దీపాలపండగ

కథ

కొప్పు తాయారు

అక్కా!అక్కా!పరుగులు ఉరుకులతోవచ్చింది రమణీ, రమణి పేరు ,ఎంత మంచిదో అంత చక్కనిది, అంత మంచి రమణీయ మైన బుద్ధి .
తొందరలో కాలు తొట్రు పడి కిందపడి పోయింది .!
ఆ ఏడుపుకు అందరూ పరుగెత్తుకు వచ్చారు. ఏమైంది? ఏమైంది? అని. అన్న ప్రభాస్ కూడా వచ్చాడు! అన్నని చూస్తూనే ఏడుపు అగి పోయింది వెంటనే !
ఎత్తుకుని” ఏమైందిరా నాన్నా”!!అన్నాడు,”ఎందుకురా”
” పరుగులు !ఇప్పుడు చూడు నీకు దెబ్బ తగిలింది అలా పరుగెడితే దెబ్బలు తగలవా? చెప్పరా”?
అంతే ఎత్తుకోగానే మరచి పోయింది!ఏడుపు కూడా
ఆ పేసింది,వెంటనే “అది కాదన్నయ్యా!నీకు ఈ మతాబా, సిసిoద్రి,గొట్టాలు చూపెడదామని వచ్చాను,జారిపోయాన..అన్నీ అయిపోయాయి,అన్నయ్యా”! అంది.” అబ్బో అన్నీ అయిపోయాయా”!!! “వెరీ గుడ్ తల్లీ”అన్నాడు.
రమణీ వాళ్ళ ఇంటి దీపావళీ
అందరికీ ఒక పది రోజుల ముందు లేక పదిహేను రోజుల ముందు పండగ అయితే వీరింట రెండు
నెలల ముందు నుంచే మొదలవుతుంది అదీ విశేషం
అందుకే అర్భాటంగానే జరుగుతుంది!!!
చాలా చాలా ఎక్కువగా తయారు చేస్తాడు రమణీ అన్నయ్యా ప్రభాస్.
రమణీ మాత్రం బాసన్నా అని పిలుస్తుంది.
“సరే తల్లీ” నేను అంతా రెఢీ చేస్తగా ఈ సారి కొచెం మనకి నిదానమయింది,కానీ చాలామంది కూర్చుంటే త్వరగానే అవుతుంది లే”
అని వాళ్ళ అక్కవేపు చూసి చెప్పి, బయటకు నడిచాడు.
ఒక అందమైన అభిమానాల నిలయం రమణీ వాళ్ల కుటుంబం. ఆ యింట ఎవరు అడుగు
పెట్టినా అబ్బ ఎంత బాగుందో అనే భావం పుట్టుకొస్తుంది.
అంత ఆనందం వెల్లివిరుస్తుంది.
ఈసారి అందర్నీ అన్నయ్య అక్కల్ని పండక్కి పిలవాలి కుటుంబాలతో సహా అన్నాడు వాళ్ల నాన్నగారితో. అప్పుడు పండగ గొప్పగా చేయాలని నాన్న! అన్నారు వాళ్ల నాన్నగారు. అయితే తారాజువ్వలు మతాబాలు,చిచ్చుబుడ్లు,సిసింద్రీలు అన్నీ చేస్తున్నాను అన్నాడు.
“గుడ్ బాగుంది” అన్నారు వాళ్ల నాన్నగారు.
ఎదురు చూసిన పండుగ రానే వచ్చింది ఇల్లు కళకళలాడుతోంది… అలంకరణలతోటి కొత్త బట్టల తోటి మధ్యలో పిండి వంటలు గుభాళింపుల తోటి మహా ఆనందంగా ఉంది నరకచతుర్థి రానే వచ్చింది….స్నానాలు పూజలు ..భోజనాలు.. అన్నీ అయ్యాయి.
దీపావళికి బొప్పాయి ఆకులు తెప్పించి వాటి కాడలకి ఒత్తులు కట్టి రెడీ చేస్తున్నాది వాళ్ళ పెద్దక్క అందరికీ సరిపడా.ఇంతలో వాళ్ళ నాన్నగారు “బాబూ” ,”బాసూ”
సహాయం చేసిన వారందరికీ ఇచ్చవా టపాకాయలు”? అన్నారు ఆ ప్రతీ ఒక్కరికీ ఇచ్చాను నాన్నగారు.
దీపావళి పండుగ రానే వచ్చింది.
ఆనందాలు పంచ పిన్నలు,పెద్దలు మనస్సులు ఉల్లా సంతో నిండి పోతుంది ఈ పండగ పద్ధతే అంత.
దీపాలతో లోగిలి నిండిపోయింది ఆకాశంలోని నక్షత్రాలన్నీ ఈ లోగిలి
కివచ్చాయా అన్నట్టు వుంది ఇల్లంతా !ఇదే నిజమైన పండగ అందరికి!!
పిల్లలు బొప్పాయి ఆకులు పట్టుకుని వాటికున్న ,వత్తులు, వెలిగించి పాడుతున్నారు*
“దిబ్బు దిబ్బు దీపావళీ మళ్ళీ వచ్చే నాగులచవితి”
అని బొప్పాయి ఆకు కాడ పట్టుకుని వెలుగుతున్న వత్తులతో నేలకి తాళ యుక్తంగా కొడుతూ పాడేరు.
ఇంక మొదలు ఎవరికి కావలసిన టపాకాయలు వారు కాల్చడం మొదలెట్టారు….అక్క రెడీగా పిల్లలూ రండి మీకు భోజనo పెట్టేస్తాను అని అందరికీ ముద్దలు కలిపి పెట్టింది ,ప్రేమతో అదొక సంతోషం… పిల్లలు ముచ్చట పడతారు ఎందుకంటే వాళ్ళకి యే కష్టం లేకుండా అన్నం తినడం అయిపోతుంది కదా అందుకు
మళ్ళీ మొదలైంది కాల్చడం పూర్తి
అవుతున్న సమయంలో ఎక్కడో వున్న ఒక పెద్ద అవుటుని తెచ్చింది రమణీ..
బాసన్నయ్య అడిగాడు “అదేమిటంటే” “అవుటన్నా” అంది.” నువ్వు వద్దులే నే కాలుస్తా అని పట్టుకెళ్ళి కాల్చాడు “మొదటి ప్రయత్నం లో కాలలేదు, అందుకు మళ్ళీ ప్రయత్నించే సరికి ఏం
జర్గిందో ఊహించే లోపలే అన్న మొహం మీదే పేలిపోయి… . అన్నయ్య గట్టిగా “అమ్మా”!! అని అరిచేడు.ఆ అరుపుకి అందరూ గాభరాగా అన్నచుట్టూ చేరేసరికి పాపం రమణీ …బిక్క చచ్చిపోయి… పలకరించేవారు లేక ఏమైందో తెలియక… . అయోమయ అవస్థలో…
వుండగా అక్కవచ్చి రా అని దగ్గరకు తీసుకుంది.
డాక్టరు వచ్చారు అన్నయ్యని లోపల ఏంచేస్తున్నరో తెలియక ఆ చిన్ని మనసు పడ్డ బాధ ఆ పరమాత్ముడికే తెలుసు.కానీ భగవంతుడికి ఆ బిడ్డ పై దయవుండడం వల్ల వాళ్లన్న బాగుపడ్డాడు ఆ దీపావళీ మాత్రం”” రమణీ మనసులో చెరగని ముద్రగా మిగిలింది.”చిన్నప్పుడు జరిగిన ,విషయం మర్చిపోలేక జరిగిన దానికి తానే బాద్యురాలని దుఃఖపడని క్షణం లేదు !!
అదే రమణి మనసు,ఆ సున్నితత్వం, ఆమెకి శాపమై పోయింది.మంచితనం కూడ శాపమే, అందుకే ఎనలేని బాధ ని అనుభవిస్తుంది మంచి మనసు!!!

కొప్పరపు తాయారు
చరవాణి:944046079

Written by Tayaru

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ప్రభాత కమలం

మన మహిళామణులు