భద్రంగా ఉంది.మామేనత్తకొడుకుతో నా పెళ్ళి పాప అపరాజిత పుట్టడం అందమైన మధురానుభూతి! కానీ ఏణార్ధం వయసులో మూత్ర పిండ కాన్సర్తో పాప నన్ను దుఃఖసాగరంలో ముంచి శాశ్వతంగా దూరమైంది.నాన్న ఓదార్పు తో తేరుకున్నాను.
“ఎం.ఎ.ఫిలాసఫీ చదివిన నీవు ఇలా ఏడ్వకూడదు” అని ఓదార్చే వారు.నాన్న అంటే నారాయణుడు అనే భావం నాలో బాగా పాతుకుపోయింది.ఆ తర్వాత నాకు బాబు అప్రమేయ పుట్టడంతో తెప్పరిల్లాను.మానాన్నగారి లాగా భాషలు శాస్త్రాలు అంటే మక్కువ ఎక్కువ బాబుకి.నేనూ ప్రాణిక్ ఆక్యూ హస్తముద్రల చికిత్స నేర్చుకుని ఇప్పుడు మ్యూజిక్ థెరపీ నేర్చుకుంటున్నాను. బుక్క పట్నంకి చెందిన శ్రీనివాసాచార్యులవారి గ్రంథం పై పరిశోధన చేశాను.నాగైడ్ శ్రీముడుంబైనరసింహాచార్యులుగారు.నాన్నకి ఖద్దర్ చొక్కాలు పంచెలు కొనివ్వడం లో నాకెంతో తృప్తి ఆనందం కలిగించేది.ఆయన మరణంతో పూర్తిగా విషాదం లో మునిగాను.కానీ ఆయన మాటలు గుర్తుచేసుకుంటూ సందేశాత్మక కథలు భక్తి గీతాలు రాస్తూ పాడుతూ చెన్నై రేడియో లో ప్రోగ్రాంలు ఇస్తున్నాను.చెన్నపురి కథలు మద్రాసు బతుకులు కథాసంపుటాలు వెలుగు చూశాయి.ధర్మశాస్త్రంగణేశ్ మొదలైన దిన మాస పత్రికలలో కవితలు కథా నికలు వ్యాసాలు రాస్తుంటాను.థర్మశాస్త్రం మాసపత్రికలో ఆరోగ్యచంద్రిక అనే సీరియల్ రాస్తున్నాను.2019లో చెన్నై శ్రీ కన్యకాపరమేశ్వరి విశ్వవిద్యాలయంవారు అభిజ్ఞ అని బిరుదు ప్రదానం చేశారు.” ఇలా తన తండ్రిని గూర్చిన విషయాలు పంచుకున్నారుఆమె.తండ్రికి తగ్గ తనయ ఐనా ఆమె కి శుభాభినందనలు