ముగ్గురమ్మలు

రూప

ఆహా ఎంత అద్భుతం ఈ దృశ్యం!
ముగ్గురమ్మలు కూడిన తరుణం
పార్వతీ సరస్వతీ లక్ష్మి ప్రతిరూపాలుగా
గంగా గోదావరి కృష్ణమ్మల సంగమంలా

అదిగో ముమ్మూర్తులా సాధికారత
ఆ మహిళా మాణిక్యాలే నిదర్శనం
సంపూర్ణ సాధికారత దూరంలో లేదు
ఇందుకు ఈ చిత్రమే నిలువెత్తు సాక్ష్యం

చీరలు నగలు నుంచి తల ఎత్తితే
అసలైన జీవితం ఎదుట ఉంటది
చాదస్తాల కుబుసం వదిలించుకంటే
కొత్త దారులు అగుబడుతుంటవి

భక్తురాలు అని చెప్పుకోవడానికి
పూజ గదిలోనే గడపక్కరలేదు
కరుడు గట్టిన నాస్తికులైనా ఓ దశలో
అస్తికత్వం చాటుతారిక్కడ

మంచిదానవని తెలుపుకోవడానికి
ఇంట్లోనే ఉండిపోఅవసరం లేదు
ధైర్యాన్ని తోడు పిలుచుకుంటే
బయటి ప్రపంచం ఏమంత పెద్దది కాదు

అర్హతలను పేర్చుకుంటూ పోతే
అవకాశాలు ఎదురొస్తాయి
ఒకరు అందించడమేంటి
పుచ్చుకొని సాగిపోతుండటమే

Written by Rupa devi

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

సరళోక్తి

ప్రభాత కమలం